వడాపావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడాపావ్
A plate of vada pav with seasoning of red chilli powder and a green chilli.
పళ్ళెంలో వడాపావ్, పచ్చడి, మిరపకాయ
రకంచిరుతిండి
మూల స్థానంభారతదేశం
ప్రాంతం లేదా రాష్ట్రంముంబై
సృష్టి కర్తఅశోక్ వైద్య, సుధాకర్ మాత్రే
కనుగొన్న సంవత్సరేం1966
మూల పదార్థాలుఉడికించి, పిండితో వేయించిన బంగాళాదుంప వడ, పావ్‌
Cookbook:వడాపావ్  వడాపావ్

వడాపావ్, మహారాష్ట్రకు చెందిన శాకాహార వంటకం.[1] ఉడకబెట్టి, ముద్ద చేసిన బంగాళాదుంపను పిండిలో కూరి వేయించి వడా తయారు చేస్తారు. సగానికి చీల్చిన పావ్ లోపల ఆ వేయించిన వడను పెట్టి వడాపావ్ తయారుచేస్తారు. దీనిలో నంజుకోడానికి ఒకటి రెండు రకాల పచ్చళ్ళు, పచ్చి మిరపకాయ ఇస్తారు.[2] ఇది ముంబైలో సరసమైన స్ట్రీట్ ఫుడ్‌గా ఉద్భవించినప్పటికీ, ఇప్పుడు భారతదేశమంతటా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో లభిస్తోంది. మూలాలు, భౌతిక రూపం బర్గర్‌ని పోలి ఉండడంతో, దీనిని బాంబే బర్గర్ అని కూడా అంటారు.[3][4]

చరిత్ర

[మార్చు]

సెంట్రల్ ముంబైలోని మిల్లుల ప్రాంతంలో మొదటగా తయారుచేసారనేది వడాపావ్ మూలాలకు సంబంధించి ప్రచురంగా ఉన్న సిద్ధాంతం. దాదర్‌కు చెందిన అశోక్ వైద్య 1966లో దాదర్ రైల్వే స్టేషన్ వెలుపల మొదటి వడాపావ్ స్టాల్‌ను ప్రారంభించాడని అంటారు.[5][6] : 34 అదే సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించిన సుధాకర్ మ్హాత్రేకి కూడా కొందరు ఈ శ్రేయస్సును ఆపాదిస్తారు.[7] వడాపావ్‌ను విక్రయించే తొలి కియోస్క్‌లలో ఒకటి కళ్యాణ్‌లో ఉన్న ఖిడ్కి వడాపావ్ అని అంటారు. దీనిని 1960ల చివరలో వాజే కుటుంబం ప్రారంభించింది. వారు రోడ్డుకు ఎదురుగా ఉన్న తమ ఇంటి కిటికీ (ఖిడ్కీ) నుండి వడాపావ్‌లను అమ్మేవారు.[7]

పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఈ చిరుతిండిని గిరాంగావ్ అనే ప్రాంతంలో ఉన్న పత్తి మిల్లు కార్మికులకు అమ్మేవారు. పావ్ లోపల ఉంచిన ఈ బంగాళదుంప ముద్దను (బటాటా వడ) త్వరగా తయారు చేయవచ్చు, చౌకగానూ ఉంటుంది (1971లో ~10-15 పైసలు[7][8]). బటాటా భాజీ, చపాతీ కాంబినేషను లాంటివి కిక్కిరిసిన లోకల్ రైళ్లలో తినడానికి వీలుకాదు, కానీ వడాపావ్‌ అందుకు వీలుగా ఉంటుంది.[6][7]

సాంస్కృతిక ప్రాముఖ్యత

[మార్చు]

1970లలో సెంట్రల్ ముంబైలో టెక్స్‌టైల్ మిల్లుల మూసివేయడంతో గందరగోళం ఏర్పడింది. ఈ పరివర్తన సమయంలో ఏర్పడిన శివసేన, మిల్లు కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తూ స్థిరపడింది. పార్టీ అధినేత, బాలాసాహెబ్ థాకరే 1960లలో మరాఠీ ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చమని ప్రోత్సహించాడు. దక్షిణ భారతీయులు ఉడిపి రెస్టారెంట్‌లను ఏర్పాటు చేసిన విధంగా వారూ ఫుడ్ స్టాల్స్‌ను ప్రారంభించాలని అతను ప్రోత్సహించాడు.[5][6][9] శివసేన భౌతికంగాను, సైద్ధాంతికంగానూ వీధులను ఆక్రమించుకోవడంతో పాటు, వడాపావ్ సమ్మేళన్ వంటి ఇరుగుపొరుగు కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించింది.[10]: 28 [11] ఈ పద్ధతి ఇటీవలి సంవత్సరాలలో కూడా కొనసాగుతోంది. ఉదా 2009లో శివ్ వడాపావ్ ను ప్రవేశపెట్టడం.[12]

వివిధ రకాలు, వాణిజ్యీకరణ

[మార్చు]

ముంబైలో వడాపావ్ విక్రయించే దుకాణాలు 20,000 దాకా ఉన్నాయి.[13] ముంబైలో ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల వడాపావ్‌లు లభిస్తాయి.[8] ములుండ్‌లోని కుంజ్‌విహార్ జంబో కింగ్, గోలీ వడాపావ్ వంటి పెద్ద ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చెయిన్లు కూడా వడాపావ్‌ను అందిస్తాయి.[8][14] వడాపావ్‌ను నాసిక్‌లో పావ్ వడ అంటారు.

