Jump to content

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, రేకుర్తి

అక్షాంశ రేఖాంశాలు: 18°28′5″N 79°6′42″E / 18.46806°N 79.11167°E / 18.46806; 79.11167
వికీపీడియా నుండి
(రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, రేకుర్తి
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, రేకుర్తి is located in Telangana
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, రేకుర్తి
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, రేకుర్తి
తెలంగాణలో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :18°28′5″N 79°6′42″E / 18.46806°N 79.11167°E / 18.46806; 79.11167
పేరు
ప్రధాన పేరు :రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశము
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:రేకుర్తి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:లక్ష్మీనరసింహస్వామి

రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి (హవేలి) మండలం రేకుర్తి గ్రామంలోని పురాతన గుట్టలపై ఉన్న ఆలయం. నాలుగువందల ఏళ్ళ చరిత్ర కలిగివున్న ఈ ఆలయానికి భారతదేశంలోనే సుదర్శన చక్రం స్వయంభువుగా వెలసిన ఏకైక ఆలయంగా పేరుంది.[1] ప్రపంచంలో స్వయంభువుగా సుదర్శన చక్రంతో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి ఆలయాలు రెండు ఉండగా, అందులో ఒకటి ఈ రేకుర్తి ఆలయం.


స్థల విశిష్టత

[మార్చు]

400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామం అప్పట్లో రేణుగా పట్టణంగా పిలువబడేది. ఈ సంస్థానాన్ని అల్లం రాజు పాలించేవాడు. అల్లం రాజు ఈ గుట్టపై ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకోవడమేకాకుండా సైన్యం కోసం ప్రత్యేక స్థావరాలు ఏర్పాటుచేయించాడు. తర్వాతి కాలంలో రేణుగా పట్టణం కాస్త దేవకుర్తిగా, తదనంతరం రేకుర్తిగా మారిందని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో ఈ ప్రాంతం రేణుగా సంస్థానంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడున్న గుహల్లో పూర్వకాలంలో మునులు ధ్యానం చేసేవారని తెలుస్తుంది. ఆ కాలంలోనే ఇక్కడ స్వయంభువుగా లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి వెలిశాడు. ఈ గుట్ట సమీపంలోవున్న బొమ్మలమ్మ గుట్ట దగ్గర కురిక్యాల శాసనం ఇక్కడే లిఖించబడింది. కురిక్యాల శాసనాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు రేకుర్తి నరసింహుడిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారింది. దీంతోపాటు మునులు అభిషేకం చేసుకునేందుకు కోనేరు నీటిని కింద ఒక బావిలో ఉన్న నీటిని వాడేవారట. గుట్టపై లక్ష్మీ నరసింహుడు వెలసిన నాటి నుంచి నేటివరకు గుట్టపై ఉన్న కోనేరులో నీరు ఎండిపోలేదు. ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ప్రయాణ మార్గాలు

[మార్చు]

కరీంనగర్ నుంచి బొమ్మలగుట్టకు వెళ్లేదారిలో 7 కిలోమీటర్ల దూరంలో ఈ రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (7 January 2018). "స్వయంభువు సుదర్శన చక్రధారి..రేకుర్తి లక్ష్మీ నరసింహుడు!". గుర్రం నితిన్ గౌడ్. Retrieved 24 February 2018.