లిలియన్ గిష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిలియన్ గిష్
1921 నాటి ప్రచార చిత్రం
జననంలిలియన్ డయానా గిష్
(1893-10-14)1893 అక్టోబరు 14
స్ప్రింగ్‌ఫీల్డ్, ఓహియో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం1993 ఫిబ్రవరి 27(1993-02-27) (వయసు 99)
న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వృత్తి
 • నటి
 • దర్శకురాలు
 • స్క్రీన్‌ప్లే రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1902–1988
రాజకీయ పార్టీరిపబ్లికన్ పార్టీ
బంధువులుడొరోతీ గిష్ (సోదరి)
తల్లిమేరీ రాబిన్సన్ మెక్‌కోనెల్
సంతకం

లిలియన్ డయానా గిష్ (1893 అక్టోబర్ 14 – 1993 ఫిబ్రవరి 27) అమెరికన్ నటి, దర్శకురాలు, స్క్రీన్‌ప్లే రచయిత.[1] 1912లో మూకీ లఘు చిత్రాలతో మొదలై 1987 వరకూ 75 సంవత్సరాల పాటు కొనసాగింది. అమెరికన్ సినిమా ప్రథమ మహిళ ("ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికన్ సినిమా") అన్న ఖ్యాతి గడించింది. సినిమా నటనలో మౌలికమైన టెక్నిక్స్‌ని ఆవిష్కరించిందన్న పేరొందింది.[2] 1999లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గిష్‌కు క్లాసిక్ హాలీవుడ్ సినిమాల్లో అత్యంత గొప్ప మహిళా సినీ తారల జాబితాలో 17వ స్థానం కల్పించింది.[3]

గిష్ తన సోదరితో కలసి రంగస్థలంపై బాల్యనటిగా కెరీర్ ప్రారంభించింది. 1912 నుంచి 1920 మధ్యకాలంలో ప్రముఖమైన సినీ తారగా వెలుగొందింది. మరీ ముఖ్యంగా దర్శకుడు డి. డబ్ల్యు. గ్రిఫిత్‌ సినిమాల్లో ఆమె నటన బాగా ప్రాచుర్యం చెందింది. వీటిలో మూకీ యుగంలో అత్యధిక వసూళ్ళు సాధించిన, సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన గ్రిఫిత్ సినిమా ద బర్త్ ఆఫ్ ఎ నేషన్ కూడా ఒకటి.[4] ఆమె నటించినవాటిలో మూకీ యుగానికి చెందిన ఇతర ప్రముఖ చిత్రాలు ఇవి: ఇన్‌టాలరెన్స్ (1916), బ్రెకెన్ బ్లాసమ్స్ (1919), వే డౌన్ ఈస్ట్ (1920), ఆర్ఫన్స్ ఆఫ్ ద స్టార్మ్ (1921), లా బోహేమె (1926), ద విండ్ (1928).[5][6][7]

టాకీ యుగం ప్రారంభంలో ఆమె తిరిగి సినిమాల్లో వెలుగులోకి వచ్చింది. అరుదుగా అయినా ప్రాముఖ్యత కలిగిన సినిమాల్లో ప్రధాన పాత్రలు చేసింది. వాటిలో వెస్టర్న్ సినిమా డ్యుయెల్ ఇన్ ద సన్ (1946), థ్రిల్లర్ సినిమా ద నైట్ ఆఫ్ ద హంటర్ (1955) వంటివి ఉన్నాయి.[8] డ్యుయెల్ ఇన్ ద సన్ సినిమాలో నటనకు గాను ఆస్కార్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందింది.[9] ఆమె పోర్ట్రెయిట్ ఆఫ్ జెన్నీ (1948), ఎ వెడ్డింగ్ (1978), స్వీట్ లైబ్రెరీ (1986) సినిమాల్లో ముఖ్యమైన సహాయ పాత్రలు కూడా చేసింది.[10][11][12]

