Jump to content

రేడియాలజీ

వికీపీడియా నుండి

రేడియాలజీ అనేది ఒక వైద్యశాస్త్ర విభాగం. మనుషుల, ఇతర జంతువుల శరీరంలోని అంతర్గత భాగాలను మెడికల్ ఇమేజింగ్ ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్సకు సిఫార్సులు చేయడం ఈ విభాగం ముఖ్యమైన పని. ఇది మొదటగా రేడియోగ్రఫీతో మొదలైంది. ప్రస్తుతం అన్ని రకాలైన మెడికల్ ఇమేజింగ్ ప్రక్రియలు ఈ విభాగం కిందికి వస్తాయి. ఆధునిక రేడియాలజీలో విభిన్న ఆరోగ్య విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు ఒక బృందంగా పనిచేస్తారు. రేడియాలజిస్ట్ పోస్ట్-గ్రాడ్యుయేట్ శిక్షణను పూర్తి చేసి, వైద్య చిత్రాలను అర్థం చేసుకుని, ఆ ఫలితాలను ఇతర వైద్యులకు నివేదిక ద్వారా లేదా మౌఖికంగా తెలియజేస్తాడు. ఇంకా శరీరానికి వీలైనంత తక్కువ కష్టం కలుగజేస్తూ ఇమేజింగ్‌ను ఉపయోగిస్తాడు.[1][2]

ఇమేజింగ్ ప్రక్రియకు ముందు, తర్వాత నర్సు రోగుల సంరక్షణలో పాల్గొంటుంది. ఇందులో రోగికి మందులు అందించడం, ముఖ్యమైన వైద్య సంకేతాల పర్యవేక్షణ, మత్తులో ఉన్న రోగుల పర్యవేక్షణ ఉంటాయి.[3] రేడియోగ్రాఫర్ ఒక ప్రత్యేకమైన శిక్షణ పొందిన రోగ్య నిపుణుడు. ఇతను ఆధునిక సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించి రేడియాలజిస్టు వ్యాఖ్యానించేందుకు వీలుగా సరైన భంగిమలో అవయవాలను బొమ్మలు సిద్ధం చేస్తాడు. వ్యక్తిగత శిక్షణ, పనిచేసే దేశాన్ని బట్టి రేడియోగ్రాఫరు ముందు పేర్కొన్న ఇమేజింగ్ పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు.[4]


మూలాలు

[మార్చు]
  1. The American Board of Radiology. Webpage of the American Board of Radiology.
  2. "Radiology — Diagnostic Specialty Description". American Medical Association. Retrieved 19 October 2020.
  3. Blevins SJ (1994). "The role of the radiology nurse". Radiology Management. 16 (4): 46–8. PMID 10139086.
  4. Murphy A, Ekpo E, Steffens T, Neep MJ (December 2019). "Radiographic image interpretation by Australian radiographers: a systematic review". Journal of Medical Radiation Sciences. 66 (4): 269–283. doi:10.1002/jmrs.356. PMC 6920699. PMID 31545009.