రూబల్ షెకావత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూబల్ షెకావత్
జననం (1998-03-29) 1998 మార్చి 29 (వయసు 26)
తల్లిదండ్రులు
  • రేణు రాథోడ్ (తల్లి)
బంధువులుహర్షవర్ధన్ సింగ్ షెకావత్ (సోదరుడు)

రూబల్ షెకావత్ (జననం 1998 మార్చి 29) భారతీయ మోడల్, సినిమా నటి. ఫెమినా మిస్ ఇండియా 2022లో ఆమె మొట్టమొదటి ఫైనలిస్ట్.[1] ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ వోగ్ ఇండియాలో ఆమె పి.ఎమ్.జె జ్యువెల్స్ ప్రకటనతో కనిపించింది. రోమియో: తేరీ హర్ అదా (2023), ఇష్క్ నహీ కర్తే (2022) చిత్రాలలో ఆమె నటనకు ప్రసిద్ధి చెందింది.

కెరీర్[మార్చు]

మోడలింగ్ లో మిస్ దివా - 2019 కోసం రాజస్థాన్ నుండి పోటీదారుగా కెరీర్ మొదలుపెట్టింది. టాప్ 5లో ఒకరిగా నిలిచింది. 2022లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్‌గా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత, మిస్ ఇండియా అందాల పోటీలో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది.

2022లో, ఆమె ఏ పిల్లా చిత్రంలో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

మూలాలు[మార్చు]

  1. "Miss India 2023: మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా | Nandini Gupta from Rajasthan crowned Miss India 2023 bvn". web.archive.org. 2023-12-04. Archived from the original on 2023-12-04. Retrieved 2023-12-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)