రెండవ రాజరాజ చోళుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Rajaraja Chola II
రెండవ రాజరాజ చోళుడు
Parakesari
Chola territories during 1170
Reign1146–1173
PredecessorKulothunga Chola II
SuccessorRajadhiraja Chola II
మరణం1173
Avanimulududaiyal
Bhuvanimulududiyal
Ulagudai Mukkokilan
తండ్రిKulothunga Chola II

రెండవ రాజరాజ చోళుడు సా.శ 1150 లో ఆయన తండ్రి తరువాత చోళసింహాసనం అదిష్టించాడు. రెండవ రాజరాజ పాలన చోళపాలన ముగింపుకు సంకేతాలు చూపింది.

బలహీనత అధికరించుట[మార్చు]

రాజరాజు పాలనలో రాజ్య భూభాగం పూర్వీకుల కాలంలో చోళ భూభాగాల విస్తీర్ణం ఉన్నట్లు అలాగే ఉంది. వెంగీదేశం ఇప్పటికీ చోళ పాలనలో దృఢంగా ఉంది.

చోళ కేంద్ర పరిపాలన సామ్రాజ్యం వెలుపలి భాగాల మీద వారి నియంత్రణ, సమర్థవంతమైన పరిపాలనకు సంబంధించి బలహీనతలను చూపించింది. ఇది రెండవ రాజరాజ చోళుడు పాలన ముగిసే సమయానికి విశ్లేషించబడింది. అయినప్పటికీ రెండవ రాజరాజ చోళుడు వేంగి, కళింగ, పాండ్య, చేర భూభాగాల మీద తగిన నియంత్రణను తిరిగి పొందాడు. ఆయన కాలంలో రాసిన తమిళ కవితలలో ఒకదానిలో వివరించినట్లు ఆయన శ్రీలంక మీద కూడా దాడి చేశాడు. రెండవ రాజరాజ చోళుడు మాత్రమే కాదు, అతని వారసులైన మూడవ కులోత్తుంగ చోళుడు వంటివారు కూడా వారి సైనిక సామర్థ్యాలను, సాంస్కృతిక విజయాలను ధ్రువీకరించే త్రిభువన చక్రవర్తిను వంటి బిరుదులను కలిగి ఉన్నారు.

రాజరాజుచోళుడి పాలన చివరి సంవత్సరాలలో, వారసత్వ వివాదం ఫలితంగా రాజ్యంలో సంభవించిన ఒక పౌర అశాంతి పాండ్య దేశాన్ని కలవరపెట్టింది, అది చోళుల ప్రభావాన్ని మరింత బలహీనపరిచింది. మొదటి ఆదిత్య చోళుడి కాలం నుండి పాండ్యులు చోళులకు లొంగిపోయినప్పటికీ వీరరాజేంద్ర కాలం వరకు గట్టిగా నియంత్రించబడినప్పటికీ, మదురై రాజ్యం ఎప్పటికప్పుడు స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తరువాత మారవర్మను లేదా మరవరంబను సుందర పాండ్యను, జాతవర్మను వీరపాండ్య, జాతవర్మను సుందర పాండ్యను వంటి పాండ్యులు తమ శక్తిని, ప్రతిష్ఠను క్రమంగా పెంచుకుంటూ 1200–1300 కాలంలో దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా అవతరించారు. ఈ పరిణామాలు చోళ రాజ్యాన్ని నెమ్మదిగా కానీ కచ్చితంగా బలహీనపరిచాయి. అయినప్పటికీ కులోత్తుంగ -3 (1178–1218) స్థిరమైన పాలనలో స్వల్ప పునరుజ్జీవనం జరిగింది.

ఆయన కాలంలో చోళులు సైనికపరంగా ఆధిపత్యం చెలాయించినందున, రాజరాజ చోళుడు విజయం, అతని వినూత్న నిర్వహణ కార్యక్రమాలను కొన్ని సాహిత్యాలు గుర్తించి ప్రస్తావించాయి. రాజగోపాల పెరుమాళు ఆలయంలో ఆయన స్థాపించిన శాసనం నుండి సారాంశం ఇక్కడ ఉంది:

“.. లెక్కలేనన్ని యుగాలుగా భూదేవత గెలుచుకుంది. ఆయన వీరుల సింహాసనం మీద కూర్చోవడం సంతోషంగా ఉంది. (స్వచ్ఛమైన బంగారంతో) ..

