లలితా గౌరి దేవాలయం
లలితా గౌరి దేవాలయం ललिता गौरी मंदिर | |
---|---|
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా: | వారణాసి |
ప్రదేశం: | లలితా ఘాట్, వారణాసి, భారతదేశం |
ఎత్తు: | 73.941 మీ. (243 అ.) |
అక్షాంశ రేఖాంశాలు: | 25°18′36″N 83°00′48″E / 25.310013°N 83.013276°E |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | నాగర |
లలితా గౌరీ మందిర్‌ను లలితా మాతా మందిర్ అని కూడా పిలుస్తారు, ఈ ఆలయం పురాతన పవిత్ర నగరమైన వారణాసిలోని ముఖ్యమైన, చారిత్రక దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం హిందూ మతంలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయాన్ని లలితా దేవి (పార్వతీ దేవి రూపం) కు అంకితం చేయబడింది. ఈ ఆలయం 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని 1800-1804 మధ్య రాణా బహదూర్ షా నిర్మించాడు. లలితా గౌరీ దేవాలయం లలితా ఘాట్ వద్ద ఉంది.[1][2][3]
చరిత్ర
[మార్చు]నేపాల్ రాజు, రాణా బహదూర్ షా, 1800 నుండి 1804 వరకు వారణాసిలో బహిష్కరించబడ్డాడు. తనను తాను "స్వామి నిర్గుణ్" అని పిలుచుకున్నాడు. తన ప్రవాస సమయంలో, వారణాసిలోని పశుపతినాథ్ ఆలయ ప్రతిరూపాన్ని ఉంచడానికి ఘాట్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో లలిత గౌరీ మందిర్ అని పేరు పెట్టబడిన లలిత్ ఘాట్ ఎంపిక చేయబడింది. అపుడు షా ఘాట్ వెంబడి ఆలయాన్ని నిర్మించాడు.[4][5][6]
ప్రత్యేకత
[మార్చు]అమ్మవారి దర్శనాన్ని పొందడం ద్వారా సుఖ సంతోషాలతో పాటు సంతానం కలిగి, కన్యలకు తొందరగా వివాహం కావాలనే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. చైత్ర మాసంలో లలితా గౌరీ దర్శనానికి విశిష్ట ప్రత్యేకత ఉంది. ఆమె పార్వతి దేవి మూడవ రూపంగా పరిగణించబడుతుంది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Nine forms of Goddess Gauri". Shri Kashi darshan. Retrieved 25 Sep 2015.
- ↑ "Lalita Mandir". Kashiyana.com. Archived from the original on 25 September 2015. Retrieved 25 Sep 2015.
- ↑ "Ghat of Goddess". The Times of India. Retrieved 25 Sep 2015.
- ↑ "Ghats of Varanasi". Shri Kashi darshan. Archived from the original on 25 September 2015. Retrieved 25 Sep 2015.
- ↑ "Devi temples". Varanasi temples website. Retrieved 25 Sep 2015.
- ↑ "Devotees throng Lalita Gauri Temple". The Times of India. Retrieved 25 Sep 2015.
- ↑ "Nepali Mandir". ixigo.com. Archived from the original on 25 సెప్టెంబరు 2015. Retrieved 25 Sep 2015.
- ↑ "A piece of Nepal in Varanasi". The Times of India. Retrieved 25 Sep 2015.