Jump to content

రిషిత్ రెడ్డి

వికీపీడియా నుండి
రిషిత్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నిర్వెట్ల రిషిత్ రెడ్డి
పుట్టిన తేదీ (2003-11-29) 2003 నవంబరు 29 (వయసు 21)
బ్యాటింగుకుడి-చేతి
బౌలింగుకుడి చేతి మీడియం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022–ప్రస్తుతంహైదరాబాదు
మూలం: Cricinfo, 13 నవంబరు 2022

రిషిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇండియా క్రికెట్ టీమ్ కు ఎంతో మంది స్టార్లను అందించిన హైదరాబాద్ మరో యువ క్రికెటర్ రిషిత్ రెడ్డిని జాతీయ జట్టుకు పరిచయం చేసింది. వినూ మన్కడ్ ట్రోఫీతో పాటు ఇండియా అండర్ –19 టీమ్ తరఫున సత్తా చాటిన అతను ఇప్పుడు అండర్ –19 ఆసియా కప్ బరిలోకి దిగే ఇండియా టీమ్ కు సెలక్ట్ అయ్యాడు.యష్ దుల్ కెప్టెన్సీలోని ఈ టీమ్ లో హైదరాబాద్ నుంచి పేస్ ఆల్ రౌండర్ రిషిత్ కు స్టాండ్ బై ప్లేయర్ గా అవకాశం లభించింది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హైదరాబాద్ గబ్చిబౌలికి చెందిన 18 ఏళ్ల రిషిత్ రెడ్డి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.తండ్రి శరత్ రెడ్డి వాలీబాల్ ప్లేయర్ అయినా, క్రికెట్ పై ఆసక్తి ఉండేది.మామ నితీశ్ రెడ్డి స్టేట్ టీమ్ కు ఆడారు. దాంతో, రిషిత్ క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు.ప్రస్తుతం బాగ్ లింగంపల్లి అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ లోని స్పాట్ లైట్ అకాడమీలో కోచ్ సురేశ్ ఆధ్వర్యంలో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు.హెచ్ సీఏ లీగ్స్ తో పాటు స్టేట్ అండర్–14 టీమ్, అండర్ –16 టీమ్ తరఫున సత్తా చాటాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రిషిత్ ఆటను ఇంకా మెరుగు చేసుకునేందుకు చదువుకు దూరంగా ఉన్నాడు.ఈ సీజన్ వినూ మన్కడ్ నేషనల్ అండర్ –19 ట్రోఫీలో ఏడు మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ను సెమీస్ చేర్చడంలోకీ రోల్ పోషించాడు.ఈ టోర్నీలో గోవాపై 6/34 బెస్ట్ పెర్ఫామెన్స్ చేయడం అతని కెరీర్ ను మలుపు తిప్పింది.

ఆసియా కప్ లో అవకాశం

[మార్చు]

గోవాపై మ్యాచ్ ప్రదర్శనతో జూనియర్ సెలక్షన్ కమిటీ అతడిని బంగ్లాదేశ్, ఇండియా–ఎ, బి టీమ్స్ మధ్య కోల్ కతాలో జరిగిన అండర్ –19 ట్రై సిరీస్ కు ఎంపిక చేసింది.అప్పటికి రిషిత్ కూచ్ బెహార్ ఫస్ట్ క్లాస్ టోర్నీలో హైదరాబాద్ కు ఆడుతున్నాడు. త్రిపురతో మ్యాచ్ లో ఫస్ట్ రోజు ఆట తర్వాత ఓ ప్లేయర్ కు రీప్లేస్ మెంట్ గా ట్రై సిరీస్ లో ఇండియా–ఎ టీమ్ లోకి వచ్చిన రిషిత్ ఈ చాన్స్ ను సద్వినియోగం చేసుకున్నాడు.చాలా గట్టి టీమ్ అయిన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల స్పెల్ (5/53) తో మంచి ప్రదర్శన చేసాడు . దాంతో, ఆసియా కప్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికయ్యాడు.[2]

స్టాండ్ బై ప్లేయర్స్

[మార్చు]

రిషిత్ రెడ్డితో పాటు ఆయుశ్ సింగ్ ఠాకూర్, ఉదయ్ సహరాన్, షశ్వత్, దంగ్వాల్, ధనుశ్ గౌడ, పీఎం సింగ్, రాథోడ్ లు స్టాండ్ బై ప్లేయర్స్ గా ఎంపికయ్యారు.[3]

టార్గెట్ టీమిండియా

[మార్చు]

అండర్ –19కు ఆడుతున్నప్పుడు కోచ్ లు గౌస్ బాబా, రొనాల్డ్ రోడ్రిగ్స్, ఆ టీమ్ కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఆసియా కప్ లో రాణిస్తే. నెక్స్ట్ ఇయర్ అండర్ –19 వరల్డ్ కప్ నకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ లో ధోనీ, బౌలింగ్ లో డేల్ స్టెయిన్ నా ఫేవరెట్ ప్లేయర్స్. టీమిండియాకు ఆడటమే నా టార్గెట్ అని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

మూలాలు

[మార్చు]
  1. Velugu, V6 (2021-12-11). "ఆసియా కప్ టీమ్ కు ఎంపికైన హైదరాబాదీ". V6 Velugu. Retrieved 2021-12-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "U-19 World Cupకి భారత్ జట్టు వైస్ కెప్టెన్ గా గుంటూరు కుర్రాడు". Samayam Telugu. Retrieved 2021-12-27.
  3. "U19 Asia Cup: భారత జట్టు ప్రకటన.. హైదరాబాదీ ఆల్ రౌండర్ కు చోటు". Sakshi. 2021-12-10. Retrieved 2021-12-27.

బాహ్య లంకెలు

[మార్చు]