వర్గం చర్చ:తెలుగు శీర్షికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు పత్రికా చరిత్ర తిరగేస్తే, చక్కటి శీర్షికలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిమీద వికీ లో వ్యాసాలు వ్రాస్తే బాగుంటుంది. రాబోయే తరాలకు తెలియచెప్పినట్లవుతుంది. అటువంటి శీర్షికలను ముందు ఒక జాబితాగా తయారు చేసి తరువాత వ్యాస రచన పూనుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో, ఈ చర్చా పుటను మొదలు పెట్టాను.

ముగ్గురు మూర్ఖులు[మార్చు]

  • ఆంధ్ర వార పత్రికలో చాలా కాలం మహేష్ రచించిన ముగ్గురు మూర్ఖులు అనే శీర్షిక వచ్చేది. సామాజిక విషయాలను ముగ్గురు మిత్రుల (చూడామణి, చిదంబరం, చంచల్రావు)మధ్య సంభాషణా పూర్వకంగా చెప్పించటం జరిగేది. దాదాపు 1970ల మధ్యవరకు ఈ శీర్షిక నిర్వహించబడింది. ఈ శేర్షిక నిర్వాహకుడు "మహేష్" (కలం పేరు కావచ్చును). మహేష్‌ వారఫలాలు శీర్షిక కూడ నిర్వహించేవారు. అనగనగా ఒక తండ్రి కథను రచించి అదే పత్రికలో ధారావాహికంగ ప్రచురించారు, ఆ తరువాత చలన చిత్రంగా నాగభూషణం ముఖ్య నటుడిగా వచ్చింది. అప్పటి పాత పత్రిక ప్రతులు నా దగ్గర లేవు. పాత పత్రికలు 1966-67 నుండి 1974-75 వరకు సొంత కలెక్షన్ నుండి గాని గ్రంధాలయాల నుండి (ముఖ్యంగా హైదరాబాదులోని సెంట్రల్ లైబ్రరీలు)చూసి తిరగేయగల సభ్యులు వ్యాసాన్ని వ్రాయగలరు. ఉట్టి జ్ఞాపకాలతో వ్రాసే ప్రయత్నం సాహసమవుతుందేమోనని నా భయం.--SIVA 12:43, 18 డిసెంబర్ 2008 (UTC)

రంగులరాట్నం[మార్చు]

ఈ శీర్షిక కింద, ఆకుండి నారాయణ మూర్తి గారు, ఆంధ్ర వార పత్రికలో 1960ల నుండి 1970ల వరకు అనేకమైన క్రిమి కీటకాలు, మొక్కల గురించి వ్రాశేవారు. చాలా విజ్ఞాన దాయకమైన శీర్షికగా పేరు వచ్చింది.

అమరవాణీ[మార్చు]

చందమామ పత్రికలో ప్రతినేలా చక్కటి సంస్కృత శ్లోకాలు ప్రచురించి, వాటి అర్ధాలు వివరించేవారు. ఇది కూడ ఒక చక్కటి శీర్షిక.--SIVA 12:50, 18 డిసెంబర్ 2008 (UTC)

ఊమెన్ కార్టూన్‌లు[మార్చు]

ఆంధ్ర వార పత్రికలో, మొదటి పేజీలలో, ఒక పేజీ మొత్తం రాజకీయ కార్టూన్లు ప్రచురించేవారు. వాటిని "ఊమెన్" అనే పేరుతో ప్రచురించేవారు. సామాన్యంగా సంభాషణలు ఉండేవి కావు ఈ కార్టూన్లకు.. తెలుగులో రాజకీయ వ్యంగ చిత్రాలకు అ ఆ లు నేర్పినది ఈ శీర్షిక. 1960లు 70ల మధ్య చాలా విజయవంతంగా నడిచింది. వేసిన ఆ కార్టూనిస్ట్ అసలు పేరు తెలియదు. "ఊమెన్" పేరుతో కార్టూన్లు వేసిన ఆయన ఎక్కడో చర్చిలో ఫాదర్ గా ఉండేవారని ఆయన మరణాననంతరం అనుకుంటాను ఆంధ్ర వార పత్రికలోనె చదివినట్టు జ్ఞాపకం. ఈ కార్టూన్లు అప్పట్లో ఎంతగానో పేరొందిన శంకర్స్ వీక్లీ [పూర్తి కార్టూన్ల ఆంగ్ల వార పత్రిక) లో వేయబడిన కార్టూన్లకు దీటుగా ఉండేవి.--SIVA 13:29, 18 డిసెంబర్ 2008 (UTC)

కొన్ని వివరాలు జయదేవ్ గారినుండి సంపాయించి ఊమెన్ గారిమీద వ్యాసం వ్రాయటం జరిగింది. మరిన్ని వివరాలు సంపాయించాలి, తెలిసిన సభ్యులు వ్యాసంలో పొందుపరచమని విన్నపం

క్రొత్త జాబితా వ్యాసం మొదలు పెట్టండి[మార్చు]

శివా! మీరు ఈ వర్గం చర్చలో వ్రాసిన విషయాలు వ్యాసం రూపంలో ఉండవలసినవి. తెలుగు పత్రికా శీర్షికల జాబితా అనే క్రొత్త వ్యాసాన్ని మొదలు పెట్టండి. అందులో పరిచయంగా ఒకటి రెండు పేరాలు వ్రాసి, తరువాత జాబితాగా మీకు గుర్తొచ్చినవి వ్రాయండి. ఒక్కో శీర్షికకూ ఒక పేరా వరకు పరిచయాన్ని (వేరే వ్యాసం లేకుండా) అక్కడే వ్రాయవచ్చును. తరువాత మిగిలినవారు వాటిని విస్తరించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:41, 18 డిసెంబర్ 2008 (UTC)

నా ఉద్దేశ్యంలో, కొంత పేరు తెచ్చుకుని (పేరంటే ఉట్టి పాపులారిటీ కాదు) ఆ శీర్షిక ద్వారా పాఠకులకు అంతో ఇంతో ఉపయోగం కలిగించిన శీర్షికల జాబితా ఒకటి తయారు చేసుకొని ఆ తరువాత ఒక్కొక్క శీర్షిక గురించి ప్రత్యేక వ్యాసాలు వ్రాస్తే బాగుంటుంది. ఆ తరువాత శీర్షికల గురించిన జ్ఞాపకాలయితే ఇక్కడ వ్రాశానే గాని, వాటి మీద సమగ్రమైన సమాచారం ప్రస్తుతం నా దగ్గర లేదు. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారిని ఈ మైలు ద్వారా సంప్రదించాను, వారిని వికీపీడియాలో సభ్యులుగా చేరి ఊమెన్ కార్టూన్ల గురించి వ్యాసం వ్రాయమని కోరాను. వారు స్పందించి, 25 సంవత్సరాల క్రితం తాను స్వాతి వారపత్రికలో వ్రాసిన వ్యాసం వివరాలు పంపుతానని వాగ్దానం చేసారు. త్వరలో ఆ వ్యాసం వ్రాసే అవకాశం ఉన్నది.--SIVA 09:27, 20 డిసెంబర్ 2008 (UTC)