రైతన్న
రైతన్న | |
---|---|
దర్శకత్వం | ఆర్. నారాయణమూర్తి |
రచన | ఆర్. నారాయణమూర్తి |
నిర్మాత | ఆర్. నారాయణమూర్తి |
తారాగణం | ఆర్. నారాయణమూర్తి |
సంగీతం | ఆర్. నారాయణమూర్తి |
నిర్మాణ సంస్థ | స్నేహ చిత్ర పిక్చర్స్ |
విడుదల తేదీs | 14 ఆగష్టు, 2021 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
రైతన్న 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి నిర్మించి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కానుంది.[1]
కథ
[మార్చు]2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన కదంశంతో నిర్మించిన సినిమా. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదని, అన్నం పెట్టే అన్నదాతకి గిట్టుబాటు ధర కావాలని, కేంద్రప్రభుత్వం డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సులని అమలు చేయాలనీ, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధాన సమస్యలను సినిమాలో చూపించారు.[2][3]
ప్రివ్యూ
[మార్చు]రైతన్న సినిమా ప్రివ్యూ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో 12 July 2021న ప్రదర్శించారు. ఈ ప్రివ్యూకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, అఖిల భారత రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నేత కోదండ రెడ్డి, సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, గద్దర్ , ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందే శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్ , రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ, తదితరులు హాజరయ్యారు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (11 August 2021). "14న 'రైతన్న'". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
- ↑ Sakshi (12 August 2021). "రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
- ↑ Andrajyothy (4 August 2021). "'రైతన్న రుణం తీర్చుకోవాలి'". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
- ↑ TV9 Telugu (12 July 2021). "R. Narayana Murthy: రైతు చట్టాలను రద్దు చేయాలనే రైతన్న తీశాను.. విడదలకు సిద్ధమైన ఆర్.నారాయమూర్తి కొత్త సినిమా". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (12 July 2021). "R Narayana Murthy: 'రైతన్న' విడుదలకు రెడీ". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
- ↑ Namasthe Telangana (1 December 2021). "రైతన్న సినిమా చూసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.