వరికుప్పల నాగమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరికుప్పల నాగమణి
Varikuppala Nagamani.PNG
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తివ్యవసాయవేత్త

వరికుప్పల నాగమణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆదర్శ వ్యవసాయవేత్త.[1] ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2][3]

జీవిత విశేషాలు[మార్చు]

నాగమణి స్వగ్రామం సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామం. కుటుంబ అవసరాలకోసం భర్త శ్రీనివాస్ తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నది.

వ్యవసాయ రంగం[మార్చు]

భర్త సహకారంతో దోసపహాడ్ గ్రామానికి పక్కనే ఉన్న అనాజిపురం లోని నాలుగు ఎకరాల భూమిలో ఆదర్శ పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించంది. వినూత్న ఆధునిక పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ... ఆవు పేడ, ఆవు మూత్రం, వేప నూనె, వేప కషాయంతో సేంద్రియ పద్ధతిలో సహజ ఎరువులను తయారు చేసి, ఆ ఎరువులను డ్రిప్ సిస్టమ్ ద్వారా నేరుగా మొక్కల వేర్లకు అందిస్తూ అధిక దిగుబడులను సాధించింది. మల్చింగ్‌ తోపాటు పంటను నాశనం చేసే కీటకాల నిరోధానికి లింగాకర్షక బుట్టలు, విద్యుత్ బల్బుల వంటివి సైతం ఉపయోగించి, ఎకరాకు 50క్వింటాళ్ల మిర్చి దిగుబడి సాధించంది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "నలుగురు ఉత్తములు..!". Retrieved 5 April 2017.
  2. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 5 April 2017.
  3. నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 5 April 2017.
  4. తెలంగాణ టుడే. "Best woman farmer award for Suryapet resident". Archived from the original on 11 March 2017. Retrieved 5 April 2017.