రొమాంటిక్ క్రిమినల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రొమాంటిక్ క్రిమినల్స్
(2019 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సునిల్ కుమార్ రెడ్డి
నిర్మాణం ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు
తారాగణం మ‌నోజ్ నంద‌న్‌, వినోద్‌, అవంతిక‌, దివ్య‌, మౌనిక
సంగీతం సుధాక‌ర్ మారోయో
ఛాయాగ్రహణం ఎస్‌.వి. శివ‌రామ్‌
నిర్మాణ సంస్థ శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్య ఫిలింస్
విడుదల తేదీ 17 మే 2019
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రొమాంటిక్ క్రిమినల్స్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్య ఫిలింస్ బ్యానర్ పై ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మించిన ఈ సినిమాకు పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ ను మే 4న,[1] చిత్రాన్ని 17 మే 2019న విడుదల చేశారు.

కథ[మార్చు]

అప్పుడే ఇంజినీరింగ్‌ కాలేజ్‌ లో చేరిన కార్తీక్ (మనోజ్ నందన్) అప్పటికే డ్రగ్స్ కు అలవాటుపడిన తన సీనియర్ అయిన ఏంజెల్ (అవంతిక) తో ప్రేమలో పడి కార్తీక్ కి కూడా డ్రగ్స్ లాంటివి అలవాటు చేస్తుంది. డ్రగ్స్ అమ్మే వ్యక్తి, ఆ డ్రగ్స్ అమ్మేవాడి స్నేహితులు ఇలా పలువురు ఏంజెల్-కార్తీక్ ల జీవితాల్లో తెలియకుండానే భాగస్వాములవుతారు. ఈ డ్రగ్స్ అనేవి వారి జీవితాలను ఎలా నాశనం చేసింది? సమాజంలో డ్రగ్స్ కారణంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివి, వాటికి వారు ఎలా బానిసలవుతున్నారు? అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

  • మ‌నోజ్ నంద‌న్‌ - కార్తీక్
  • వినోద్‌
  • అవంతిక‌ - ఏంజెల్
  • దివ్య‌
  • మౌనిక
  • ఎఫ్‌.ఎమ్ బాబాయ్
  • బుగ‌తా
  • స‌ముద్ర‌మ్ వెంక‌టేష్‌

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్య ఫిలింస్
  • నిరంతలు: ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు
  • క‌థ‌,మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి
  • పాటలు: బాల వ‌ర్ద‌న్‌
  • సంగీతం: సుధాక‌ర్ మారోయో
  • పాటలు: బాల వ‌ర్ద‌న్‌
  • స‌హ‌నిర్మాత‌లు: వైద్య‌శ్రీ డాక్ట‌ర్ ఎల్ ఎన్ రావు, డాక్ట‌ర్ కె.శ్రీనివాస్‌
  • కెమెరా: ఎస్‌.వి. శివ‌రామ్‌
  • ఎడిటింగ్‌: శామ్యుల్ క‌ళ్యాణ్‌

మూలాలు[మార్చు]

  1. HMTV (11 May 2019). "అన్ని బూతులే: పిచేక్కిస్తున్న రొమాంటిక్ క్రిమినల్స్ టిజర్". www.hmtvlive.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.
  2. Sakshi (11 May 2019). "ముసుగుల వెనుక రహస్యం". Sakshi. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.