రుద్ర రాజు నరసింహ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రుద్ర రాజు నరసింహ రాజు ( 1895 - 1973) తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.

బాల్యము

[మార్చు]

రుద్రరాజు నరసింహ రాజు గారు 1895 వ సంవత్సరములో పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో జన్మించారు.

గ్రంధాలయోధ్యమముతో అనుబంధము

[మార్చు]

రుద్రరాజు నరసింహ రాజు సంస్కృతాంద్ర భాషా కోవిదులు. వీరభద్ర విజయము, శ్యమంతకోపాఖ్యానము విమర్శ గ్రంథాలు, గీతా సుగీతాకర్థవ్య అను గ్రంథాలను వ్రాశారు. తమ కుటుంబ సభ్యులు పోడూరి వెంకయ్య గార్ల సహకారంతో 1914 లో పోడూరు గ్రామంలో శ్రీరామచంద్ర గ్రంథాలయాన్ని స్థాపించి ఎంతగానీ అభివృద్ధి చేశారు. పలు ఇతర గ్రంథాలయాల స్థాపనకు తోడ్పడ్డారు. అయ్యంకి వారిని అనేక సార్లు తన గ్రంథాలయా నికి అహ్వానించారు. నేడు వారి అడుగు జాడలల్లో వారి పుత్రులు చిన నరసింహ రాజు పనిచేస్తూ నిరంతరం గ్రంథాలయాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]

గ్రంథలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము. పుట.93