లారా ట్రంప్
లారా ట్రంప్ | |
---|---|
సహ-అధ్యక్షురాలు, రిపబ్లికన్ నేషనల్ కమిటీ | |
Assumed office 2024 మార్చి 8 | |
అంతకు ముందు వారు | డ్రూ మెక్‌కిస్సిక్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | లారా లీ యునస్కా 1982 అక్టోబరు 12 విల్మింగ్టన్, నార్త్ కరోలినా, అమెరికా |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) |
జీవిత భాగస్వామి | |
సంతానం | 2 |
బంధువులు | డోనాల్డ్ ట్రంప్ (మామయ్య) |
లారా లీ ట్రంప్ (ఆంగ్లం: Lara Trump; 1982 అక్టోబరు 12) ఒక అమెరికన్ మాజీ టెలివిజన్ నిర్మాత, ఆమె మార్చి 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ సహ-అధ్యక్షత వహించింది. ఆమె అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ సంతానం ఎరిక్ ట్రంప్ ను వివాహం చేసుకుంది. ఆమె ట్రంప్ ప్రొడక్షన్స్ రియల్ న్యూస్ అప్డేట్ నిర్మాత, హోస్ట్. అలాగే, ఇన్సైడ్ ఎడిషన్ నిర్మాత కూడా.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]లారా యునస్కా నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్ లో 1982 అక్టోబర్ 12న లిండా ఆన్ సైక్స్, రాబర్ట్ ల్యూక్ యునస్కాలకు జన్మించింది. ఆమెకు కైల్ రాబర్ట్ యునస్కా అనే తమ్ముడు ఉన్నాడు.[2] ఆమె ఎమ్స్లీ ఎ. లానీ ఉన్నత పాఠశాలలో చదివింది.[3] ఆమె నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ నుండి కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. న్యూయార్క్ లోని ఫ్రెంచ్ పాకశాస్త్ర సంస్థ (French Culinary Institute)లోనూ ఆమె చదువుకుంది.[4]
కెరీర్
[మార్చు]ఆమె 2012 నుండి 2016 వరకు టీవీ న్యూస్ మ్యాగజైన్ ఇన్సైడ్ ఎడిషన్ కు స్టోరీ కోఆర్డినేటర్ కమ్ నిర్మాతగా ఉంది.[5] 2021 మార్చి 29న, ఆమె ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్ గా చేరి,[6][7] డిసెంబరు 2022 వరకు కొనసాగింది.[8]
రిపబ్లికన్ నేషనల్ కమిటీకి సహ-అధ్యక్షత
[మార్చు]2024 ఫిబ్రవరి 12న, లారా ట్రంప్ ను నార్త్ కరోలినా రిపబ్లికన్ పార్టీ నాయకుడు మైఖేల్ వాట్లీతో పాటు రిపబ్లికన్ నేషనల్ కమిటీ సహ-అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.[9][10] అయితే, 2024 మార్చి 8న లారా ట్రంప్ ఏకగ్రీవ ఓటు ద్వారా రిపబ్లికన్ నేషనల్ కమిటీ సహ-అధ్యక్షురాలిగా ఎన్నికయ్యింది.[11]
వ్యక్తిగత జీవితం
[మార్చు]లారా యునస్కా 2014 నవంబరు 8న ఎరిక్ ట్రంప్ ను వివాహం చేసుకుంది.[12][13] 2017 సెప్టెంబరు 12న, ఈ జంట మొదటి బిడ్డకు[14], 2019 ఆగష్టు 19న రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.[15]
మూలాలు
[మార్చు]- ↑ Hyde, Marina (August 3, 2017). "Move over Sean Hannity, meet Lara Trump – the president keeps the propaganda in the family". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved September 14, 2017.
- ↑ "Eric Trump's brother-in-law has been named chief of staff of an Energy Department office". Newsweek (in ఇంగ్లీష్). 2017-11-08. Retrieved 2018-03-01.
- ↑ Leyva, Hannah (2016-09-02). "Wrightsville Beach native Lara Trump loves coming home to campaign for father-in-law Donald Trump". Port City Daily. Retrieved 2020-10-12.
- ↑ "North Carolina State University 2005 Fall Graduation" (PDF). North Carolina State University. December 14, 2005. Retrieved November 19, 2020.
Lara Lea Yunaska*; (* = Cum Laude/Honors)
- ↑ Hallemann, Caroline; Dangremond, Sam (March 14, 2018). "11 Things to Know About Donald Trump's Daughters-in-Law". Town and Country Magazine. Retrieved November 19, 2018.
- ↑ Weprin, Alex (March 29, 2021). "Fox News Hires Lara Trump". The Hollywood Reporter (in ఇంగ్లీష్). Retrieved March 29, 2021.
- ↑ Barr, Jeremy (March 29, 2021). "Fox News hires the former president's daughter-in-law, Lara Trump, as a pundit". The Washington Post. ISSN 0190-8286. Retrieved March 29, 2021.
- ↑ Steinberg, Brian (December 3, 2022). "Fox News Parts Ways With Contributor Lara Trump". Variety. Retrieved December 18, 2022.
- ↑ Jaramillo, Alejandra; Holmes, Kristen (February 12, 2024). "Trump endorses Whatley to succeed Ronna McDaniel as RNC chair and Lara Trump as co-chair". CNN. Retrieved February 12, 2024.
- ↑ Shabad, Rebecca; Dean, Sarah (February 14, 2024). "Nikki Haley suggests Trump is aiming to 'take' the election by promoting his daughter-in-law for RNC leadership". NBC News. Retrieved February 15, 2024.
- ↑ Jackson, David (March 8, 2024). "Donald Trump's Republican Party elects new leadership - including Lara Trump". USA Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved March 8, 2024.
- ↑ Miller, Gregory E. "Who Is Lara Trump? 10 Things to Know About the President's Daughter-in-Law". Town & Country. Retrieved August 9, 2017.
- ↑ Rivera, Zayda (November 9, 2014). "Eric Trump marries Lara Yunaska in Palm Beach wedding". New York Daily News (in ఇంగ్లీష్). Retrieved September 14, 2017.
- ↑ "Eric and Lara Trump Welcome Son Eric". PEOPLE.com. September 12, 2017.
- ↑ Murphy, Helen (August 20, 2019). "Eric and Wife Lara Trump Welcome Second Child, President Donald Trump's 10th Grandchild".