Jump to content

రుక్సానా కౌసర్

వికీపీడియా నుండి

రుక్సానా కౌసర్ ఉగ్రవాదిని చంపిన మహిళ. కాశ్మీర్ తీవ్రవాదుల గుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ. జమ్మూకి 217 కి.మీ. దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం రుక్సానాది. కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా. అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాది ని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు. సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాల పాలయ్యాడు. తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది. 'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె ధ్యేయం భారత సైన్యంలో చేరడం.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు. (ఈనాడు8-10-2009).రుక్సానా కౌసర్‌ ఇంటిపై రాత్రి గ్రెనేడ్‌ దాడి జరిగింది. అయితే ఆ సమయంలో ఇంటిదగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. దగ్గరలోని కొండలపైనుంచి తీవ్రవాదులు రెండు గ్రెనేడ్లు విసరగా అవి గురితప్పి ఆమె ఇంటికి దూరంగా పడ్డాయి.(ఈనాడు1.11.2009)

పారా మిలటరీలో ఉద్యోగం

[మార్చు]

లష్కరే తోయిబా తీవ్రవాదిని హతమార్చి వీరనారి గా పేరు సాధించిన రుక్సానా కౌసర్‌ను ప్రత్యేక పోలీసు అధికారిగా నియమించారు. ఆమెతో పాటు తీవ్రవాదుల దాడిలో గాయపడ్డ ఆమె సోదరుడు ఐజజ్‌, పినతండ్రి హుస్సేన్‌లను కూడా పోలీసు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.(ఈనాడు3.11.2009) ఉగ్రవాది తలకు రూ.8.5 లక్షల వెలకట్టిన సర్కారు ఆ మొత్తాన్ని ఆమెకు అందజేయ లేదని అఖిలభారత ఉగ్రవాద వ్య తిరేక ఫ్రంట్‌ ఛైర్మన్‌ ఎంఎస్‌ బిట్టా తెలిపారు. రుక్సానా పారా మిలటరీ లో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలన్న తన వినతిని పునరుద్ఘాటించింది. 'ప్రత్యేక పోలీసు అధికారి ఉద్యో గం అక్కర్లేదు. కేంద్ర భద్రతా బలగాలైన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ల లో శాశ్వత కొలువే నాకు సమ్మ తం' అని ఆమె స్పష్టం చేసింది. దేశంలో బాలలందరికీ ఆరునెలలసైనిక శిక్షణ ఇవ్వాలని, అప్పుడే వారు ఉగ్రవాదులను ఎదుర్కొనగ ల ధైర్య, స్థయిర్యాలు కలిగి ఉంటారని పేర్కొంది. (ఆంధ్రజ్యోతి8.11.2009)