లాలి పాటలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఏడ్చే పిల్లాడిని బుజ్జగిస్తూ, లాలిస్తూ పాడే పాటలు లాలి పాటలు. నిద్రపుచ్చుటకై జోకొడుతూ పాడే పాటలు జోల పాటలు.
సప్త స్వరాల అనుబంధం
[మార్చు]నిద్రపోవడమూ, మేలుకొనడమూ అన్నవి మన జీవితంలో అతి సరళమైన క్రియలు. వీటి చుట్టూ వెలిసిన గేయాలే లాలి పాటలు, జోలపాటలు శిశువులనుద్దేశించి వారికోసము పాడేపాటలు. అనాగిరుకులైన కొండజాతుల నుంచి మహానాగరికులైన వారివరకూ లాలిపాటలు వాడుకలో నున్నవి. వీటిలో సాహిత్యార్ధము, గౌణము, సంగీతము, చివరి స్వరాలు మాత్రమే ప్రధానము. ఈ పాటలు బిడ్డలకు విశ్రాంతి నివ్వడానికి నిర్మించినవి కనుక శ్రుతి లలితములగు మాటలనే వీటిలో ఉపయోగిస్తారు. ఏడ్చే పిల్లాడిని బుజ్జగిస్తూ, లాలిస్తూ పాడే పాటలు లాలి పాటలు. నిద్రపుచ్చుటకై జోకొడుతూ పాడే పాటలు జోల పాటలు. జోలపాటల్నీ, లాలిపాటల్నీ పాడేటప్పుడు చరణము పూర్తికాగానే జో, జో అనీ లేదా లా, లీ అనీ చివరవచ్చె అక్షర శబ్దాల్ని రీ, సా అనే (శంకరాభరణ) స్వరాలతో చేర్చి, లాగి పాడుతారు. స్వరం అన్నది (స్వతో రంజయతీతి స్వరం) ఈ ఒక్కటయినా తనంతట తానే రంజించగలదు. సప్త స్వరాలునూ 'స' అన్నది మొదటిదీ, వాటికన్నిటికినీ కారణమును. 'స' నుంచి పై 'స' కి ఆరోహిస్తున్నప్పుడు స్వరాలస్థాయి హెచ్చుతుంది. 'స' అన్నది శాంతంగా, కలతలేని నిద్రవలె ప్రశాంతతను ధ్వనిస్తుంది. 'రీ', 'స' కంటే కొంచెము ఎత్తు; 'స' యొక్క ప్రశాంతత్వము పోయి, కలత ప్రారంభమైనట్టు అనిపించును.'గ' లో మరింత కలత ఉంది. 'మ' తో మెలుకువ వచ్చినట్లే 'ప' తో మెలుకువ వస్తుంది. మళ్ళే 'ధ' 'ని' లు మెలుకువకంటె ఎక్కువ కలత కలిగిస్తూ పై 'స' దగ్గరకు వెళ్ళేసరికి పూర్తిగా తెలివి వచ్చిన ప్రశాంతత్వము ఏర్పడుతుంది. పాట పాడేవారు సామాన్యంగా రాగాన్ని 'స' ప్రారంభించి 'స' తోనే పూర్తి చేస్తారు. లాలిపాటలవల్ల బిడ్డని నిద్ర జోకొట్టడమంటె 'స' యొక్క ప్రశాంతిని బిడ్డకి అందించడమే. దీనికి ఒకటే మార్గము, 'సా' అనే స్వరాన్నే జోరుగా, నిరంతంరంగా, నెమ్మదిగా విని పించడమే. అయితే ఒక్క 'సా' ని పాడి వినిపించడము వల్ల ఈపని జరగదు.అందుకే నవరోజు రాగముతో బిడ్డని నిమిరి, చరణము కొసని, 'లా' ని 'రీ' తో కలిపి కొంతసేపు నిలుపుతారు.ఈ స్వరం విన్నప్పుడు, బిడ్డల నరాలు దువ్వి సమం చేసినట్టై, దీని తరువాత 'లి' అనే అక్షరంతో 'సా' ని విని తృప్తి పడి సళ్ళి పోతాయి. 'లాలీ' అనడంలో 'రీ, సా' స్వరాలు రెండూ బిడ్డని పదిలంగా నిద్రలోకి దింపయత్నిస్తాయి.ఇలాగ నాలుగైదు చరణాలు పాడేసరికి పసిబిడ్డ నరాలు ప్రశాంతమైన 'సా' తో మేళవించి నిద్రలోమునుగుతాయి. 'రీసా' అనే స్వరాలు 'జో, జో' అనే సమానక్షర శబ్దాలతో కంటే 'లాలీ' అనే భేదాక్షర శబ్దాల్తో చక్కగా అమరిపోతాయి.'లా' లోని ఆకారదీర్ఘము, తన వలనే కలతని ఇముడ్చుకున్న 'రీ' తోనూ, 'లీ' లోని ఇకారదీర్ఘము తనవలనే ప్రశాంతమైన 'సా' తోనూ కలిసిపోతాయి.
