లాలి జో లాలీ జో ఊరుకో పాపాయి (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లాలి జో లాలీ జో ఊరుకో పాపాయి అనునది ఇంద్రుడు చంద్రుడు చిత్రం లోని ఒక పశ్చాత్తాప భావాత్మకమైన పాట. సంగీతం: ఇళయరాజా, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గాత్రం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

నేపథ్యం

[మార్చు]

దుష్టుడైన జి కే రాయుడు కమల్ హసన్ భార్యా పిల్లలని పట్టించుకోకుండా భార్యని హింసిస్తూ పరకాంతాలోలుడిగా ఉంటాడు.తన ఉంపుడుగత్తె, తన సహాయకుడు అప్పటికే పెళ్ళి చేసుకొన్నారని, తన డబ్బుపై ఆశ తో వారు నటిస్తున్నారని తెలుసుకొన్న రాయుడు పశ్చాత్తాపంతో క్రుంగిపోయి, తన భావాలన్నీ పసిపాప అయిన తన కూతురికి కథ ద్వారా వివరిస్తాడు. భార్యా పిల్లలున్న ఫోటోని చూసి రాయుడి కళ్ళ చెమర్చటం, కన్నీటిని రాయుడు కంటి అద్దాల కాడతో తుడవటం, ఆ ఫోటో వద్దకి వెళ్ళి దానిని నిమురుతుండగా, అది క్రింద పడిపోయే సమయంలో చేతిని అడ్డుపెట్టి దానిని రక్షించుకోవటం వంటి హృద్యమైన సన్నివేశాలలో కమల్ అద్భుతంగా నటించారు.

పాట లోని సాహిత్యం

[మార్చు]

లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

||లాలి జో లాలి జో||

తెలుసా ఈ ఊసు, చెబుతా తల ఊచు
కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది
ఆలినే కాదంది కాకినే కోరింది
...
(ఉరుములు, మెరుపుల శబ్దం)
అంతలో ఏమైందో అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
ఊహూహూ ఊహూహూ
ఊహూహూ ఊహూహూ

(ఆ తర్వాత, శాంతి ఎక్కడా, మన శాంతి ఎక్కడా
అప్
భయమేసిందా?)

ఊహూహూ ఊహూహూ
ఊహూహూ ఊహూహూ

మాయనే నమ్మింది, బోయతో పొయ్యింది
దెయ్యమే పూనిందో, రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో, ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది, ముప్పునే చూసింది
కన్నులే విప్పింది, గండమే తప్పింది
ఇంటిలో చోటుందా, చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

ఊహూహూ ఊహూహూ
ఊహూహూ ఊహూహూ

పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారు
గుండేలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు
నేరం నాదైనా, భారం మీ పైనా
తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించూ, మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా

ఊహూహూ ఊహూహూ
ఊహూహూ ఊహూహూ