రే స్టీవెన్సన్
రే స్టీవెన్సన్ Ray Stevenson | |
---|---|
జననం | జార్జ్ రేమండ్ స్టీవెన్సన్ 1964 మే 25 లిస్బర్న్, ఉత్తర ఐర్లాండ్ |
మరణం | 2023 మే 21 లాకో అమెనో, ఇటలీ | (వయసు 58)
జాతీయత | బ్రిటిష్ |
విద్య | బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1993–2023 |
జీవిత భాగస్వామి | రూత్ గెమ్మెల్
(m. 1997; div. 2005) |
భాగస్వామి | ఎలిసబెట్టా కరాసియా |
పిల్లలు | 3 |
జార్జ్ రేమండ్ స్టీవెన్‌సన్ (ఆంగ్లం: George Raymond Stevenson; 1964 మే 25 - 2023 మే 21)[1] బ్రిటిష్ నటుడు. ఆయన కింగ్ ఆర్థర్ (2004) చిత్రంలో డాగోనెట్ పాత్రను, బిబిసి/హెచ్బీం టెలివిజన్ సిరీస్ రోమ్ (2005–2007)లో టైటస్ పుల్లో పాత్రను పోషించి ప్రసిద్ధిచెందాడు. ఆయన రెండు మార్వెల్ కామిక్స్ పాత్రలను కూడా పోషించాడు: ఫ్రాంక్ కాజిల్ / ది పనిషర్ ఇన్ పనిషర్: వార్ జోన్ (2008), ది సూపర్ హీరో స్క్వాడ్ షో, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (2011–2017)లో వోల్‌స్టాగ్ గా నటించాడు. ఆయన ఇతర చిత్రాలలో కిల్ ది ఐరిష్‌మాన్ (2011), ది త్రీ మస్కటీర్స్ (2011)లతో పాటు ఆస్కార్ పురస్కారం అందుకున్న భారతీయ చలన చిత్రం ఆర్ఆర్ఆర్ (2022)లో నటించాడు. ఇందులో ఆయన విలన్ గవర్నర్ స్కాట్‌గా నటించాడు. ఆయన టెలివిజన్ పాత్రలలో డెక్స్టర్ ఏడవ సీజన్‌లో ఉక్రేనియన్ మాబ్‌స్టర్ ఐజాక్ సిర్కో, బ్లాక్ సెయిల్స్ మూడవ, నాల్గవ సీజన్‌లలో బ్లాక్‌బేర్డ్ లు కాగా స్టార్ వార్స్ రెబెల్స్, స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్‌లో గార్ సాక్సన్ లకు గాత్రదానం కూడా చేసాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆయన ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964 మే 25న ఐరిష్ తల్లిదండ్రులకు ముగ్గురు కుమారులలో రెండవవాడుగా జన్మించాడు. ఆయన తండ్రి రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్.[2] ఆయన ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబం ఇంగ్లాండ్‌కు వెళ్ళింది. ఆయన మొదట న్యూకాజిల్ అపాన్ టైన్‌లోని లెమింగ్‌టన్ ప్రాంతంలో, తరువాత సీటన్ డెలావల్‌లో స్థిరపడ్డాడు. ఆయన బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.
కెరీర్
[మార్చు]గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన 1990ల్లో తొలుత టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత హాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. 1998లో థియరీ ఆఫ్ ఫ్లైట్ చిత్రంతో అరంగేట్రం చేసాడు. తర్వాత గ్రీన్‌విచ్ మీన్ టైమ్ ఇన్ 1999, కింగ్ ఆర్థర్, పనిషర్ వార్ జోన్, బుక్ ఆఫ్ ఎలీ, ది అదర్ గాయ్స్, జో రిటాలియేషన్, డివర్జెంట్, ది ట్రాన్స్‌పోర్టర్: రిప్యూల్‌డ్, యాక్సిడెంట్ మ్యాన్, మెమొరీ, థోర్ సిరీస్‌లతో ఎంతో మంచి పేరుతెచ్చుకున్నాడు. డెక్స్‌టార్, స్టార్‌వార్స్ రెబెల్స్ లాంటి టీవీ షోలతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన చివరిగా నటించిన డిస్నీ+ అషోకా సిరీస్ త్వరలో విడుదల కానుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1997లో, స్టీవెన్సన్ లండన్‌లో ఆంగ్ల నటి రూత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకున్నాడు. వారు బ్యాండ్ ఆఫ్ గోల్డ్ (1995) సెట్‌లో కలిసి పనిచేసారు. ఆ తర్వాత పీక్ ప్రాక్టీస్ (1997)లో వివాహిత జంటగా నటించారు. వివాహమైన ఎనిమిదేళ్ల తర్వాత 2005లో విడాకులు తీసుకున్నారు. స్టీవెన్‌సన్‌కు ఇటాలియన్ మానవ శాస్త్రవేత్త ఎలిసబెట్టా కరాసియాతో ముగ్గురు కుమారులు ఉన్నారు.
మరణం
[మార్చు]58 ఏళ్ల రే స్టీవెన్సన్ 2023 మే 21న ఇటలీలోని ఇషియాలో క్యాసినో చిత్రీకరణలో ఉండగా మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Ray Stevenson, 'Punisher: War Zone' and 'Rome' Star, Dies at 58". TheWrap (in ఇంగ్లీష్). 2023-05-22. Retrieved 2023-05-22.
- ↑ "BBC - Press Office - Rome press pack phase two Ray Stevenson". bbc.co.uk. Retrieved 6 September 2015.
- ↑ "Ray Stevenson: 'ఆర్‌ఆర్‌ఆర్'లో కీలక పాత్ర పోషించిన రే స్టీవెన్సన్ హఠాన్మరణం | rrr movie actor ray stevnson passed away". web.archive.org. 2023-05-23. Archived from the original on 2023-05-23. Retrieved 2023-05-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)