Jump to content

లేజర్ నెట్

వికీపీడియా నుండి
లేజర్ నెట్వర్క్
లేజర్ నెట్వర్క్

లేజర్ నెట్ అంటే లేజార్ ఆధారిత అంతర్జాల (ఇంటర్నెట్) సాంకేతికత. దీనిని కాలిఫోర్నియా లోని 'ఇన్నోవేషన్ ల్యాబ్' (దీనిని 'X' అని పిలుస్తారు) లో అభివృద్ధి చేసారు. ఈ ప్రాజెక్ట్ పేరు 'తారా'. గూగుల్ మాతృక సంస్థ అయిన 'ఆల్ఫాబెట్' ఇన్నోవేషన్ ల్యాబ్‌లో భాగం, దీనిని "మూన్‌షాట్ ఫ్యాక్టరీ" అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ 2016లో ఆరంభించబడింది. 'ఆల్ఫాబెట్' ఇప్పటికే స్ట్రాటోస్పియర్ ఆవరణలో ఎత్తైన బెలూన్‌లను ఉపయోగించడం ద్వారా మారుమూల గ్రామాలకు, ప్రాంతాలకు సదుపాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నించి, అత్యధిక వ్యయం కారణంగా విఫలమైంది. కానీ ఇప్పుడు, కంపెనీ కాంతి కిరణాలను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు కూడా అంతర్జాల సేవలను అందిస్తోంది.[1]

ఈ కొత్త సాంకేతికత ఎందుకు?

[మార్చు]
బెలూన్‌లను ఉపయోగం
బెలూన్‌లను ఉపయోగం

ప్రస్తుత కాలం లో అంతర్జాల సౌకర్యం ఏర్పరచుకోవడము, సమాచారం పొందడము, డేటా ప్రసారం అన్ని రంగాలలో తప్పని సరి అయింది. ఇంత వరకు అత్యంత వేగవంతమైన అంతర్జాల సదుపాయమును ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ ను భూగర్భం నాళాల (ట్యూబ్ లు), స్తంభాల ద్వారా వివిధ ప్రాంతాలకు అందిస్తున్నారు. దానికి ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ సంస్థలు, ఇతర అనుమతి పొందిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలు పని చేస్తున్నాయి, ఉదా బి.స్.ఎన్.ఎల్, ఎయిర్టెల్, జియో, హాథ్ వే మొదలైనవి. అయితే కొత్త ప్రదేశాల లో అంటే కొత్తగా ఏర్పడ్డ గృహ, పరిశ్రమల సముదాయాలు, మారుమూల ప్రాంతాలు, గ్రామీణ, పర్వత ప్రాంతాలు, నదుల మధ్య ప్రాంతాలు, నగరాలు/పట్టణాలలోని ఆకాశ హర్మ్యాలకు అంతర్జాల సౌకర్యము అందచేయడము, బలమైన సంకేతాలు (సిగ్నల్స్) చక్కగా అందడము కూడా రోజు రోజుకి సమస్య అవుతోంది. ఈ డేటా కేబుళ్లు భూగర్భం లోను, స్తంభాల మధ్య తెగిపోవడము వలన సమస్యను గుర్తించడం, సవరించడము క్లిష్టతరమవుతోంది.[2]

పరిష్కారం

[మార్చు]

ఈ సమస్యలకు పరిష్కారమే లేజర్ కిరణ పుంజాలతో డేటా అంతరాయము లేకుండా అంతర్జాల సౌకర్యం అందచేయడమే అని తారా ప్రాజెక్ట్, వివిధ దేశాలలో పని మొదలు పెట్టింది. వీటిలో కేబుళ్లు, భూగర్భ త్రవ్వకాలు, స్తంభాలు పాతడం వంటి పని లేదు. వీటికి సంబంధిత ప్రభుత్వ విభాగాలనుండి అనుమతులు తీసుకునే అవసరం లేదు. నిర్దుష్ట దూరాల మధ్య ట్రాఫిక్ సిగ్నల్ పోస్ట్ లాంటివి అమర్చి లైట్ లు ద్వారా లేజర్ కిరణ పుంజాలని పంపుతారు. వీటి ద్వారా సంకేతాలు మరింత వేగవంతంగా అందుతాయి. సుమారు 1 సెకన్ కి 20 గిగాబైట్లు (g.b.p.s) వేగం లభిస్తుందని అంచనా. అందుచేత తక్కువ వ్యయం, తక్కువ సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకు రావచ్చని భావిస్తున్నారు.[3][2]

అంతర్జాల వ్యవస్థలో అన్ని రంగాలలో జరుగుతున్న డేటా/సమాచార పంపిణీ, ప్రసారం, కార్యాలయాలు, పరిశ్రమలు, భద్రతా వ్యవస్థల యాంత్రీకరణ, ప్రతుల తయారీ, దృశ్య శ్రావణ మాధ్యమ వనరుల తయారీ మొదలగునవి మరింత వేగంగా జరుగుతుంది అని తెలుస్తోంది.[4]

ఇప్పటికే కెన్యా, ఫిజి, కాంగో, ఆస్ట్రేలియా వంటి దేశాలలో అంతర్జాల సేవలు అందిస్తున్నారు. దాదాపు 13 దేశాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. భారత్ లో కూడా ఈ సాంకేతిక ఉపయోగించి అంతర్జాల సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ విస్తరణలో భారతీ ఎయిర్ టెల్ సంస్థ భాగస్వామ్యం తీసుకొంటోంది. భారతీ ఎయిర్ టెల్ తో ఆల్ఫాబెట్ సంస్థ కూడా ముందుకు వచ్చింది[2]

భారత్ లో లేజర్ నెట్ సేవలు

[మార్చు]

భారత్ లో ఈ సేవలు అందుబాటు లోకి రావడానికి 10 బిలియన్ డాలర్లు అంటే సుమారు రు.82,000 కోట్లు అని గూగుల్ 2020లో ప్రకటించింది. దానిలో భారతీ ఎయిర్ టెల్ సంస్థ 700 మిలియన్ డాలర్లు అంటే రు.5750 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలుస్తోంది. తరువాత భారతీ ఎయిర్ టెల్ తో ఆల్ఫాబెట్ సంస్థ కూడా ముందుకు వచ్చింది. తొలిదశ లో పెద్దనగరాలలో ప్రాంతాలను గుర్తించి అమలు పరచి, క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఈ సంస్థల లక్ష్యము.[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Alphabet bets on lasers to deliver internet in remote areas". The Indian Express. 26 June 2023. Retrieved 27 August 2023.
  2. 2.0 2.1 2.2 "Airtel – Alphabets laser internet: ఇకపై లేజర్ నెట్". Eenadu. 27 August 2023. Retrieved 27 August 2023.
  3. 3.0 3.1 "Laser based internet: లేజర్ ఆధారిత ఇంటర్నెట్ ఇకపై మారుమూల ప్రాంతాలలోను హై స్పీడ్". ఈనాడు. 27 August 2023. Retrieved 27 August 2023.
  4. "Laser technology delivered with excellence". LASER Telesystems Pvt. Ltd. Retrieved 27 August 2023.[permanent dead link]