వడ్లమూడి శ్రీకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వడ్లమూడి శ్రీకృష్ణ పశు శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు

[మార్చు]

వడ్లమూడి శ్రీకృష్ణ తెనాలి తాలూకా మోపర్రు గ్రామంలో 1927, ఆగష్టు 15 న జన్మించారు[1]. ఆయన తండ్రి వెంకటరత్నం.[2] ఆయన దేశ, విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించి, బి.ఎ., ఎస్.సి, ఎం.ఎస్., పి.హెచ్.డి, డి.వి.ఎం. మొదలగుపట్టాలను అందుకున్నారు.[3] ఆయన భార్య పేరు జమున. ఆయనకు ముగ్గురూ కుమారులు ఒక కుమార్తె.[4] ఆయన 1960లలో విదేశాలకు వలస వెళ్ళారు. అమెరికాలో కొంతకాలం పనిచేసారు.[5] అమెరికాలో ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు కూడా ఈయన ఇంటిలో కొంతకాలం ఉన్నారు.[6] అమెరికాలో 1979-81 మధ్య కాలంలో ఆయన ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో ప్రాంతీయ ఉపాధ్యక్షునిగా పనిచేసారు.[7]

పరిశోధనలు

[మార్చు]

ఆయన దేశ విదేశాలలో వివిధ పరిశోధనా సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. రాణీఖేత్ వ్యాక్సిన్ రీసెర్చి లేబొరేటరీస్, సీరం ఇనిస్టిట్యూట్ (హైదరాబాద్) ఏనిమల్ హస్బండరీ డిపార్టుమెంటు (మద్రాసు, హైదరాబాదు), ఎస్.సి.ఐ క్యాన్సర్ రీసెర్చి లాబొరేటరీస్[8], మైక్రో బయోలాజికల్ అసోసియేషన్ (మేరీలాండ్ అమెరికా) డిపార్ట్ మెంటు ఆఫ్ ఇంఫెక్షియస్ డిసీసెస్ అండ్ లాబొరేటరీస్ (నార్త్) చికాగో) మొదలగు దాదాపు పదిహేను పరిశోధక సంస్థలలో పనిచేస్తూ పరిశోధనలు నిర్వహించారు[9]

జాతీయ, అంతర్జాతీయ సైన్సు జర్నల్స్ లో 100కి పైగా పరిశోధనా పత్రాలనూ వెలువరించారు[10][11][12] . జాతీయ, అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులలో 60 పరిశోధనా వ్యాసాలను సమర్పించారు. అనేకమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉన్నారు. ప్రముఖ పశువైద్య విద్యావేత్తగా, పరిశోధకులుగా, అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. విదేశీ శాస్త్రవేత్తల ఎందరితోనో శిక్షణ పొందుతూ పరిశోధనలు జరిపారు. అనేక విదేశీ శాస్త్ర విజ్ఞాన సంస్థలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు.

అస్తమయం

[మార్చు]

ఆయన 2003 డిసెంబరు 4 న మరణించారు[2].

మూలాలు

[మార్చు]
  1. వికీసోర్సు లో అబద్దాల వేట పి.డి.ఎఫ్ నుండి[permanent dead link]
  2. 2.0 2.1 "SRIKRISHNA VADLAMUDI (1927-2003) Social Security Death Index | Free Ancestry Search". Archived from the original on 2016-03-05. Retrieved 2015-05-31.
  3. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 53.
  4. demise of Vadlamudi Srikrishna
  5. గూగుల్ గ్రూఫ్స్ లో innaiah narisetti వివరణ
  6. "Humanists I Met". Archived from the original on 2015-08-08. Retrieved 2015-05-31.
  7. "TANA LEADERSHIP 1979-1981". Archived from the original on 2015-05-15. Retrieved 2015-05-31.
  8. Studies on neutralization of L-asparaginase activity in vitro and in vivo
  9. Cancer Research The Official Organ of the American Association for Cancer Research Inc.[permanent dead link].
  10. ILSE — IPN Library Search Engine Leibniz Institute for Science and Mathematics Education, Kiel[permanent dead link]
  11. Synthesis and biologic evaluation of 7-hydroxymethotrexate, 7-methylaminopterin, and 7-methylmethotrexate
  12. Performance Characteristics for an Immunoassay[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]