లతాంటీ డిసి 10 రెస్టారెంట్
ఈ వ్యాసం {{{1}}} యాంత్రిక అనువాద వనరులతో అనువదించారు కాని శుద్ధి పూర్తి కాలేదు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని సవరించి సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించండి. శుద్ధి పూర్తి అయ్యేదాక ఇలాంటిపని వాడుకరి ఉపపేజీలలో చేయడం మంచిది. దీనిని ఒక వారంలోపు శుద్ధి చేయకుండా వదిలేస్తే ఈ వ్యాసం తొలగించబడవచ్చు. |
ల తఁత్ డిసి10 రెస్తొరఁ | |
---|---|
Restaurant information | |
ఆవిష్కరణ | 9 నవంబరు 2013 |
మూసివేత | 2023 |
ప్రస్తుతము owner(s) | గాన ఎయ్ర్పొర్ట్ కంపెనీ లిమిటెడ్ విందిర కంపెనీ లిమిటెడ్ |
ఆహార రకము | గాన వంటలు |
వీధి చిరునామా | మరీనా మాల్ ఎదురుగా |
నగరము | అక్రా |
దేశము | ఎయ్ర్పొర్ట్ సిటీ |
దేశము | గాన |
Coordinates | 5°36′10″N 0°10′29″W / 5.60278°N 0.17472°W |
సీట్ల సామర్ధ్యము | 118 |
ల తఁత్ డిసి10 రెస్తొరఁ (La Tante DC10 Restaurant, అర్థం: డిసి 10 అత్తయ్య రెస్టరెన్ట్ [గమనిక 1]) అనేది గాన దేశంలోని అక్రా (Accra) నగరంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచిన ఒక రెస్టరన్ట్ (Restaurant). స్థానికంగా దీనికి గ్రీన్ ప్లెయ్న్ రెస్టరన్ట్ (Green plane restaurant) అనే పేరు కూడా ఉంది. 1983–2005 వరకు గాన ఎయ్ర్వెయ్స్ (Ghana Airways) నడిపిన పౌరవిమానం డిసి 10ను (DC-10) రెస్టరన్ట్‌గా మార్చి, దీన్ని మొదలుపెట్టారు. ఈ రెస్టరన్ట్‌లో గాన ప్రధానాహార వంటకాలు ఉండేవి. స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్న ఈ రెస్టరన్ట్, ఈ మధ్యకాలంలో నష్టాలు రావడంతో 2023లో మూతబడింది. విమానాన్ని విడిభాగాలుగా చేసి తరలించేసారు.
నేపథ్యం
[మార్చు]ఈ రెస్టరెన్ట్‌కి వాడిన డిసి-10 విమానాన్ని మునుపు గాన ఎయ్ర్వెయ్స్ గాన నుండి ఐరోపా, యు.ఎస్‌లకు నడిపేది. [1] 1976లో గాన ఎయ్ర్వెయ్స్ డిసి-10-30 కొనుగోలుకి వినతి పెట్టగా, 24 ఫిబ్రవరి 1983న విమానం సంస్థ చేతికి అందింది. జులై 1985లో ఐ.రా.స దళాల బెయ్రూట్ ప్రయాణాలకు దీన్ని వాడేవారు. తరువాతి ఏడు జనవరి నుండి కెరిబియెన్ ఎయ్ర్లయ్న్స్ (Carribean Airlines), ఈ విమానాన్ని వారానికి రెండు సార్లు కెరిబియెన్ ప్రాంతం నుండి ఐరోపాకు పౌర సరఫరా సేవలు అందించడానికి వాడుకుంది.[2]
జూన్ 2002లో గాన ఎయ్ర్వెయ్స్, విడిభాగాల సంస్థ ఎజె వాల్టర్స్ ఎవ్యెయ్షన్‌కు (AJ Walters Aviation) కట్టవలసిన 40 లక్షల పౌన్డ్ల బకాయిలకు గానూ ఈ విమానం హీత్రూ విమానాశ్రయంలో నిలిపివేయబడింది. దీంతో అక్రా నుండి ఇటలీ, యుకెలకు సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.[1][3] తరువాత పది లక్షల యు.ఎస్ డొలర్లు ఇచ్చి విమానాన్ని విడిపించారు.[4] 2005లో గాన ఎయ్ర్వెయ్స్ సంస్థ దివాలా తీసింది.[1] ఆ తరువాత విమానం అక్రాలోని కొటొక విమానాశ్రయంలో పడి ఉండేది. తరువాతి ఏళ్ళలో విమానానివి మూడు ఇంజన్లతో సహా విడిభాగాలను పాత సామాన్లుగా అమ్మేసారు.[4]