ఏటా ఆగస్టు 23 ను ప్రపంచ వడాపావ్‌ దినోత్సవంగా జరుపుకుంటారు. [15]

తయారీ

[మార్చు]

ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, సుగంధ ద్రవ్యాలు (సాధారణంగా ఇంగువ, పసుపు) కలపాలి. దీన్ని ఉండగా చేసి, శనగ పిండిలో చుట్టి వేయించాలి. ఈ వడను, సగం చీల్చిన పావ్‌లో పెట్టి తింటారు. చట్నీలు, వేయించిన పచ్చిమిర్చిని ఇందులోకి నంజుకుంటారు. [16]

వడాపావ్‌ తయారీలో వాడే పదార్థాలు
వడాపావ్‌ తయారీలో వాడే పదార్థాలు 
ఒక వడ,రెండు వడాపావ్‌లు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి పచ్చడి
ఒక వడ,రెండు వడాపావ్‌లు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి పచ్చడి 
పచ్చిమిరపకారంతో,పచ్చడితో వడాపావ్.
పచ్చిమిరపకారంతో,పచ్చడితో వడాపావ్. 
మౌసూరులో వడాపావు, టీ
మౌసూరులో వడాపావు, టీ 

ప్రస్తావనలు

[మార్చు]
 1. Caless, Kit (19 February 2017). "クリケットの街から眺めるインドサッカー界の未来" [The future of Indian football seen from the city of cricket]. vice.com (in జపనీస్). Vice Japan. Archived from the original on 28 January 2022. Retrieved 28 February 2023.
 2. "Famous Vada Pav places in Mumbai". The Free Press Journal. 30 July 2015. Archived from the original on 17 August 2015. Retrieved 10 August 2015.
 3. Bhattacharya, Suryatapa (12 January 2010). "The world's best fast food". The National. Retrieved 27 September 2017.
 4. Sankari, Rathina (November 4, 2016). "Meet Mumbai's Iconic Veggie Burger". NPR (in ఇంగ్లీష్). Retrieved 5 November 2020.
 5. 5.0 5.1 Mahadevan, Asha (30 October 2015). "Nearly 50 years since its invention, the story of the vada pav hits the big screen at Jio MAMI". Firstpost. Retrieved 5 November 2020.
 6. 6.0 6.1 6.2 Shankar, Kartikeya (Jul 15, 2020). "Vada Pav: History of the Popular Mumbai Snack". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 November 2020.
 7. 7.0 7.1 7.2 7.3 Ghangale, Swapnil (23 August 2020). "World Vadapav Day: जन्मापासून लंडनपर्यंत मजल मारण्यापर्यंतची वडापावची कहाणी". Loksatta (in మరాఠీ). Retrieved 5 November 2020.
 8. 8.0 8.1 8.2 Thirani, Neha (5 October 2011). "Searching For the World's Best Vada Pav". India Ink. The New York Times. Retrieved 5 November 2020.
 9. Doctor, Vikram (May 17, 2008). "An attitude to serve: Why Marathi food lost out". The Economic Times. Retrieved 5 November 2020.
 10. Solomon, Harris Scott (May 2011). "Chapter 1. Fast Food Nationalism: Cleaning Mumbai's streets with the vada pav". Life-Sized: Food and the Pathologies of Plenty in Mumbai (PhD) (in ఇంగ్లీష్). Providence, Rhode Island: Brown University. doi:10.7301/Z0Q23XH9. OCLC 934517131. Retrieved 5 November 2020.
 11. Solomon, Harris Scott (May 4, 2015). ""THE TASTE NO CHEF CAN GIVE": Processing Street Food in Mumbai". Cultural Anthropology (in ఇంగ్లీష్). 30 (1): 65–90. doi:10.14506/ca30.1.05. ISSN 1548-1360. Retrieved 5 November 2020.
 12. Pawar, Yogesh (June 19, 2009). "Shiv Sena's vada pav strategy". NDTV.com. Retrieved 5 November 2020.
 13. "वडापाव... बस्स..!". Lokmat (in మరాఠీ). 6 February 2022. Retrieved 9 February 2022.
 14. Narasimhan, Anand; Dogra, Aparna Mohan (September 4, 2012). "Goli Vada Pav story". The Financial Times (in ఇంగ్లీష్). IMD business school. Retrieved 5 November 2020.
 15. "World Vada Pav Day 2020: Mumbai's 'fastest fast food' is eaten by many, remembered by a few". Free Press Journal (in ఇంగ్లీష్). 23 August 2020. Retrieved 5 November 2020.
 16. Graves, Helen (3 October 2013). "Vada pav sandwich recipe". The Guardian. Guardian News and Media Limited. Retrieved 27 January 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=వడాపావ్&oldid=3937215" నుండి వెలికితీశారు