లొపినవిర్
Lopinavir, లొపినవిర్ (2S) -N-[ (2S,4S,5S) -5-[2- (2,6-dimethylphenoxy) acetamido]-4-hydroxy-1,6-diphenylhexan-2-yl]-3-methyl-2- (2-oxo-1,3-diazinan-1-yl) butanamide, LPV, brand nameb Kaletra® ( ఇందులొ LPV+RTV కలిసి వుంటాయి ) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు LTV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం15-Sep-2000[1] రోజున అమోదించబడింది. ఇది Abbott Laboratories అనే సంస్థచే కనుగొనబడింది.దీనిని తప్పని సరిగా రిటనోవిర్ కలిపి వాడాల్సి వుంటుంది. ఒక్క దానినే వెసుకోకుడదు
మోతాదు ( Dosage )
[మార్చు]ఎయిడ్స్ | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
LPV/RTV ( 200 mg లొపినవిర్ + 50 Mg రిటనోవిర్)
ఈ మోతాదును రోజుకు రెండుసార్లు గాని ఒక్కసారి గాని వెసుకొనవలసి వుంటుంది రోజుకు ఒక్కసారి మోతాదు ఎవరు వేసుకోవాలంటె. - ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటే LPV/RTV ( 200 mg లొపినవిర్ + 50 Mg రిటనోవిర్ ) కలిపి రోజుకు ఒక్కసారి వెసుకోవాలి.
రోజుకు రెండు సార్లు మోతాదు ఎవరు వేసుకోవాలంటె. - ఇంతకు ముందు HIV మందులు వాడిన వాళ్ళు ఈ మందు గనక వెసుకోవాలంటే LPV/RTV ( 200 mg లొపినవిర్ + 50 Mg రిటనోవిర్ ) కలిపి రోజుకు రెండుసార్లు వెసుకోవాలి.
ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాతగాని, తినకముందు కాని వేసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
దుష్ప్రబావాలు (Side Effects )
[మార్చు]ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
- కాలేయ సమస్యలు: ఈ మందు వెసుకొనే వారిలో కాలెయ సమస్యలు రావచ్చు. మీ డాక్టరు ఎప్పటికప్పుడు మీ లివర్ ఎంజైములను (LFT's) టెస్ట్ చెస్తు మీ లివరు యొక్క పనితనాన్ని పరీక్షించవచ్చు. అలసట అకలి లేకపొవటం. కళ్ళు, చర్మం పసుపు రంగులొనికి మారటం, తెల్లటి విరేచనాలు అయితే వెంబడే డాక్టరును సంప్రందించండి.
- Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
- Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడే వారిలొ డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశం ఉంది.
- సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, లెత తెలుపు రంగు విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం
ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?
[మార్చు]ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే. గుండె సంబంధిత సమస్యలు వుండి వుంటే, అలాగెమధుమేహం ఉండివుంటే ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది.
గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?
[మార్చు]ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలొ తెలినది ఏమిటంటే గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. అలాగే బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది. అయితే ఈ మందును గర్బిణి మహిళలు వాడవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-11.
- ↑ http://www.aidsmeds.com/archive/Kaletra_1559.shtml