2011లో ఒక తొగొ మంత్రి భార్య ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. అప్పటికే విమానంలోని స్ఫటాన్ని కూడా కొంతమేర గీకేసి అమ్మేసారు.[4]
విమాన నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి, గాన ఎయ్ర్పొర్ట్ కంపెనీ లిమిటెడ్, విందిర కంపెనీ లిమిటెడ్‌ల మధ్య ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 11 నవంబర్ 2013న రెస్టరన్ట్‌గా మొదలుపెట్టారు.[1][5] ఆఫ్రికాలో ఇదే మొట్టమొదటి విమాన రెస్టరన్ట్.[5]
2023లో నష్టాల వల్ల రెస్టరన్ట్ మూతబడింది. విమానాన్ని విడిభాగాలుగా చేసి తరలించేసారు.[6][7]
విశేషాలు
[మార్చు]380 ప్రయాణికుల సామర్థ్యం కల ఈ విమానాన్ని, 118 మందికి వడ్డనలు చేయడానికి అనువుగా మార్పులు చేసారు. మిగతా చోటు భోజన బల్లలు పెట్టడానికీ, వచ్చే అతిథులకు ఇరుకుగా లేకుండా సౌకర్యంగా ఉండడానికీ సరిపడింది.[1] ఫ్యూసిలాజ్‌కు[గమనిక 2] (fuselage) కుడి పక్కన ఇంకో చిన్న గది కట్టి దాన్ని వంటగదిగా మార్చారు.[8]
విమానాన్ని కొటొక అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర అక్రా శివారు ప్రాంతం ఐన ఎయ్రపొర్ట్ సిటిలో (Airport city), మరీనా మాల్ ఎదురుగా నిలబెట్టారు.[5] విమానంలోకి మెట్లు ఎక్కి వెళ్ళి, ఒకప్పటి ఫస్ట్ క్లాస్ ప్రాంతంలో అతిథులు తమ వంతుకై వేచి ఉండటానికి ఏర్పాటు చేసారు.[1] మెట్లకు పైకప్పు ఏర్పాటు చేసారు. రెస్టరన్ట్ మొత్తానికీ ఎ.సి, వేర్వేరు ఆడా, మగ మరుగుదొడ్లూ ఏర్పాటు చేసారు.[5]
మెన్యూ (Menu)
[మార్చు]రెస్టరన్ట్‌లో గాన వంటకాలు దొరికేవి. బెంకుతో (మొక్కజొన్న ముద్దలు) టిలాప్య (Tilapia, ఒక రకమైన చేప) వంటి ప్రధానాహారాలే కాక, జలొఫ్ అన్నంతో కోడి మాంసం వంటివి కూడా దొరికేవి.[8] ల తఁత్ డిసి10 రెస్తొరఁలో వెలలు ఆ చుట్టుపక్కల రెస్టరన్ట్‌ల కన్నా ఎక్కువ ఉన్నా, అక్రాలోని ఇతర పెద్ద రెస్టరన్ట్‌ల కంటే తక్కువ ఉండేవి.[1]
పేరు
[మార్చు]రెస్టరన్ట్‌కు జనాల్లో మంచి పేరు వచ్చింది. మెనెజర్ (Manager) ఇందిర శియం 2014లో బిబిసి న్యూస్ ముఖాముఖిలో మాట్లాడుతూ "మొదట్లో జనాలు విమానంలో రెస్టరన్ట్‌ని చూడటానికి వచ్చేవారు. కానీ ఆశ్చర్యంగా వళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేవారు." అన్నారు. కొంత మంది అతిథులు విమాన రెస్టరన్ట్‌లో భోజనం అనుభవం ఎలా ఉంటుందో అనే ఆసక్తితో రాగా, కొంత మంది ఇంతకు ముందు ఎప్పుడూ విమానం ఎక్కలేదు కాబట్టి ఇక్కడ తినడానికి వచ్చారు. [1]
