రే లియోటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రే లియోటా
జననం1954 డిసెంబర్ 18
న్యూ జెర్సీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం2022 మే 26
న్యూయార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
విశ్రాంతి ప్రదేశంకాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు
విశ్వవిద్యాలయాలున్యూ జెర్సీ విశ్వవిద్యాలయం
వృత్తినటుడు సినిమా నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1978–2022
భార్య / భర్తమైకేల్ గ్రేస్
పిల్లలు1

రేమండ్ అలెన్ లియోటా (1954 డిసెంబర్ 18 – 2022 మే 26 రే లియోటా అమెరికా సినిమా నటుడు నిర్మాత. రే లియోట సమ్థింగ్ వైల్డ్ (1986)లో వచ్చిన సినిమా ద్వారా పేరు పొందాడు. ఈ సినిమాకు గాను రే లియోటాకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చింది. ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్ (1989) చిత్రంలో షూలెస్ జో జాక్సన్ గుడ్‌ఫెల్లాస్ (1990) చిత్రంలో హెన్రీ హిల్ పాత్రలకు అతను బాగా పేరు పొందాడు.

బాల్యం

[మార్చు]

రేలియోట్టా 1954 డిసెంబర్ 18నన్యూజెర్సీలోని నెవార్క్‌లో జన్మించారు. [1] రేలియోట ను ఆరు సంవత్సరాల వయసులోనే తల్లితండ్రులు అనాధాశ్రమంలో వదిలివేశారు. తర్వాత లియోటాను ఒక పారిశ్రామికవేత్త దత్తత తీసుకున్నాడు.

సినీ జీవితం

[మార్చు]

లియోటా కు చిన్నప్పటినుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. దీంతో కళాశాల రోజుల్లో సినిమాల్లో ప్రయత్నాలు చేయడానికి న్యూయార్క్ నగరానికి వెళ్ళాడు. రేలియోట 1978లో వచ్చినఅనదర్ వరల్డ్‌లోఅనే నాటకంలో తొలిసారి నటించాడు. అతను 1983లో ది లోన్లీ లేడీలో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. రేలియోట సమ్‌థింగ్ వైల్డ్ (1986)లో సినిమాకు గాను పేరు పొందాడు. ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్నాడు.

1990లో రేలియోట ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. 1992లో, అతను అన్‌లాఫుల్ ఎంట్రీ అనే సినిమాలో పోలీసుగా నటించాడు. 1997 చిత్రం కాప్ ల్యాండ్‌ సినిమాల్లో నటనకు గాను ఇతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
సెప్టెంబరు 2014, ఫ్రాన్స్‌లోని డ్యూవిల్లే ఫిల్మ్ ఫెస్టివల్‌లో లియోటా

రేలియోట 1987లో మైకెల్ గ్రేస్ ను వివాహం చేసుకున్నాడు. తరువాత వారు 2004లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకునే సమయానికి ఈ దంపతులకు ఒక కూతురు ఉంది.

మరణం

[మార్చు]

మే 26, 2022న 67 ఏళ్ల వయసులోలియోటా నిద్రలోనే మరణించాడు. [2] [3] రేలియోట మరణ సమయంలో, ఇతని కూతురు వివాహం చేసుకుంది. [4] 2023లో విడుదలైన పోస్టుమార్టం నివేదికలో లియోట్టా మరణానికి కారణం శ్వాసకోశ లోపం, పల్మనరీ ఎడెమా గుండె వైఫల్యం, అథెరోస్క్లెరోసిస్ లాంటి వివిధ అనారోగ్యాల కారణంగా ఇతను మరణించినట్లు పోస్టుమార్టం లో వెళ్లడైంది. [5]

  1. "Ray Liotta Biography: Film Actor, Television Actor, Television Personality (1954–)". Biography.com (FYI / A&E Networks). Archived from the original on May 26, 2016. Retrieved December 18, 2016.
  2. "Goodfellas star Ray Liotta dies aged 67". BBC News. May 26, 2022. Retrieved May 26, 2022.
  3. "Ray Liotta: A cackling, rugged actor, too dangerous for romantic roles". The Irish Times (in ఇంగ్లీష్). Retrieved January 20, 2023.
  4. Fleming, Mike Jr.; Pedersen, Erik (May 26, 2022). "Ray Liotta Dies: 'Goodfellas' Star & 'Field Of Dreams' Actor Was 67". Deadline Hollywood. Retrieved May 26, 2022.
  5. Martinez, Gina (May 8, 2023). "Ray Liotta's cause of death revealed in autopsy report". CBS News. Retrieved May 11, 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=రే_లియోటా&oldid=4022795" నుండి వెలికితీశారు