రీనా కౌశల్ ధర్మ్‌శక్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రీనా కౌశల్ ధర్మ్‌షక్తు (హిందీ: रीना कौशल धर्म्शाक्तु ) భూ గ్రహ దక్షిణ ధృవానికి చేరిన మొదటి భారత మహిళ.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

రీనా పంజాబ్ నందలి హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పంజాబ్ కు చెందినవారు. తల్లి ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు. ఆమె డార్జిలింగ్ లో పెరిగారు. ఆమె డార్జిలింగ్ లోణి "హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్" లో పర్వతారోహణ కోర్సులో శిక్షణ పొందారు. ఆమె హిమాలయాలలోని వివిధ అధిరోహనలకు నాయకత్వం వహించారు. ఆమె భర్త లవ్ రాజ్ సింగ్ ధర్మ్‌షక్తు‎ కూడా పర్వతారోహకుడే. ఆయన ఐదు సార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి. హిమాలలలో ఎవరెస్టు శిఖరంతో పాతు 38 పర్వతాలను అధిరోహించిన వ్యక్తి.

విజయాలు[మార్చు]

డిసెంబరు 29 2009 లో ఆమె ఎనిమిది మంది మహిళల కామన్‌వెల్త్ బృందంతో కలసి 900 కిలోమీటర్ల అంటార్కిటిక్ మంచు ప్రాంతం గుండా దక్షిణ ధృవం లో స్కై-రన్ చేశారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Delhi girl becomes first Indian woman to ski to South Pole". timesofindia.indiatimes.com. January 1, 2010. Retrieved 2010-01-01. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]