రేలారె రేలా గంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగాదేవి
Relarerela ganga.jpg
తెలంగాణ సాంస్కృతిక సారథి గాయని
వ్యక్తిగత వివరాలు
జననం7 అక్టోబర్ 1989
ముల్లంగి, డిచ్‌పల్లి మండలం, నిజామాబాద్‌ జిల్లా , తెలంగాణ
జీవిత భాగస్వామిసుదర్శన్
సంతానంసోహన్
తల్లిదండ్రులుఅంకు మల్లయ్య, సాయమ్మ
నివాసంహైదరాబాదు, తెలంగాణ

రేలారె రేలా గంగాదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

గంగాదేవి తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ జిల్లా, డిచ్‌పల్లి మండలం, ముల్లంగి గ్రామంలో మల్లయ్య, సాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది.[2]

వృత్తి జీవితం[మార్చు]

గంగాదేవి పదవ తరగతి పూర్తయ్యాక ఇంట్లో పరిస్థితులవల్ల ఇందిరా క్రాంతి పథకంలో కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌గా చేరింది. జానపద పాటల పోటీల సెలక్షన్స్‌ నిజామాబాద్‌లోనే జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్లే సరికి కార్యక్రమం పూర్తయ్యింది. న్యాయనిర్ణేతల్లో ఒక్కరు ఆమె వివరాలు తీసుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. తరువాత గంగకు హైదరాబాద్‌ నుండి ఒక కార్యక్రమంలో ఎంపికైందన్న ఫోన్ రావడంతో ఆమె హైదరాబాద్ చేరి ‘మాటీవి’లో రేలారె రేలా కార్యక్రమంతో పాటు పలు ఛానళ్ల పాటల ప్రోగ్రాముల్లో అవకాశం దక్కించుకుంది. తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్ ‘‘ధూం-ధాం’’ బృందంలో చేరి ఆట, పాటతో తన వంతు కృషి చేసింది. ఆమెకు జానపద కళాకారుడు జంగిరెడ్డి 2011లో మారిషస్‌ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే అవకాశం ఇచ్చాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమెకు తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఉద్యోగం దక్కింది. ఆమె తరువాత ‘పలుగురాళ్ల పాడుల దిబ్బ’, ‘వెన్నెలకీ వచ్చినయూ జొన్నల బండ్లు’, ‘పుట్టామీద పాలపిట్టా జాజి మొగిలాల’, ‘పున్నాపు వలలో పూసీ కాయంగా’ వంటి పలు జానపద గీతాల ద్వారా మంచి గుర్తింపునందుకుంది. గంగకు జగిత్యాల కళాని కేతన్ వారి ‘గానరత్న’ పురస్కారం, మిద్దె రాములు స్మారక పురస్కారంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ‘‘ఉత్తమ జానపద గాయని’’ అవార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతు మీదుగా అందుకుంది. ఆమె ఆర్.జి ఫౌండేషన్ స్థాపించి పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Eenadu (31 October 2021). "పాటతో గెలిచి నిలిచింది!". Archived from the original on 31 October 2021. Retrieved 2 November 2021.
  2. Sakshi (2 August 2019). "'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'". Archived from the original on 2 October 2021. Retrieved 2 November 2021.