లోపాముద్ర భట్టాచార్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోపాముద్ర భట్టాచార్జీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లోపాముద్ర భట్టాచార్జీ
పుట్టిన తేదీ (1960-01-31) 1960 జనవరి 31 (వయసు 64)
భారత దేశము
బౌలింగుఫాస్ట్ బౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 27)1985 7 మార్చ్ - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 4)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 6 - International XI తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI
మ్యాచ్‌లు 1 15
చేసిన పరుగులు 7 40
బ్యాటింగు సగటు 7.00 4.44
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 7 14*
వేసిన బంతులు 24 480
వికెట్లు 0 8
బౌలింగు సగటు 26.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/18
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/–
మూలం: CricketArchive, 2009 19 సెప్టెంబర్

లోపాముద్ర భట్టాచార్జీ (ప్రస్తుతం లోపాముద్ర బెనర్జీ ) భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రీడాకారిణి. ఆమె 1960 జనవరి 31న కలకత్తాలో జన్మించింది. ఆమె ఒక టెస్ట్ మ్యాచ్, 15 ఒక రోజు అంతర్జాతీయ పోటీలు ఆడింది.[1] ఆమె మీడియం పేస్ బౌలర్.[2]

లోపా 1974/5లో రాణి ఝాన్సీ ట్రోఫీలో తూర్పు మండలం జట్టు తరపున ఆడింది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. 1975/6లో పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో తూర్పు మండలం జట్టు తరపున ఆడింది. లోపా ప్రారంభ క్రికెటర్ ని అవుట్ చేసింది. 1977/8లోక్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం ప్రారంభ మ్యాచ్ కోల్పోయింది. ఇది లోపాకి మొదటి ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్. ఆమె న్యూజిలాండ్‌లో 1981/2 లో కూడా ఆడింది. 15 ODIలలో లోపా 26.75 సగటుతో 8 వికెట్లు తీసింది. ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 2.67 పరుగులు. 1985 మార్చిలో లోపా భారతదేశం తరపున తన ఏకైక టెస్ట్ మ్యాచ్, టోపీ సంఖ్య 27తో ఆడింది.[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Lopamudra Bhattacharj". CricketArchive. Retrieved 2009-09-19.
  2. "Lopamudra Bhattacharj". Cricinfo. Retrieved 2009-09-19.
  3. "Lopamudra Bhattacharjee". Talkinaboutwomenscricket. Retrieved 6 September 2023.