లోవ్లినా బోర్గోహైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోవ్లినా బోర్గోహైన్
గణాంకాలు
బరువు విభాగం69 kg
ఎత్తు1.77 m
జాతీయతభారతీయులు
జననము (1997-10-02) 1997 అక్టోబరు 2 (వయసు 27)
గోలఘాట్, అస్సాం, ఇండియా

లోవ్లినా బోర్గోహైన్ (ఆంగ్లం: Lovlina Borgohain)  భారతీయ ఔత్సాహిక మహిళా బాక్సర్. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో 75 కేజీల విభాగంలో లోవ్లినా బోర్గోహైన్ స్వర్ణ పథకం గెలుచుకుంది[1]. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో లవ్లీనాకు ఇదే తొలి స్వర్ణం. 2018 AIBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో, 2019 AIBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. [2] న్యూఢిల్లీ లో జరిగిన 1 వ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె బంగారు పతకం, గువహటిలో జరిగిన 2 వ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. 69 కిలోల వెల్టర్‌వెయిట్ విభాగంలో ఆమె 3 వ ర్యాంకు సాధించింది. అస్సాం నుండి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి మహిళగా, శివ థాపా తరువాత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రెండవ బాక్సర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. [3]] 2020 లో అర్జున అవార్డు అందుకున్న ఆమె అస్సాం నుండి ఆ అవార్డు అందుకున్న ఆరవ వ్యక్తిగా నిలిచింది. [4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బోర్గోహైన్ 2 అక్టోబర్ 1997 న జన్మించింది. ఆమె స్వస్థలం అస్సాంలోని గోలఘాట్ జిల్లా. [5] ఆమె తండ్రి 'టికెన్' తల్లి 'మామోని బోర్గోహైన్'. ఆమె తండ్రి టికెన్ సాధారణ వ్యాపారి. తన బిడ్డ కలల్ని నెరవేర్చేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆమె కవల సోదరీమణులైన లిచా - లిమా కూడా కిక్‌ బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో పోటీ పడింది, కానీ వాళ్ల కెరియర్ అక్కడితోనే ఆగిపోయింది. బోర్గోహైన్ కూడా కిక్‌బాక్సర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించింది. కాని ఆమెకు తగిన అవకాశం రాగానే బాక్సింగ్‌కు మారిపోయింది.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బార్పాథర్ బాలికల ఉన్నత పాఠశాలలో ట్రయల్స్ నిర్వహించినపుడు లోవ్లీనా అందులో పాల్గొన్నది. ఆ సమయంలో ఆమె ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత కోచ్ పాడుమ్ బోరో ఆమెను ఎంపిక చేసి 2012 నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. తరువాత ఆమెకు చీఫ్ విమెన్స్ కోచ్ శివ సింగ్ శిక్షణ ఇచ్చాడు. [6]

వృత్తిపరమైన విజయాలు

[మార్చు]

2018 కామన్వెల్త్ గేమ్స్ వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ విభాగంలో పాల్గొనడానికి ఆమె ఎంపికవడం ద్వారా బోర్గోహైన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్రేక్ వచ్చింది. కానీ క్వార్టర్ ఫైనల్లో ఆమె బ్రిటన్‌కు చెందిన శాండీ ర్యాన్ చేతిలో ఓటమి పాలయ్యింది. [7]


సిడబ్ల్యుజి 2018 లో లౌవ్లీ ఎంపిక ఫిబ్రవరి 2018 లో జరిగిన అంతర్జాతీయ ఇండియా ఓపెన్ - అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె విజయానికి కారణమైంది - అక్కడ ఆమె వెల్టర్‌వెయిట్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నది. [8] నవంబర్ 2017 లో వియత్నాంలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకాన్ని, జూన్ 2017 లో అస్తానాలో జరిగిన ప్రెసిడెంట్ కప్‌లో కాంస్య పతకాన్ని కూడా సాధించింది. [9] [10]


