Jump to content

రుద్ర ఐ.పి.ఎస్.

వికీపీడియా నుండి
రుద్ర ఐ.పి.ఎస్.
(2016 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.బాలకృష్ణారెడ్డి
నిర్మాణం టి.రాజశేఖరరెడ్డి
తారాగణం రాజ్‌కృష్ణ,
కీర్తన,
భానుచందర్
చంద్రమోహన్,
విజయ రంగరాజు
సంగీతం ఘంటాడి కృష్ణ
ఛాయాగ్రహణం వంశీకృష్ణ
నిర్మాణ సంస్థ అజిత్ క్రియేషన్స్
విడుదల తేదీ జూన్ 17, 2016
నిడివి 145 నిమిషాలు
భాష తెలుగు

రుద్ర ఐ.పి.ఎస్. 2016, జూన్ 17న విడుదలైన తెలుగు యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. ఈ చిత్రాన్ని రాజ్‌కృష్ణ, కీర్తన ఆనే నూతన నటీనటులతో, బి.బాలకృష్ణారెడ్డి అనే నూతన దర్శకునితో టి.రాజశేఖరరెడ్డి నిర్మించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: బి.బాలకృష్ణారెడ్డి
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • స్టంట్: మార్షల్ రమణ
  • కూర్పు: నందమూరి హరి
  • ఛాయాగ్రహణం: వంశీకృష్ణ

అపోజిషన్ పార్టీకి చెందిన ఓ పొలిటికల్ రౌడీ బాలిరెడ్డి ఎలాగైనా రాష్ట్రానికి సిఎం కావాలని చూస్తుంటాడు. అతని మేనల్లుడు రాకేష్ మాఫియాతో సంబంధాలు పెట్టుకుని అక్రమాలు చేస్తూ తన మామకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అలాగే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల మంచి కోసం పోరాడే వ్యక్తి శింబు ప్రసాద్ బాలిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఈ క్రమంలో బాలిరెడ్డి రాకేష్ ఓ అమ్మాయిని చంపుతాడు. ఆ కేసుతో బాలిరెడ్డి సిఎం ప్రయత్నాలకు అడ్డంకి ఏర్పడుతుంది. అదే సమయంలో ఆ కేసును రుద్ర అనే నిజాయితీపరుడైన ఐపిఎస్ ఆఫీసర్ పరిశోధిస్తుంటాడు. దీంతో బాలిరెడ్డి రుద్రను చంపాలని ప్రయత్నిస్తాడు. అసలు రాకేష్ ఆ అమ్మాయిని ఎందుకు చంపుతాడు? రుద్ర ఆ కేసును ఎలా డీల్ చేస్తాడు? చివరికి రుద్ర నిందితులను శిక్షించాడా లేదా? అనేదే ఈ చిత్ర కథ.[2]

మూలాలు

[మార్చు]
  1. web master. "Rudra IPS (B. Balakrishna Reddy) 2016 Rudra". ఇండియన్ సినిమా. Retrieved 15 November 2023.
  2. 123telugu Team. "సమీక్ష : రుద్ర ఐపిఎస్ – విసిగించే పోలీస్ స్టోరీ". 123 తెలుగు.కామ్‌. Retrieved 15 November 2023.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)