లావాసో డ్వార్ఫ్ లెమర్
Appearance
లావాసో డ్వార్ఫ్ లెమర్ (Lavasoa dwarf lemur) | |
---|---|
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | Mammalia
|
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. lavasoensis
|
Binomial name | |
Cheirogaleus lavasoensis Thiele et al., 2013
|
లావాసో డ్వార్ఫ్ లెమర్ లెమర్ జాతికి చెందిన ఒక వానరము.
విశేశాలు
[మార్చు]- గుడ్లగూబ లాంటి కళ్లు, పిడికెడు శరీరం, నక్కలాంటి లావాటి తోక. ఇది కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం.
- ఇది ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల కంటబడింది. అయితే అసలు ఇది ఏ జాతికి చెందుతుందని చెప్పడానికి ఇన్నేళ్లు పరీక్షలు గట్రా జరిపి ఇప్పుడు ఇది లెమర్ జాతిదేనని తేల్చారు.
- లెమర్లు మొత్తం సుమారు వంద జాతులు. వాటిల్లో అయిదు పొట్టి జాతివి ఉన్నాయి. ఈ పొట్టివాటిల్లో ఈ కొత్తదీ చేరిపోయింది.
- లెమర్లు ఆఫ్రికా దగ్గరలోని మడగాస్కర్ దీవిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి.
- ఈ కొత్త వానరాన్ని లావాసో పర్వతాల్లో గుర్తించారు కనుక 'లావాసో డ్వార్ఫ్ లెమర్' అనే పేరుపెట్టారు!
- ఇది కేవలం పావుకిలో బరువు, 20 అంగుళాల పొడవుంటుంది. గుండ్రని కళ్లు, చిక్కని బొచ్చు, పెద్ద పెద్ద చెవులతో ఉండే వీటి శరీరం ముదురు ఎరుపురంగులో ఉంటుంది.
- ఇవి రాత్రిళ్లు మాత్రమే తిరుగుతాయి. అడవిలో దట్టమైన పొదలపై వీటి కాపురం. చలికాలంలో సోమరిగా నెలలకొద్దీ చెట్లపైనే గడుపుతాయి. మిగితా కాలాల్లో మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి!
- వీటి పోలికలు మిగతా లెమర్ల పోలికలకు దగ్గరగానే ఉన్నా, ఓ పట్టాన మనుషుల కంట పడవు. తప్పించుకుపోయే తత్వం ఎక్కువ. అందుకే ఇవి ఎలా జీవిస్తాయో ఎక్కువగా తెలుసుకోవడానికి వీలు కాలేదు.
- ఈ బుల్లి జీవులకు ఇప్పుడు ముప్పువాటిల్లింది. వీటి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 50 వరకే ఉన్నాయి! అంతరించిపోయే దశకు చేరాయి.
- మడగాస్కర్ దీవిలో స్థానిక భాషలో 'లెమర్' అంటే దెయ్యం అని అర్థం.
- వీటిల్లో అతిపెద్దది ఇంద్రి. ఏడున్నర కిలోల వరకు బరువు పెరుగుతుంది.
- చిన్నది డ్వార్ఫ్ మౌస్. ఇది కేవలం 10 గ్రాముల బరువుంటుంది.
బయటి లంలెకు
[మార్చు]- మడగాస్కర్ లో కనుగొనబడ్డ కొత్త జీవ జాతి లెమర్లు