ఆస్క్ ద పైలట్ (Ask the pilot) విలేకరి పెట్రిక్ స్మిత్ (Patrick Smith) 2016లో ఈ రెస్టరన్ట్‌కు వచ్చాడు. తరువాత బిజినెస్ ఇన్‌సైడర్‌లో ఈ రెస్టరన్ట్‌ను సమీక్షిస్తూ చౌకగా, చక్కగా ఉంది కానీ అద్భుతంగా ఏమీ లేదు అన్నాడు. విమానం రెస్టరన్ట్‌గా మారిన విశేషాలను గురించి సమాచారం లేకపోవడాన్ని విమర్శిస్తూ, విమానం యానసేవలో ఉన్నప్పటి చిత్రాలు పెట్టి ఉంటే బాగుండేది అన్నాడు. అతను ఇలా రాసాడు: "చాలా రెస్టరన్ట్‌లకు పాత చరిత్రలు ఉన్నా, చరిత్ర మొత్తం ఒక ప్రాంతంలోనే ఉంటుంది! ఇది ఎన్నో ప్రాంతాలు తిరిగొచ్చిన రెస్టరన్ట్".[8]
గమనికలు
[మార్చు]- ↑ తెలుగులో సుబ్బయ్య గారి హోటలు, బాబాయి రెస్టారెంటు, ఆంటీ గారి దోసెల బండి అని పిలుస్తారు కదా. ఈ పేరు కూడా అదే చందం.
- ↑ విమానంలో ప్రయాణికులు కూర్చునే భాగం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "In pictures: Plane eating in Ghana" [చిత్రాల్లో: గానలో విమానంలో తిండి]. బిబిసి న్యూస్ (in ఇంగ్లీష్). 15 January 2014. Retrieved 2 January 2025.
- ↑ Guttery 1998, p. 77.
- ↑ Simpkins, Edward (2 June 2002). "Plane seized at Heathrow over debts of £4m" [40లక్షల పౌండ్ల బకాయిలకు గానూ హీత్రూలో జప్తు చేయబడ్డ విమానం]. డైలీ టెలిగ్రాఫ్ (in ఇంగ్లీష్). Retrieved 2 January 2025.
- ↑ 4.0 4.1 4.2 "Ghana Airways Aircraft To Be Used As Restaurant" [రెస్టరన్ట్‌గా వాడుకలోకి రానున్న గాన ఎయ్ర్వెయ్స్ విమానం] (in ఇంగ్లీష్). GhanaWeb. 11 October 2011. Retrieved 2 January 2025.
- ↑ 5.0 5.1 5.2 5.3 "La Tante DC 10 Restaurant Opens In Accra" [గానలో ల తఁత్ డిసి 10 రెస్టరన్ట్ మొదలైంది]. News Ghana (in ఇంగ్లీష్). 9 November 2013. Retrieved 2 January 2025.
- ↑ Adogla-Bessa, Delali (September 28, 2023). "Ghana Airways Plane Turned Into Restaurant Reportedly Closes Down: La Tante DC10 Towed From Location" [రెస్టరన్ట్‌గా మారిన గాన ఎయ్ర్వెయ్స్ విమానం మూతబడినట్లు సమాచారం: ల తఁత్ డిసి10 అది ఉన్న ప్రాంతం నుండి తరలించబడింది]. Ghana News (in ఇంగ్లీష్). Retrieved 2 January 2025.
- ↑ Mends, Reagan (29 September 2023). "End of an Era: Ghana's old plane-turned-restaurant finally towed away" [ఒక శకం ముగిసింది:గానలో రెస్టరన్ట్‌గా మార్చబడ్డ పాత విమానం చివరికి తరలించబడింది]. Ghana Weekend (in ఇంగ్లీష్). Retrieved 2 January 2024.
- ↑ 8.0 8.1 8.2 Smith, Patrick (25 January 2016). "This is what it's like to have dinner in an old jet that's been converted to a restaurant" [రెస్టరన్ట్‌గా మార్చబడ్డ పాత విమానంలో భోజనం ఇలా ఉంటుంది]. Business Insider (in ఇంగ్లీష్). Retrieved 2 January 2025.