లాలి పాటలు
[మార్చు]రామాలాలీ
[మార్చు]రామాలాలీ మేఘశ్యామాలాలీ
తామరస నయనా దశరథ తనయా లాలీ
అద్దాల పెట్టెలోన ఆదివిష్ణువు
ముద్దు పాపడున్నాడనుచు
మురియుచుంటినీ
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకకెంతొ కరిగినావురా
లాలి లాలి
[మార్చు]లాలి లాలి ఓ లాలి నీవే నా పాప లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా పాట లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా/మా అమ్మ లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా జోల లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా జో జో లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా పాప లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా పాట లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా/మా అమ్మ లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా జోల లాలి
జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా జో జో లాలి
లాలి లాలి ఓ లాలి.. .. లాలి లాలి ఓ లాలి .. .. లాలి లాలి ఓ లాలి
ఏడవకు ఏడవకు
[మార్చు]ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీ కనుల నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలైనా కారవే బంగారు కనుల
ఉయ్యాల జంపాల
[మార్చు]ఉయ్యాల జంపాలలూగరావమ్మ
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||
కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ||
శుభశుక్రవారమున సుదతులు వూచ
నూరి జనము పొగడ సుందరముగాను
కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను
కావేటీ రంగనితో కలసినీవూగ ||ఉ||
శ్రీ విల్లి పూత్తూరిలో వెలసితివి తల్లీ
శ్రీరంగధాముని చేపట్టితివమ్మా
చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి
చేతనులను రక్షించ చెలులందరు ఊచ ||ఉ||
సీతమ్మకి లాలి
[మార్చు]నవరోజి రాగము - ఖండజాతి ఏకతాళము
లాలిబం| గరుబొమ్మలాలిమా| య.మ్మ. సా స సా | స స సా స | సా రి స నీ పా|ని స రిగా రి లాలిము | ద్దుల్ గు.మ్మ | లాలిసీ.| త.మ్మా. రీగా మా | ప మ గి ర స | సా రి సని | దనిని ద ప లాలీ.
మొదటి భాగములోని 'స స సా' ల మెత్తని స్పర్శా, చివ్వరి 'రీ సా' ల లలిత అవరోహణమూ నరాలను సళ్ళించడానికి చాలా సహాయకారులు కనుకనే నిద్ర జో కొట్టడానికి ఉపయోగించేవి లాలి పాటలు పాడుదురు.
లాలనుచు
[మార్చు]లాలనుచు పాడరమ్మా,
ఈబిడ్డ లక్ష్మీవిలాసుడమ్మా
పాదమున చక్రమమ్మా,
ఈ బిడ్డ వేదాంతవేద్యుడమ్మా
వేణునాదంబుతోను,
ఈ బిడ్డ వేదములు పాడునమ్మా.