ఆమె 1950ల నుంచి 1980ల వరకూ టెలివిజన్ పరిశ్రమలోనూ చెప్పుకోదగ్గ పాత్రలు చేసింది.[13] చివరగా 1987లో ద వేల్స్ ఆఫ్ ఆగస్ట్ సినిమాలో బెటె డేవిస్ సరసన నటించాకా నటన నుంచి రిటైర్ అయింది.[14]

తన చివరి దశలో మూకీ సినిమాల విశిష్టత గుర్తింపు, పరిరక్షణ జరగాలన్న విషయంపై ఉద్యమిస్తూ, వాదిస్తూ ఉండేది.[15] గిష్ సినిమా రంగంలో నటిగా ఎక్కువ గుర్తింపు లభించినా నాటక రంగంలో కూడా మంచి కృషి చేసింది. అందుకు గాను 1972లో అమెరికన్ థియేటర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సాధించింది.[16] 1971లో తన కెరీర్‌లో సాధించిన విజయాలకు గాను ఆస్కార్ గౌరవ పురస్కారాన్ని అందుకుంది.[17] 1982లో అమెరికన్ సంస్కృతికి ప్రదర్శన కళల ద్వారా చేసిన కృషికి గాను కెనడీ సెంటర్ ఆనర్ పొందింది.[18]

మూలాలు[మార్చు]

 1. "Theatre | Alexander Street, a ProQuest Company". search.alexanderstreet.com.
 2. "American Film Institute". www.afi.com.
 3. "AFI's 100 Years...100 Stars: The 50 Greatest American Screen Legends". American Film Institute. Retrieved November 10, 2019.
 4. "The Birth of a Nation | Cast, Plot, Summary, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
 5. "Where to begin with Lillian Gish". BFI (in ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
 6. "Intolerance (1916)". www.filmsite.org. Retrieved 2023-05-16.
 7. "AFI|Catalog". catalog.afi.com. Retrieved 2023-05-16.
 8. Kashner, Sam; MacNair, Jennifer (2003). The Bad & the Beautiful: Hollywood in the Fifties. W. W. Norton & Company. p. 192. ISBN 0393324362. Retrieved February 8, 2020 – via GoogleBooks.
 9. "The 19th Academy Awards (1947) Nominees and Winners". oscars.org. Archived from the original on July 6, 2011. Retrieved 2011-08-19.
 10. "Sweet Liberty (1986), Review by Vincent Canby, May 14, 1986". The New York Times. May 14, 1986. Archived from the original on July 10, 2012.
 11. Oderman, Stuart. Lillian Gish: A Life on Stage and Screen. McFarland & Co., 2000, p. 324. ISBN 0-7864-0644-5.
 12. Staff, Variety (1948-01-01). "Portrait of Jennie". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
 13. Atkinson, Brooks (November 4, 1953). "First Night at the Theatre: Lillian Gish Gives a Notable performance in Foote's 'The Trip to Bountiful'". The New York Times. p. 30. Retrieved May 8, 2013.
 14. Walsh, David. "A conversation with Mike Kaplan, the producer of The Whales of August (1987), Lillian Gish's final film". www.wsws.org. Retrieved 2019-12-11.
 15. Brownlow, Kevin; Gill, David (1980). Hollywood: A Celebration of the American Silent Film (video). Thames Video Production.
 16. Annie Berke, "'Never Let the Camera Catch Me Acting': Lillian Gish as Actress, Star, and Theorist," Historical Journal of Film, Radio, and Television 36 (June 2016), 175–189.
 17. "Honorary Award | Oscars.org | Academy of Motion Picture Arts and Sciences". www.oscars.org (in ఇంగ్లీష్). 2014-07-17. Retrieved 2023-05-16.
 18. "Lillian Gish | Kennedy Center". The Kennedy Center (in ఇంగ్లీష్). Retrieved 2023-05-16.