Jump to content

వంక ప్రతాప్

వికీపీడియా నుండి
వంక ప్రతాప్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1973-11-21) 1973 నవంబరు 21 (వయసు 51)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతితో బ్యాటింగ్
బౌలింగుకుడిచేతి మీడియం పేస్
పాత్రబ్యాటింగ్ ఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92–2001/02హైదరాబాదు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 83 49
చేసిన పరుగులు 3,957 1,190
బ్యాటింగు సగటు 36.30 37.18
100లు/50లు 6/27 3/4
అత్యధిక స్కోరు 136 107
వేసిన బంతులు 3,268 1,002
వికెట్లు 44 22
బౌలింగు సగటు 37.88 36.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 5/100 3/24
క్యాచ్‌లు/స్టంపింగులు 49/– 13/–
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2016 మార్చి 28

వంక ప్రతాప్ (జననం 21 నవంబరు 1973) తెలంగాణకు చెందిన భారతీయ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. హైదరాబాదు, ఇండియా ఎ క్రికెట్ జట్ల తరఫున మ్యాచ్ లు ఆడాడు. పదవీ విరమణ తరువాత హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్‌కు సెలెక్టర్‌గా పనిచేశాడు.

జననం

[మార్చు]

ప్రతాప్ 1973, నవంబరు 21న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

క్రీడారంగం

[మార్చు]

ప్రతాప్ తన 18 సంవత్సరాల వయసులో 1991 డిసెంబరులో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆల్ రౌండర్ గా కుడిచేతితో బ్యాటింగ్, కుడిచేతి మీడియం పేస్ తో బౌలింగ్ చేశాడు. హైదరాబాదు, సౌత్ జోన్, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్, విల్స్ ఎలెవన్, ఇండియా ఎ జట్ల తరపున 83 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 49 లిస్ట్ ఎ మ్యాచ్ లు ఆడాడు. 4000 ఫస్ట్ క్లాస్, 1000 కి పైగా లిస్ట్ ఎ పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 66 వికెట్లు తీసుకున్నాడు.[1] 2001, డిసెంబరులో 28 సంవత్సరాల వయస్సులో అతని చివరి ఫస్ట్-క్లాస్ మ్యాజ్ ఆడాడు.

2003లో ప్రతాప్, సెలెక్టర్ తరపున ఒక వ్యక్తి భారతదేశం తరఫున ఆడటానికి సెలెక్టర్ కు లంచం ఇవ్వమని కోరినట్లు ఆరోపణలు చేశాడు.[2][3]

హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) రంజీ జట్టు ఎంపిక కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.[4] హెచ్‌సీఏ జూనియర్ టీం సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Vanka Pratap". CricketArchive. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "HCA seeks explanation from Vanka Pratap". Rediff. నవంబరు 24 2003. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  3. "Vanka Pratap retracts allegation". ESPNcricinfo. నవంబరు 27 2003. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  4. "Police summon Vanka Pratap". The Hindu. జనవరి 18 2009. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  5. "HCA to set up academy to train young players". The Times of India. జూలై 9 2011. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)

బయటి లింకులు

[మార్చు]