ఇలాంటి పాటల వరుసను బట్టే కస్తూరి రంగ రంగా అన్నపాట జోలపాటగా మొదలుపెట్టిఉంటారు.
రామ లాలీ
[మార్చు]శ్రీ రాగము - చతురశ్ర జాతి ఏకతాళము.
రా.మ| లా లీ| మే.ఘ.|శ్యామ|లా..|లీ.|.. సససని| సరీ, |రీ;|గరీరీస|నీసా|గరిరిస|సని|పా;;|| తామ|ర.స.| నయనా| దశరథ|తనయా| లా..|లీ| రీరీ|గరిరిస|సనిపా|పనినిస|నిససరి| గరిరిస|సా;|;;||
మేలుకొలుపులు
[మార్చు]లాలిపాటలకీ మేలుకొలుపులకీ సామ్యమూ వుందీ, బేధమూ ఉంది.ఇవి నిద్ర లేవగొట్టడానికి పాడుతారు.ఇవి మేలుకో అన్న చివ్వరమాటతో ఆరోహణ స్వరాల్ని వరసగా వినిపించి శరీరాన్ని మెలకువలోకి ఆరోహింపజేస్తాయి.అవి అన్నీ భూపాల రాగములో ఉంటాయి. త్యాగరాజు మేలుకొవయ్యా అన్న కీర్తనని బౌళి రాగములో పాడేడు.భూపాల జానపద రాగము, బౌళి పండిత గాయకుల రాగము.
శ్రీ కృష్ణుడు మేలుకొలుపు పాట
[మార్చు]బంగారు చెంబులో పన్నీరుపట్టుక
పణతి రుక్మణివచ్చె మేలుకో,
దంతకాష్ఠము బూని తామరసాక్షి సు
దంత వచ్చినాది మేలుకో||
వాసుదేవ భక్త వరజన పోషక
వసుదేవ నందన లేరా
కంస సంహార ఖగరాజ గమనుడ
కరిరాజ వరదుడా లేరా||
ఘోరమయిన సంసారబాధ గడ
తేరలేరు జనులు మేలుకో
దారిజూపి వారి దరిజేర్చకున్న నె
వ్వారు దిక్కు స్వామి మేలుకో||
శ్రీ కృష్ణుడు మేలుకొలుపు పాట
[మార్చు]తెల్ల వారవచ్చె పల్లవాధరనీదు
వుల్లము రంజిల్ల మేలుకో
గొల్లల ఇండ్లలో వెన్న లారగించ
వేళాయె శ్రీకృష్ణ మేలుకో
తెల్లవారవచ్చెనూ||
పూతన చనుదాలు పుక్కిటగొనిదాని
పాతక మణచాలి మేలుకో
ఘాతుక దానవుల నూతనపు చిన్నెల
ఖ్యాతిగదును మాడ మేలుకో
తెల్లవారవచ్చెనూ||
రేపల్లెవాడలో గోపకామినులకు
తాపములణచాలి మేలుకో
కూరిమితో కంసుని కొలువుకూటంబున
కూలదన్నవలె మేలుకో
నీపాదపద్మముల నరులకు చూపించి
పరము నందించంగ మేలుకో||
మేలుకొలుపులలో రచయితలపేర్లు కూడా ఇమిడి కనబడడముతో వాటి 'రచన' చక్కగా ధ్వనిస్తుంది.లాలిపాటలు, పిల్లల ఆటగేయాలు ఎవరు రాశారన్న ప్రశ్న పుట్టదు.కాని మేలుకొలుపులు అవసరముకోసము ఆవిర్భవించినవి కావు, పూని రచించినవి.అందుకే రచయిత పేరు! తత్వపు మేలుకొలుపు 'జీవా మేలుకో' అన్నది రచించి నాతడు వెంకట శివరామదాసు.ఇతని భాష పండితుల భాషే.యతులూ ప్రాసలు చక్కగా వేసినాడు.