విల్లవరు (చేరాలు), తెలుంగరు, మీనవరు (పాండ్యులు), .. ఇతర రాజులు ఆయన ముందు సాష్టాంగంగా నమస్కరించారు. (ఈ) రాజు పరాకేసరివర్మను 8 వ సంవత్సరంలో (పాలనలో), మూడు ప్రపంచాల చక్రవర్తి (శ్రీ-రాజరాజదేవ).[1]


మరణం, వారసత్వం[మార్చు]

రాజరాజ చోళుడి పాలన 26 సంవత్సరాల కాలం కొనసాగింది శాసనంలో ఉదహరించబడింది. అది ఆయన పాలన ఆయన చివరి సంవత్సరం సా.శ 1173 అని తెలుయజేస్తుంది. రెండవ రాజరాజ చోళుడు ఎక్కువ కాలం జీవించ లేదు. రెండవ రాజరాజ చోళుడి తరువాత చోళ సింహాసనాన్ని అధిరోహించడానికి తగిన ప్రత్యక్ష వారసుడు లేడు కనుక అతను తన వారసుడిగా విక్రమచోళుడి మనవడు రాజధీరాజ చోళుడిని ఎంచుకున్నాడు. పల్లవరాయణపేట శిలాశాసనం ఆధారంగా రెండవ రాజరాజ చోళుడు ఆయన రెండవ రాజాధిరాజ చోళుడిని వారసుడిగా స్పష్టంగా చూపించిన నాలుగు సంవత్సరాల తరువాత మరణించాడు.[2] రాజాధిరాజు స్వయంగా చాలా చిన్నవాడు కనుక రాజరాజ చోళుడి చిన్న కుమారులు భద్రత తగిన చర్యలు తీసుకోవడానికి పల్లవరాయరు సహాయం కావాలి. [3][4] శాసనం ఆధారంగా ఒకటి, రెండు సంవత్సరాల వయస్సులో ఉన్న రాజరాజు పిల్లల రక్షణ కోసం రెండవ రాజరాజు చోళుడు మరణించిన వెంటనే పల్లవరాయరు చర్యలు తీసుకున్నారు.[3] చరిత్రకారుడు కృష్ణస్వామి అయ్యంగారు అభిప్రాయం ఆధారంగా రెండవ రాజరాజు కుమారుడు మూడవ కులోతుంగ చోళుడు చివరి గొప్ప చోళ సార్వభౌమాధికారిగా పరిగణించబడుతున్నాడు.[5] రాజవంశం చివరి వారసులుగా విజయ ఎన్ చోళుడు, మరికొందరు ఉన్నారు.

సాంఘిక-మతపరమైన సాధనలు[మార్చు]