బోర్గోహైన్ తరువాత జూన్ 2018 లో మంగోలియాలో జరిగిన ఉలాన్‌బాతర్ కప్‌లో రజత పతకాన్ని, సెప్టెంబర్ 2018 లో పోలాండ్‌లో జరిగిన 13 వ అంతర్జాతీయ సిలేసియన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకునన్నది.[11]


న్యూ ఢిల్లీ లో జరిగిన AIBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ 2018 నవంబర్ 23న వెల్టర్‌వెయిట్ (69 కిలోలు) విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. [12]


అక్టోబర్ 3–13 నుండి రష్యాలోని ఉలాన్-ఉడేలో జరిగిన రెండవ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు (2019) ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఎంపికయింది. [13] ఆమె 69 కిలోల కేటగిరీ సెమీ ఫైనల్లో చైనాకు చెందిన యాంగ్ లియు చేతిలో 2-3 తేడాతో ఓడిపోవడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


2020 మార్చిలో, 2020 ఆసియా & ఓషియానియా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మాఫ్టునాఖోన్ మెలీవాపై 5-0 తేడాతో విజయం సాధించి 69 కిలోల విభాగంలో ఒలింపిక్ బెర్త్ సాధించారు లౌవ్లీ. దీంతో అస్సాం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. [14]


అక్టోబర్ 2020 లో  బోర్గోహైన్‌కు కరొన పాజిటివ్ వచ్చి, ఆసుపత్రిలో చేరింది. ఆ కారణంగా ఆమె జాతీయ బాక్సింగ్ జట్టు ఇటలీ పర్యటనలో పాల్గొనలేకపోయింది. దాంతో ప్రస్తుతం ఒలింపిక్స్ పై దృష్టి సారించింది. [15]

మూలాలు

[మార్చు]
  1. Sarangi, Y. B. (2023-03-26). "Lovlina Borgohain becomes world champion in 75kg category". sportstar.thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-19.
  2. "Women's Boxing World Championships: India's Mary Kom Enters Final, Lovlina Borgohain Takes Home The Bronze Medal | Boxing News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  3. "Lovlina Borgohain's Tokyo qualification big boost to boxing: AABA Official". www.telegraphindia.com. Retrieved 2021-02-17.
  4. Wadood, Abdul. "Boxer Lovlina Borgohain becomes 6th from Assam to receive Arjuna Award". EastMojo (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  5. "Lovlina Borgohain's Tokyo qualification big boost to boxing: AABA Official". www.telegraphindia.com. Retrieved 2021-02-17.
  6. Mar 16, Arnab Lall Seal / TNN / Updated:; 2018; Ist, 16:40. "High hopes for Lovlina | Guwahati News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. "The other boxer from North East India". The Bridge (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-04-08. Retrieved 2021-02-17.
  8. Kundu, Poulomi (2018-02-01). "Mary Kom, Pwilao Basumatary, Lovlina Borgohain, Sanjeet win gold at India Open boxing". Sport Savour (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  9. "mid-day.com/sports/other-sports/article/Boxing--Lovlina-assures-India-a-bronze-at-Astana-18318160". www.mid-day.com (in ఇంగ్లీష్). 2017-06-08. Retrieved 2021-02-17.
  10. "'Whenever I train, Olympics is right in my mind. It is my father's dream': Lovlina Borgohain". DNA India (in ఇంగ్లీష్). 2019-08-13. Retrieved 2021-02-17.
  11. "Ulaanbaatar Cup: Mandeep Jangra Wins Gold, Four Others Grab Silver | Boxing News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  12. "Women's Boxing World Championships: India's Mary Kom Enters Final, Lovlina Borgohain Takes Home The Bronze Medal | Boxing News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  13. "'Whenever I train, Olympics is right in my mind. It is my father's dream': Lovlina Borgohain". DNA India (in ఇంగ్లీష్). 2019-08-13. Retrieved 2021-02-17.
  14. "Lovlina Borgohain's Tokyo qualification big boost to boxing: AABA Official". www.telegraphindia.com. Retrieved 2021-02-17.
  15. Sarangi, Y. b (2020-11-10). "Lovlina fighting to remain focused". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-17.