Jump to content

లాంప్రే

వికీపీడియా నుండి

లాంప్రేలు
Temporal range: Late Devonian–Recent [1]
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
పెట్రోమైజాంటిఫార్మిస్
Family:
పెట్రోమైజాంటిడే
ఉపకుటుంబాలు

Geotriinae
Mordaciinae
పెట్రోమైజాంటినే

లాంప్రేలు ఒక రకమైన దవడలేని చేపలు. లాంప్రే అనగా రాతి అంటుబిళ్ళ (Stone lickers). ఈ జాతి జీవులన్నింటికి దంతాలున్న గరాటు ఆకారంలోని అంటుబిళ్ళ ఉంటుంది. (lambere: to lick, and petra: stone). ఇవి జలగ మాదిరిగా ఇతర జాతుల దేహంలోకి చొచ్చుకొనిపోయి వాటి రక్తాన్ని పీలుస్తాయి. అయితే ఎక్కువ జీవులు ఇతర చేపలమీద దాడిచేయవని తెలియాలి.[2] జంతుశాస్త్రం ప్రకారం కొంతమంది వీటిని నిజమైన చేపలుగా పరిగణించరు.

ఆహారంగా

[మార్చు]

మానవులు దీర్ఘకాలంగా లాంప్రేలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు.[3] ప్రాచీన రోమన్లు​​ వీటిని ఎంతో ఇష్టపడేవారు. మధ్య యుగాల్లో ఉన్నత తరగతి ప్రజలు వీటిని ఎక్కువగా తినేవారు. ముఖ్యంగా క్రైస్తవాచారాల ప్రకారం మాంసం తినకూడని సమయాల్లో వీటిని విస్తృతంగా తినేవారు. ఇంగ్లాండ్ రాజు హెన్రీ-1 వీటిని బాగా ఇష్టపడేవాడు. వృద్ధాప్యం మీదపడ్డాక కూడా, వైద్యులు వారించినప్పటికీ పట్టించుకోకుండా, చాలా ఎక్కువగా తినేవాడు. అతను పొట్టపగిలేలా లెంప్రేలు తిని మరణించాడని అంటారు -మరణానికి కారణం ఇదేనా అనేది స్పష్టంగా తెలీనప్పటికీ.[4] 1953 మార్చి 4 న యునైటెడ్ కింగ్డమ్ రాణి ఎలిజబెత్ II పట్టాభిషేకం నాటి విందులో లాంప్రే పై తయారుచేయించారు. 60 యేళ్ళ తరువాత, సెవర్న్ నదిలో లాంప్రేలు దొరకనందున, పట్టాభిషేక వజ్రోత్సవానికి లాంప్రేలను ఉత్తర అమెరికా నుండి తెప్పించాల్సి వచ్చింది.[5][6]

ముఖ్యంగా నైరుతి ఐరోపా (పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్) లో, పెద్ద లాంప్రేలు ఇప్పటికీ అత్యంత బహుమతిగా రుచికరమైన. అధికంగా జరిగే చేపల వేట మూలంగా ఆ ప్రాంతాల్లో వారి సంఖ్య తగ్గించింది. లాంప్రేలను స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, బాల్టిక్ దేశాలు, దక్షిణ కొరియా దేశాలలో వినియోగించబడ్డాయి. బ్రిటన్ లో సాధారణంగా ఫిషింగ్ కోసం ఎర, సాధారణంగా చనిపోయిన ఎరగా ఉపయోగిస్తారు.

వర్గీకరణ

[మార్చు]

ఫిష్ బేస్ (FishBase, February 2011) ఆధారంగా లాంప్రే కుటుంబంలో సుమారు 43 జాతుల జీవాలు 8 ప్రజాతులలోను, మూడు ఉపకుటుంబాలలోను వర్గీకరించబడ్డాయి:

మూలాలు

[మార్చు]
  1. ↑ మూస:FishBase order
  2. ↑ Hardisty, M. W., and Potter, I. C. (1971). The Biology of Lampreys 1st ed. (Academic Press Inc.).
  3. ↑ Smith, Lewis. "Older than the dinosaurs: Lamprey fish return to UK rivers after 200 years". The Guardian. Retrieved 16 February 2022.
  4. ↑ Green, Judith A. (2006-03-02). Henry I: King of England and Duke of Normandy. p. 1. ISBN 978-0-521-59131-7.
  5. ↑ Smith, Lewis. "Older than the dinosaurs: Lamprey fish return to UK rivers after 200 years". The Guardian. Retrieved 16 February 2022.
  6. ↑ "Gloucester lamprey pie is fit for the Queen". BBC News. 20 April 2012.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లాంప్రే&oldid=4690072" నుండి వెలికితీశారు