Jump to content

లయన్స్ క్లబ్, ఉండి

వికీపీడియా నుండి
క్లబ్ ప్రాజెక్ట్
లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల వేదిక

లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వీస్ క్లబ్ ఆర్గనైజేషన్. మేము 206 కంటే ఎక్కువ దేశాలు, భౌగోళిక ప్రాంతాలలో 45,000 కంటే ఎక్కువ క్లబ్‌లలో 1.35 మిలియన్ల సభ్యులను కలిగి ఉన్నాము. ఈ అంతర్జాతీయ సేవా సంస్థలో భాగంగా లయన్స్ క్లబ్ ఉండి (క్లబ్ నెం 064345) Ln T దుర్గామల్లేశ్వరరావు (జిల్లా గవర్నర్ 324C) ద్వారా 2001 ఫిబ్రవరి 23న ఉండి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని భారతదేశంలో 2000-2001లో లయన్స్ డిస్ట్రిక్ట్ 324 -సిలో భాగంగా ప్రారంభం చేయబడి మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 324 సభ్యత్వంతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. వారి ద్వారా ది 2001 జూలై 2న చార్టర్డ్ ప్రధానం చేయబడి. సేవా కార్యక్రమాలు ప్రారంభించ బడినవి

మా క్లబ్ 29 వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైంది, ఇప్పుడు మా వద్ద 35 మంది సాధారణ సభ్యులు, 6 మంది కుటుంబ సభ్యులు కలసి మొత్తం 41 మంది సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో మూడవ వంతు నేటికీ కొనసాగడం ప్రత్యేకత

లయన్స్ క్లబ్ గణపవరం ఆధ్వర్యంలో లయన్ ఈపూరి సత్యనారాయణ ఎక్స్‌టెన్షన్ చైర్మన్‌గా, లయన్ క్రొవ్విడి నాగేంద్రప్రసాద్ గైడింగ్ లయన్‌గా లయన్ ఎంవైవీ మోహనరావుతో పాటు ఉండి పరిసర గ్రామంలోని వివిధ గ్రామాల్లో 25 మంది సేవకులను గుర్తించి స్థాపనలో కీలకపాత్ర పోషించారు.

ఈ నూతన క్లబ్ చార్టర్ అధ్యక్షులుగా లయన్ కూనపరాజు రామరాజు, చార్టర్ కార్యదర్శిగా లయన్ డాకి నరసింహమూర్తి, చార్టర్ కోశాధికారిగా లయన్ మంతెన అప్పలరాజు, చార్టర్ వైస్ ప్రెసిడెంట్‌లుగా లయన్ రుద్రరాజు నరసరాజు, లయన్ కలిదిండి సీతారామరాజు నేతృత్వంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. క్లబ్ ఏర్పడినప్పటి నుండి చురుగ్గా పనిచేస్తున్న చార్టర్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ రుద్రరాజు నరసరాజు క్లబ్ యొక్క పరిపాలనా, సేవా కార్యక్రమాలను సమన్వయం చేయడం, క్లబ్ నివేదికలు, క్లబ్ రికార్డులు, క్లబ్ సేవా కార్యక్రమాలను భద్రపరచడం, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో క్లబ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు

. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ కూనపరాజు రామరాజు తన సోదరులు శ్రీ సత్యనారాయణరాజు, శ్రీకృష్ణంరాజుతో కలిసి శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్‌ సేవా ట్రస్టు పేరుతో రిజిస్టర్‌ చేసి కొంత భూమిని ట్రస్టు పేరిట బదలాయించారు. 2002 మే 1వ తేదీన లయన్స్ ఆడిటోరియం నిర్మాణానికి అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీ జెసి విష్ణు ట్రస్ట్ శంకుస్థాపన చేయగా, ఆడిటోరియం నిర్మాణానికి వివిధ వర్గాల ప్రజలు, లయన్ సభ్యులు, అప్పటి నర్సాపురం పార్లమెంటు సభ్యుడు శ్రీ యు వి కృష్ణంరాజు తన పార్లమెంటరీ ప్రభుత్వ నిధుల నుండి ఏడు లక్షల రూపాయలు అందించగా, మిగిలిన నిధులను శ్రీ కూనపరాజు సత్యనాయనరాజు భరించి శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లయన్స్ ఆడిటోరియం పేరిట భారీ భవన నిర్మాణం పూర్తి చేయగా, ప్రముఖ తెలుగు సినీ నటులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా 2004 ఆగస్టు 24 వతేదిన ప్రారంభం చేయబడినది

ఈ లయన్స్ ఆడిటోరియం నిర్మాణంతో పరిసరస గ్రామ ప్రజలకు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు వేదికగాను, క్లబ్ సేవా కార్యక్రమాలకు నిలయం గాను విరాజిల్లుచున్నది