వంగపండు అప్పలస్వామి
Jump to navigation
Jump to search
ప్రజా గాయకుడు,[1] కవిగా ప్రసిద్ధి చెందిన వంగపండు అప్పలస్వామి తెలుగు కవి మరియు రచయిత.
అప్పలస్వామి జూలై 1, 1934 న విజయనగరం జిల్లా, పెదబొండపల్లిలో జన్మించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన అప్పలస్వామి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసి, విరమణ పొందిన తర్వాత టి.ఎస్.ఆర్ జూనియర్ కళాశాలను స్థాపించాడు. భగవాన్ అనే మాసపత్రికకు కూడా సంపాదకత్వం వహించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉత్తమ స్క్రిప్టు రచయిత పురస్కారాన్ని అందుకున్నాడు[2]
అప్పలస్వామి "వినర వంగపండు కనర నిజము" అన్న మకుటంతో వంగపండు శతకమును రచించాడు.
రచనలు[మార్చు]
- ఆదిశక్తి-అమ్మోరు-పురాణం (2002)[3]
- శ్రీ భగవద్గీత (1974)
- సత్యసాయి సందేశం (1976)
- ఆచార్య చాణక్య చంద్రగుప్త (1979) - నాటకం
- పాంచజన్యం (1982)
- ప్రజల కథ (1984)
- మానవుడు చిరజీవి (1988)
- సర్దార్ గౌతు లచ్చన్న (1990) - జీవితచరిత్ర
- ఊర్వశి ప్రణయకలహం (1991)
- వంగపండు శతకం (1992)
- సారా భాగోతం (1993) - అన్నీ కవితలు, తొలి అనువాదం
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ ఆర్కైవ్స్‌లో వంగపండు అప్పలస్వామి రచనలు : శ్రీభగవధ్గీత, ఆదిశక్తి - అమ్మోరు - పురాణం, ప్రజల కథ, సర్దార్ గౌతు లచ్చన్న, జీవితం-ముక్తి-మోక్షం
- డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని ఊర్వశీ ప్రణయకలహం ప్రతి.