లులు మాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లులు మాల్
ప్రదేశంఎడపల్లి, కొచ్చి
అక్షాంశ రేఖాంశాలు10°1′32″N 76°18′28″E / 10.02556°N 76.30778°E / 10.02556; 76.30778
చిరునామాఎడపల్లి, కొచ్చి – 682024
ప్రారంభ తేదీ10 మార్చి 2013
యజమానిలులు గ్రూప్ ఇంటర్నేషనల్
నిర్మాణ శిల్పిడబ్ల్యూ ఎస్ అట్కిన్స్
స్టోర్‌ల సంఖ్య, సేవలు215[1]
ఏంకర్ టెనంట్స్ సంఖ్య5
మొత్తం ఫ్లోర్ విస్తీర్ణం2,500,000 sq ft (230,000 m2)[2] (Total built up area)
ఫ్లోర్ల సంఖ్య4
లుల్ మాల్ is located in Kerala
లుల్ మాల్
లుల్ మాల్
కేరళ లో "లులు మాల్" ఉనికి

లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కేరళ రాష్ట్రం కొచ్చిలో నెలకొని వున్న భారతదేశంలోని అత్యంత విశాలమైన షాపింగ్ మాల్.[3][4][5] ప్రతిరోజు సగటున 80,000 మంది ఈ మాల్‌ను సందర్శిస్తారు. కేరళలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి.[6] ఇది 17 ఎకరాలు (6.9 హెక్టార్లు) విస్తీర్ణంలో మొత్తము 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దానిలో 17 లక్షల చదరపు అడుగుల స్థలం నికరంగా లీజుకు ఇవ్వడానికి వీలుగా ఉంది. ఈ మాల్ 2013,మార్చిలో ప్రారంభమైంది. దీనిలో 215 దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఫుడ్ కోర్టులు, రెస్టారెంటులు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, ఒక మల్టీప్లెక్స్, ఐస్ స్కేటింగ్ రింక్, బౌలింగ్ అల్లేలు ఉన్నాయి.[1][7][8][9][10] ఈ ప్రాజెక్టు అయిన మొత్తం ఖర్చు 1600 కోట్లు (25 కోట్ల డాలర్లు)గా అంచనా వేయబడింది.[11]లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన యూసుఫ్ అలీ ముసల్లియం వీట్టిల్ అబ్దుల్ ఖాదర్ ఈ ఆస్తికి స్వంతదారుడిగా, నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థకు రిటైల్, రియల్ ఎస్టేట్ మొదలైన రంగాలలో విస్తృతమైన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ భారతదేశంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు. ఈ సంస్థ తిరువనంతపురం, లక్నో,[12] చెన్నై,బెంగళూరు, హైదరాబాదులలో మాల్స్ నిర్మించడానికి తలపెట్టింది.

ప్రదేశం[మార్చు]

లులు మాల్ కొచ్చి నగరంలో రెండు జాతీయ రహదారులు ఎన్.హెచ్ 544, ఎన్.హెచ్ 47ల కూడలి అయిన ఎడప్లల్లి జంక్షన్‌లో నెలకొని ఉంది. ఎడపల్లి మెట్రో రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఉంది. ఈ షాపింగ్ మాల్ కేరళ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పర్యాటకులను ఆకర్షిస్తూ వుంది.

రికార్డు పుస్తకాలలో స్థానం[మార్చు]

2016, అక్టోబర్ 27న లులు మాల్ ఉద్యోగులు భారత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ "లులు సాల్యూట్స్ టు అవర్ సోల్జర్స్" అనే పేరుతో 5509 ప్రమిదలను మాల్ ఆవరణలో ఒక నిముషంలో వెలిగించి దీపావళిని ముందుగా జరుపుకున్నారు. ఈ ఉదంతం "ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్[13]", "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్[14]"లలో నమోదయ్యింది.

ఆకర్షణలు[మార్చు]

అర్ధపారదర్శకమైన పైకప్పును కలిగిన లులు మాల్ కేంద్ర ప్రాంగణం.
మాల్ లోని ఫుడ్‌కోర్ట్
మాల్ లోని అమ్యూజ్‌మెంట్ ఏరియా
  • లులు హైపర్ మార్కెట్
  • 22 మల్టీ కుజీన్ కిచెన్లు, 2,500 మంది కూర్చోడానికి వీలున్న 4 విశాలమైన రెస్టారెంట్లు ఉన్న ఫుడ్ కోర్ట్
  • 71,000 sq ft (6,600 m2) విస్త్రీర్ణం, 9 స్క్రీన్‌లు కల పి.వి.ఆర్.సినిమాస్ మల్టీప్లెక్స్[15]
  • ఆర్కేడ్ గేమ్స్, 5D సినిమా, పార్టీ హాల్, 12 లేన్ బౌలింగ్ అల్లే, ఇండోర్ క్లైంబింగ్, అమ్యూజ్‌మెంట్ ఆర్కేడ్
  • 5,000 sq ft (460 m2) విసీర్ణం కల ఐస్ స్కేటింగ్ రింక్ (దక్షిణ భారతదేశంలో పెద్దది)[8]
  • 3500 వాహనాలు నిలపడానికి వీలున్న పార్కింగ్ స్థలం
  • మనీ ఎక్స్‌చేంజ్ సెంటర్లు
  • అర్ధపారదర్శకమైన పైకప్పును కలిగి గాజుగోడలతో నిర్మించిన అతిపెద్ద కేంద్ర ప్రాంగణం
  • ఎడపల్లి మెట్రో రైల్వే స్టేషన్ నుండి నేరుగా మాల్ లోనికి వాక్ వే

