Jump to content

లతాలక్ష్మి

వికీపీడియా నుండి
చింతామణి పాత్రలో లతాలక్ష్మి

తెలుగు రంగస్థల పద్యకళాకారిణి. చింతామణి పాత్రధారిణిగా పేరుగాంచారు. సుబ్బిశెట్టి ఫేం వి.వి.స్వామి అర్ధాంగి.అద్భుతమైన కంఠస్వరంతో వేలాది ప్రదర్శనలిచ్చారు.నరసరావుపేటలో 2003 లో చనిపోయారు.

"రక్తమాంస పురీష మూత్రముల పాత్ర మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు అబ్జులగువారు మోహాందులగుచు తలతురు అంతియే కాక సౌందర్యమనగ గలదే?" ఈపద్యం చింతామణి స్టేజిడ్రామాలోది.లతాలక్ష్మి గారు అద్భుతంగా పాడారు. ఈమె పాటలు,పద్యాలు 1970-90 లలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి.గ్రామాలలో కాఫీ హోటళ్ళలో ఈమె గ్రామఫోను రికార్డులు ,కేసెట్లు సంగీత ప్రియులను అలరించేవి.

1969లో వి వి స్వామి, అతని సోదరుడు చీరాల సుబ్బయ్య, భార్త వి లతాలక్ష్మి గారితో కలసి నరసరావుపేటలో శ్రీలక్ష్మి నాట్యమండలి సమాజాన్ని స్థాపించాడు. అప్పటి నుండి నేటివరకు శ్రీహరి, చింతామణి, సుబ్బిశెట్టి వంటి ప్రధాన పాత్రలతో చీరాల సుబ్బయ్య, వివి స్వామి, లతాలక్ష్మి కలిసి ఐదారువేలకు పైగా ప్రదర్శనలను ఇచ్చారు.[1][2] చింతామణి నాటకంలోసుబ్బిశెట్టి పాత్రగా, శెట్టిగారి పెత్తనం, లంచం ఇస్తే మంచం, యమలోకంలో సుబ్బిశెట్టి,[3] భూలోకంలో సుబ్బిశెట్టి, కామెడీ రికార్డులను ప్రజలకు అందించారు.

ఆమె భర్త నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్‌హాల్ ఉపాధ్యక్షునిగా పనిచేశాడు. ఆమె 2003వ సంవత్సరంలో మరణించింది.

వినండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chintamani Sri Hari And Subbi Cheety Scenes Pt. 1 V.V. Swamy, Chirala Subbiah, V. Latha Lakshmi, T. Gopika".
  2. "వన్స్‌ మోర్ చప్పట్లే కళాకారుడికి ఊపిరి".[permanent dead link]
  3. "యమలోకం లో సుబ్బిశెట్టి రికార్డు".

బాహ్య లంకెలు

[మార్చు]