వర్ణపటం
వర్ణపటం (Spectrum) అనేది అనేక రంగుల సముదాయం. సాధారణంగా తెల్లని కాంతిలో ఊదా (Violet), ఇండిగో (Indigo), నీలం (Blue), ఆకుపచ్చ (Green), పసుపుపచ్చ (Yellow), నారింజ (Orange), ఎరుపు (Red) అనే 7 రంగులుంటాయి. ఈ ఏడు రంగులు ఇంద్ర ధనుస్సు లోని వర్ణాలను పోలి ఉంటాయి.[1] [2] సూర్య కాంతిని లేదా తెల్లని కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు కాంతి వక్రీభవనం చెంది అందలి అంశ ఏడు రంగులుగా విడిపోయి ఒక వర్ణపటం కనిపిస్తుంది.[3] దీనినే వర్ణపటం అంటారు. వర్ణపటమును ఆంగ్లంలో స్పెక్ట్రం అంటారు. స్పెక్ట్రం యొక్క సహజ ఉదాహరణ ఇంద్రధనస్సు.[4] తెల్లని కాంతిని పట్టకం గుండా పంపినప్పుడు కాంతి వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని కాంతి విశ్లేషణ అంటారు. ఈ రంగులను గుర్తు పెట్టుకోవడానికి VIBGYOR ఆనే సంకేత పదమును సూచిస్తారు. ఈ రంగులలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలది. ఊదా రంగు తక్కువ తరంగ దైర్ఘ్యం గలది. ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండటం వల్ల చాలా దూరం నుండి స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు గల బోర్డులు ఎరుపు రంగుతో వ్రాస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "spectrum". The Free Dictionary.
- ↑ Greenstein, George (2013-02-18). Understanding the Universe: An Inquiry Approach to Astronomy and the Nature of Scientific Research (in ఇంగ్లీష్). Cambridge University Press. ISBN 9781139618878.
- ↑ "What is a spectrum". Answers.com (in ఇంగ్లీష్). Retrieved 2017-07-12.
- ↑ Bacher, Elman (2017-07-04). Studies in Astrology (in ఇంగ్లీష్). Lulu Press, Inc. ISBN 9781300109945.[permanent dead link]