Airavateswarar Temple, Darasuram c. 1200

బలహీనమైన రాజుగా పరిగణించబడుతున్నప్పటికీ ఆయన తన 26 సంవత్సరాల పాలనలో ద్వితీయార్ధభాగంలో ప్రశాంతత, శాంతియుతమైన కాలం అనుభవించినట్లు తెలుస్తుంది. ఈ కాలంలోనే కుంబకోణం సమీపంలోని దారాసురం వద్ద చాలా ప్రసిద్ధ ఐరావటేశ్వర ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఉనికిలో ఉన్న చోళ దేవాలయాలలో త్రిమూర్తులలో ఒకటైన శివ ఆలయాలలో ప్రసిద్ధిచెందిన ఆయయాలలో ఒకటైన తంజావూరులోని బృహదీశ్వర ఆలయ దేవాలయాలు, గంగైకొండ చోళపురం ఇవన్నీ ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. ఐరావతేశ్వరరు (పై చిత్రంలో) ఆలయం హలేబిడు ఆలయం ఆరంభించిన తరువాత ప్రారంభించినప్పటికీ హళిబీడు ఆలయం కంటే ముందుగా నిర్మాణం పూర్తి అయింది. కాని రెండవ రాజరాజ చోళుడి పాలన ముగిసే సమయానికి లేదా ఆయన వారసుడు రెండవ రాజధిరాజ చోళుడి పాలన ప్రారంభ కాలంలోనే పూర్తయింది. ఐరావతేశ్వర ఆలయం తరువాతి చోళ కాలం నాటి నిర్మాణ అద్భుతంగా పరిగణించబడుతుంది. ఈ సంప్రదాయాన్ని మూడవ కులోతుంగ చోళుడు కొనసాగించాడు. ఆయన మధురై, కళింగ, కరువూర్లను స్వాధీనం చేసుకున్నందుకు హొయసల రాజు రెండవ వీర బల్ల ఓటమి జ్ఞాపకార్థం త్రిభువనం వద్ద కంపహరేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో రామాయణం, పెరియ పురాణం, శివ-పార్వతి, వినాయగరు, కార్తికేయ వంటి వాటికి అంకితమైన ఇతర కథలు ఉన్నాయి. ఈ ఆలయం చోళ హస్తకళాకారుల నిర్మాణ సంప్రదాయానికి చిహ్నంగా ఉంది. గణపతి కోసం ఒక చిన్న మందిరం దగ్గర దీనికి సప్తస్వరాలు అని పిలిచే సంగీత సోపానాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ముఖమండపం చాలా గొప్ప నిర్మాణ నమూనాలను కలిగి ఉన్న నిజమైన నిర్మాణ అద్భుతం. ఆలయాలను నిర్మించే శైలిని తరువాతి చోళ సంప్రదాయం కొనసాగించారు. మొదటి కులోత్తుగ చోళుడు నిర్మించిన మేలకాదంబూరు శివాలయం వలె ఇందులో ఏనుగులతో నడిచే రథాలు లేదా రథాల ఆకారంలో ఆలయాలను నిర్మించబడ్డాయి. కదంబూరు శివాలయాన్ని తరువాత చోళ రాజులైన మూడవ కులోత్తుంగ మాత్రమే కాకుండా, కళింగ రాజులు కూడా కొనసాగించారు. అలాగే తూర్పు గంగా రాజు నరసింగదేవా కోణార్కులోని సూర్య ఆలయం నిర్మాణంతో ఈ కొనసాగింపు ముగిసింది. చోళసంప్రదాయ శైలిలో నిర్మించబడిన చోళ దేవాలయాలలో ఇది ఒకటి. ఇది ఇప్పటివరకు వాస్తుశిల్పం పరంగా అసమానంగా ఉంది. ఇది చోళ పాలనలో వచ్చిన రాజవంశాల మీద శాశ్వత ముద్ర వేసింది.

రెండవ రాజరాజ చోళుడు తంజావూరు, చిదంబరం, కంచి, శ్రీరంగం, తిరుచి దేవాలయాలతో పాటు మదురై దేవాలయాలకు కూడా అనేక నిధులు మంజూరు చేసాడు. ఆయన పరశురాం దేశంలోని (కేరళ) దేవాలయాలకు నిత్య సందర్శకుడని విశ్వసిస్తున్నారు. ఆయన ఈ ఆలయాలకు కూడా నిధులను మంజూరు చేసాడు. ఆయన కాలంలో చోళ నావికాదళాలు పశ్చిమ సముద్రంతో పాటు తూర్పు సముద్రంలో కూడా ఆధిపత్యం వహించాయి.

మొత్తంమీద ఆయన, కరువు, పౌర అశాంతి రెండింటిలో ప్రజలకు చేసిన సహాయక చర్యల ద్వారా, మంచి నిర్వహణ ప్రక్రియలను చేసిన మంచి దయగల రాజు. ఇది అణచివేయడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ చివరికి ఆయన దానిని నిలుపుకున్నాడు తన మంత్రులు, సైనికాధికారులు, ప్రజల సాధారణ వర్గాల విధేయత, గౌరవం అందుకున్నాడు.

