లాల్ దర్జా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్ దర్జా
Lal Darja Movie Poster.jpg
దర్శకత్వంబుద్ధదేవ్ దాస్‌గుప్తా
రచనబుద్ధదేవ్ దాస్‌గుప్తా
నిర్మాతచిత్రాని లాహిరి
దులాల్ రాయ్
తారాగణంచంపా
సుభేందు ఛటర్జీ
రైసుల్ ఇస్లాం
ఇంద్రాణి హల్దార్
ఛాయాగ్రహణంవేణు
కూర్పుఉజ్జల్ నంది
సంగీతంబప్పీలహరి
విడుదల తేదీ
1997
సినిమా నిడివి
97 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

లాల్ దర్జా, 1997లో విడుదలైన బెంగాలీ సినిమా. కోల్‌కతా దంతవైద్యుడు డాక్టర్ నాబిన్ దత్తా గురించి రూపొందిన ఈ సినిమాకు బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వం వహించాడు. చిత్రాని లాహిరి, దులాల్ రాయ్ నటించిన ఈ సినిమాలో చంపా, సుభేందు ఛటర్జీ, రైసుల్ ఇస్లాం, ఇంద్రాణి హల్దార్ తదితరులు నటించారు. ఈ సినిమాకు భారతీయ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు వచ్చింది.[1]

కథా సారాంశం[మార్చు]

47 ఏళ్ళ దంతవైద్యుడైన నబీన్ దత్తా (సుభేందు చటోపాధ్యాయ)కు డార్జిలింగ్‌లో చదువుతున్న కుశాల్ అనే కుమారుడు ఉన్నాడు. నబీన్ భార్య అతనితో విడిపోవాలని కోరుకుంది. తన డ్రైవర్ దినుకు ఇద్దరు భార్యలు సుఖి (నందిని మాలియా), మలోతి (ఇంద్రాణి హల్దార్). దిను భార్యలు అతనితో మంచిగా ఉంటున్నారు, వారికి దిను గురించి ఎటువంటి సమస్యలు లేవు. అతను తన పరిస్థితిని డ్రైవర్ దినుతో పోల్చుకున్నాడు. నబీన్ తనను తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. చిరపుంజీలోని తన బాల్యం గురించి, ఎరుపు రంగు గేటు గురించి అతను ఎక్కువగా ఆలోచించాడు. గేట్ ఓపిక కలిగి ఉందని, నబిన్ తనను ఎరుపు రంగు గేటుతో పోల్చుకున్నాడని అతని తల్లి తెలిపింది. చివరకు, తన భార్య - కొడుకు తన నుండి వెళ్ళిపోయిన తరువాత అతను తన సహనాన్ని పెంచుకొని, తనతో ఒంటరిగా జీవించడం ప్రారంభించాడు.

నటవర్గం[మార్చు]

  • చంపా[2]
  • సుభేందు ఛటర్జీ (నబీన్ దత్తా)
  • రైసుల్ ఇస్లాం
  • ఇంద్రాణి హల్దార్ (మలోతి)
  • బిప్లాబ్ ఛటర్జీ
  • హరధన్ బందోపాధ్యాయ

మూలాలు[మార్చు]

  1. bdbazar.com Archived 26 ఏప్రిల్ 2010 at the Wayback Machine
  2. "LIKE A GRACEFUL CHAPTER". The Daily Star (in ఇంగ్లీష్). 2019-01-12. Retrieved 2021-06-10.

 

బయటి లింకులు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లాల్ దర్జా