సదుపాయాలు[మార్చు]

ప్రధాన అంగళ్లు & మినీ డిపార్ట్‌మెంట్ స్టోర్లు[మార్చు]

  • లులు హైపర్‌మార్కెట్ - 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద హైపర్‌మార్కెట్
  • మిగిలిన ప్రధాన దుకాణాలలో లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, లులు సెలెబ్రేట్, పివిఆర్ సినిమాస్, స్పార్కీస్ ఉన్నాయి.
  • వెస్ట్‌సైడ్, మార్క్స్& స్పెన్సర్ వంటి మిని డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ ఉన్నాయి.

మల్టీప్లెక్స్[మార్చు]

  • పివిఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్ 9 తెరలతో 71,000 sq ft (6,600 m2) స్థలాన్ని ఆక్రమించుకుని ఉంది. రెండవ అంతస్తులో ఉన్న ఈ మల్టీప్లెక్స్‌కు వెలుపలి నుండి ప్రవేశించడానికి ఎలివేటర్లు ఉన్నాయి.

లీజర్ జోన్[మార్చు]

  • మూడవ అంతస్తులో ఉన్న మనోరంజక క్షేత్రంలో ఇండోర్ క్లైంబింగ్ వాల్, ఐస్ స్కేటింగ్ రింక్, 5Dసినిమా, ఆర్కేడ్ గేమింగ్ జోన్, పార్టీ హాల్, 12 వరుసల బౌలింగ్ అల్లే ఉన్నాయి.

ఐదు నక్షత్రాల హోటల్[మార్చు]

ఈ షాపింగ్ మాల్‌ను ఆనుకుని మారియట్ హోటల్ ఉంది. ఈ హోటల్ 84 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ హోటల్ మీద హెలీపాడ్ ఉంది.[7]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "The highway to shopping". The New Indian Express. 11 March 2013. Archived from the original on 26 మార్చి 2016. Retrieved 16 జూన్ 2018.
  2. https://economictimes.indiatimes.com/slideshows/infrastructure/indias-largest-mall-in-kochi-lulu-mall/lulu-mall-kochi/slideshow/18923992.cms
  3. "LuLu Group: Going places". Khaleej Times. Retrieved January 26, 2016.
  4. "Bharat Bandh incurs Rs 1,500 cr loss to Kerala". The New Indian Express. Retrieved September 3, 2016.
  5. "Fresh ides needed for startups to navigate Bharat". The Economic Times. Retrieved January 16, 2016.
  6. "Lulu Group to build Rs 2,000 crore convention centre, hotel, mall in Visakhapatnam". The Economic Times. Archived from the original on 2018-06-17. Retrieved March 12, 2018.
  7. 7.0 7.1 "Mega-size mall to be open in Kochi on March 10". Times of India. 1 March 2013. Archived from the original on 12 జూన్ 2013. Retrieved 17 March 2013.
  8. 8.0 8.1 "Skate on Ice this summer". Deccan Chronicle. 29 April 2013.[permanent dead link]
  9. "PVR cinemas in Kochi". 23 Dec 2013. Archived from the original on 13 ఆగస్టు 2017. Retrieved 16 జూన్ 2018.
  10. "Lulu Mall to be opened tomorrow". The New Indian Express. 9 March 2013. Archived from the original on 21 నవంబర్ 2015. Retrieved 16 జూన్ 2018. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  11. "Go shop-hopping in Lulu". New Indian Express. 4 March 2013. Archived from the original on 10 మార్చి 2013. Retrieved 17 March 2013.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-21. Retrieved 2018-06-16.
  13. http://www.asiabookofrecords.com/most-diyas-lit-together/
  14. http://www.indiabookofrecords.in/most-diyas-lit-together/
  15. "PVR to invest Rs 100 cr in Kerala". Times of India. 27 April 2013. Archived from the original on 2013-05-02. Retrieved 2018-06-16.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లులు_మాల్&oldid=4094320" నుండి వెలికితీశారు