సామ్రాజ్య విస్తరణ, పాలన, రెండవ వారసుడు రాజరాజ చోళుడు[మార్చు]

పౌర కలవరానికి కారణమైన ఒక కరువు ఉన్నప్పటికీ రెండవ రాజరాజ చోళుడు తన విరోధులను చాలావరకు అదుపులో ఉంచాడు. తమిళాగంలో కొంగునాడు, మదురై, తిరునెల్వేలి, నెల్లూరుతో సహా తమ ఆస్తులతో కూడిన చోళ భూభాగాలను నిర్వహించడంలో విజయవంతమయ్యాడు. గుంటూరు ప్రాంతాలు (రెనాండు, తెలుగు చోళులు రెండవ రాజరాజ చోళుడికి విధేయత కలిగి ఉన్నారు. కాని వారి ప్రాంతాలను మునుపటి కంటే ఎక్కువ అధికారంతో నియంత్రిస్తున్నారు), విసయ్యవడై (విజయవాడ) -ఏలూరు-రాజమండ్రి-ప్రకాశం (ద్రాక్షరామ) ప్రాంతాలు సాంప్రదాయకంగా వెంగీ రాజులచే నియంత్రించబడ్డాయి, కళింగ (దీని రాజు కప్పం చెల్లించే సామంతుడిగా, చోళ అధిపతికి సహాయక పాలెగాడు) .. హుగ్లీ ఒడ్డు వరకు స్వాధీనంలో ఉన్నాయి. అదనంగా ఆయన ఉత్తర శ్రీలంక మీద ఆధీనత కలిగి ఉన్నాడు. అయినప్పటికీ మునుపటితో పోలిస్తే (ఆయన ప్రముఖ పూర్వీకుడు మొదటి రాజరాజ చోళుడి సమయంలో) ఆయన బలహీనమైన నియంత్రణలో ఉన్నాడు. ఆయన చేర రాజులను లొంగదీసుకున్నప్పటికీ తిరిగి కారణంగా పాండ్య అధికారం ఆవిర్భావం, ఆయన వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నట్లు నమ్ముతున్న మలైనాడు రాజులకు మరింత స్వయంప్రతిపత్తిని అనుమతించవలసి వచ్చింది. అయితే రెండవ రాజరాజ చోళుడు తూర్పు గంగావాడి భూభాగాల మీద తిరిగి నియంత్రణ సాధించేంత బలంగా లేడని నిరూపించాడు. ఇది ఆయన పూర్వీకుడు విక్రమచోళ కాలంలో హొయసల చేతిలో ఓడిపోయిఅడు. బహుశా హొయసలు తమను తాము పశ్చిమ చాళుక్యుల నియంత్రణ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. చాళుక్యులు, హొయసల పట్ల శత్రుత్వం ఉన్న కలాచురీలు, కాకతీయులు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర విరోధులు, వారిలో చోళులు, పాండ్యులు కూడా ఉన్నారని తరువాతి సంవత్సరాలలో లభించిన సాక్ష్యాలు రుజువు చేసాయి.

అంతకు ముందువారు
మొదటి కులోత్తుంగ చోళుడు
చోళుడు
1146–1173
తరువాత వారు
రెండవ రాజాధిరాజ చోళుడు

మూలాలు[మార్చు]

  1. South Indian Inscriptions: Miscellaneous inscriptions in Tamil (4 pts. in 2), page 81
  2. Niharranjan Ray; Brajadulal Chattopadhyaya. A Sourcebook of Indian Civilization. Orient Blackswan, 2000 - History - 673 pages. p. 470.
  3. 3.0 3.1 History of South India, page 158
  4. The Cholas: mathematics reconstructs the chronology, page 127
  5. South India and Her Muhammadan Invaders, page 11

వనరులు[మార్చు]

  • History of South India By Pran Nath Chopra, T. K. Ravindran, N. Subrahmanian
  • The Cholas: mathematics reconstructs the chronology By N. Sethuraman
  • South India and Her Muhammadan Invaders By Krishnaswami S. Aiyangar
  • Nilakanta Sastri, K.A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).
  • Nilakanta Sastri, K.A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).