లక్ష్మణ్ జగ్తప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మణ్ జగ్తప్
లక్ష్మణ్ జగ్తప్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 3 జనుఅరీ 2023
ముందు నూతనంగా ఏర్పాటైన నియోజకవర్గం
నియోజకవర్గం చించ్వాడ్

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2004 – 2009
ముందు చందుకాక జగ్తాప్
నియోజకవర్గం పూణే స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1963-02-15)1963 ఫిబ్రవరి 15
మరణం 2023 జనవరి 3(2023-01-03) (వయసు 59)
బ్యానేర్, పూణే, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అశ్విని జగ్తాప్

లక్ష్మణ్ పాండురంగ్ జగ్తప్ (15 ఫిబ్రవరి 1963 - 3 జనవరి 2023) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు చించ్వాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

లక్ష్మణ్ జగ్తప్ 1986లో జరిగిన తొలి పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తర్వాత 2006 వరకు పలుమార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై 2000లో పింప్రి-చించ్వాడ్ మేయర్‌గా పని చేశాడు. ఆయన 2009లో కొత్తగా ఏర్పడిన చించ్వాడ్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. లక్ష్మణ్ జగ్తప్ 2014 లోక్‌సభ ఎన్నికలలో మావల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి శివసేన అభ్యర్థి శ్రీరంగ్ బర్నే చేతిలో ఓడిపోయాడు. అనంత‌రం ఆయన 2014, 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

లక్ష్మణ్‌ జగ్తప్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బేనర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జనవరి 3న మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (3 January 2023). "అనారోగ్యంతో ఎమ్మెల్యే మృతి". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  2. The Hindu (3 January 2023). "Blow to BJP in Pune as influential MLA Laxman Jagtap passes away" (in Indian English). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
  3. Hindustan Times (3 January 2023). "Three-time BJP MLA from Chinchwad Laxman Jagtap dies after long battle with cancer" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.