Jump to content

రే టామ్లిన్‌సన్

వికీపీడియా నుండి
రే టామ్లిన్‌సన్
2004 లో టామ్లిన్‌సన్
జననం
రేమండ్ సామ్యూల్ టామ్లిన్‌సన్

(1941-04-23)1941 ఏప్రిల్ 23
ఆమ్‌స్టెర్‌డామ్‌, న్యూయార్క్, యు.ఎస్.
మరణం2016 మార్చి 5(2016-03-05) (వయసు 74)
జాతీయతఅమెరికన్
విద్యాసంస్థమసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తికంప్యూటర్ ప్రోగ్రామర్, ఆవిష్కర్త, ఎలక్ట్రానిక్ ఇంజనీరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మొదటి ఇ-మెయిల్ వ్యవస్థ ఆవిష్కర్త

రేమండ్ సామ్యూల్ టామ్లిన్‌సన్ (1941 ఏప్రిల్ 23 – 2016 మార్చి 5) అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్‌వర్క్ కు సందేశాల బట్వాడా సాధ్యాసాధ్యాలపై ఆయన అనేక ప్రయోగాలు చేసారు. 1971లో బోస్టన్ లో తాను పని చేస్తున్న సంస్థలోని సహోద్యోగికి మొట్టమొదటి సారిగా ఎలక్రానిక్ మెయిల్ విజయవంతంగా పంపారు. మెయిల్ ఐడీలో కీలక గుర్తు అయిన @ ను మొదటిసారి వినియోగించింది కూడా ఆయనే. మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో ప్రోగ్రామర్ గా పనిచేసిన ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరిన తర్వాత ఈ మెయిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లారు.[1] [2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1941, ఏప్రిల్ 23న న్యూయార్క్ లో జన్మించారు. ఇంటర్నెట్ వ్యాప్తికి విశేష కృషి చేసినందుకుగానూ రాయ్ టామ్లిన్‌సన్ 2012లో 'ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్' గా గుర్తింపుపొందారు. మెయిల్ ఐడీలో కీలక గుర్తు(సింబల్)అయిన @ ను మొదటిసారి వినియోగించికూడా ఆయనే. మొదట బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమన్ సంస్థల్లో ప్రోగ్రామర్ గా పనిచేసిన ఆయన ఆర్పానెట్ సంస్థలో చేరిన తర్వాత ఈ మెయిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లారు.

మూలాలు

[మార్చు]
  1. "Official Biography: Raymond Tomlinson". Internet Hall of Fame. Retrieved 6 March 2016.
  2. Ray Tomlinson. "The First Network Email". Archived from the original on 2006-05-06. Retrieved 2016-03-07.

ఇతర లింకులు

[మార్చు]