రుహానికా ధావన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రుహానికా ధావన్ భారతీయ టెలివిజన్ బాల నటి. 2012లో జీటీవిలో ప్రసారమైన మిసెస్.కౌశిక్ కీ పాంచ్ బహూయే సీరియల్ లో ఆషీ పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ సీరియల్ తరువాత స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న యే హై మొహొబ్బతే సీరియల్ లో రూహీ పాత్రలో, ప్రస్తుతం పీహూ పాత్రలో నటిస్తున్నారు ఆమె. ఆమె తన నటనతో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇండియన్ టెలీ అవార్డ్ ఫర్ మోస్ట్ పాపులర్ చైల్డ్ యాక్ట్రెస్ పురస్కారం కూడా అందుకున్నారు రుహానికా.

జనవరి 2014లో జయ్ హో సినిమాలో అతిధిపాత్రలో కూడా నటించారు ఆమె. ఫిబ్రవరి 2015లో సన్నీ డియోల్ నటించిన ఘయాల్ వన్స్ ఎగైన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 2016లో విడుదలైన  ఈ సినిమాలో నటించారు రుహానికా.