లేఖా సాహిత్యం
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
- సాహిత్య సంస్కృతికపరమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెపుతారు.
- వాస్తవమైన వ్యక్తుల మధ్యగాని లేదా ఊహాజనితమైన వ్యక్తుల మధ్యగాని లేఖలద్వారా సంభాషణ జరుగవచ్చు.
- తెలుగులో లేఖల్ని స్వీకరించిన మొదటి వ్యక్తి చార్లెస్ పిలిప్ బ్రౌన్.
- లేఖలకు సంబంధించి భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి ప్రస్తావన "అభిజ్ఞానశాకుంతలం"లో ఉంది.
- లేఖలకు సంబంధించి తెలుగులో మొట్టమొదటి ప్రస్తావన పింగళి సూరన "ప్రభావతిప్రద్యుమ్నము"లో ఉంది.
- గుడిపాటి వెంకటాచలం ఉత్తరాల పేర్లు ప్రేమలేఖలు.
- కనుపర్తి వరలక్ష్మమ్మ ఉత్తరాల పేర్లు శారద లేఖలు.
- నెహ్రూ లేఖల్నితెలుగులోకి అనువదించినది కాటూరి వేంకటేశ్వరరావు.
- బెంగాలీ రచయిత శరత్ చంధ్ర చటర్జీ లేఖల్ని తెలుగులోకి అనువదించినది పురాణరాఘవ శాస్త్రీ.
- జానపదుని జాబులు రచయిత బోయి భీమన్న.
- గీరతం రచయితలు తిరుపతి వేంకటకవులు.
- పోస్ట్ చేయని ఉత్తరాలు, ఉభయకుశలోపరిలను రచించినవారు త్రిపురనేని గోపీచంద్.
- తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధుడు డా.సంజీవ్ దేవ్.
- పోస్ట్ మ్యాన్ మీద కవితలు రాసినవారు తిలక్.
- తెలుగులో లేఖా సాహిత్యంపై పి.హెచ్.డి చేసినవారు 1.మలయశ్రీ 2.సి.హెచ్.సీతాలక్ష్మీ.