Jump to content

వజ్ర భాస్కర్ రెడ్డి

వికీపీడియా నుండి

వజ్ర భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను శ్రీ సత్య సాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కదిరి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెడ బల్లి వెంకట సిద్ధారెడ్డి చేతిలో ఓడిపోయాడు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. 2021లో భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

వజ్ర భాస్కర్ రెడ్డి

[మార్చు]

వజ్ర భాస్కర్ రెడ్డి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా (ఆర్గనైజేషన్) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కదిరి నియోజకవర్గానికి చెందిన నాయకుడిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
  • పుట్టిన తేది: తెలియని సంవత్సరం
  • పుట్టిన ఊరు: కోరుగుట్ట పల్లి,తలుపుల మండలం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్
  • విద్యార్హత: MBA
  • కుటుంబం: కార్మిక కుటుంబ నేపథ్యం
  • రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం బీజేపీలో చేరి,2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కదిరి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెడ బల్లి వెంకట సిద్ధారెడ్డి చేతిలో ఓడిపోయాడు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2023లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పాత్ర

[మార్చు]
  • పార్టీ నిర్మాణం, కమిటీ ఏర్పాట్లు
  • QR కోడ్ ప్రచార వ్యూహం
  • నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు
  • సోషల్ మీడియా సమన్వయం

ప్రజా సేవా కార్యక్రమాలు

[మార్చు]
  • కరోనా సమయంలో ఆక్సిజన్ సేవలు
  • వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల సేవ
  • కదిరి నీటి సమస్యలపై పోరాటం
  • హజ్రత్ మియాసాహెబ్ దర్గా ఉత్సవాల్లో సేవ

సమాజంలో ప్రాముఖ్యత

[మార్చు]

వజ్ర భాస్కర్ రెడ్డి యువతలో ప్రభావశీలమైన నాయకుడిగా పేరుగాంచారు. ప్రజలతో మమేకమయ్యే నాయకత్వం ఆయన విశేషత.

సోషల్ మీడియా లింకులు

[మార్చు]

శ్రేణులు

[మార్చు]