Jump to content

వర్దినేని వెంకటేశ్వర్ రావు

వికీపీడియా నుండి
వర్దినేని వెంకటేశ్వర్ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1985
ముందు చెన్నమనేని సత్యనారాయణ
తరువాత చెన్నమనేని విద్యాసాగర్ రావు
నియోజకవర్గం మెట్‌పల్లి నియోజకవర్గం

భూగర్భజలాలు, లఘు పరిశ్రమలు, కార్మిక, రెవెన్యూ, న్యాయశాఖ మంత్రి
తరువాత

వ్యక్తిగత వివరాలు

జననం 1940
వేములవాడ, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

వర్దినేని వెంకటేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్‌పల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వర్దినేని వెంకటేశ్వర్ రావు రాజకీయాల పట్ల ఆసక్తితో 1972లో మెట్‌పల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నమనేని సత్యనారాయణ చేతిలో 11016 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1978లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఇందిరా) అభ్యర్థిగా పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వర్ రావుపై 27308 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

వర్దినేని వెంకటేశ్వర్ రావు 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి మిర్యాల కిషన్ రావుపై 7381 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి  ఎన్టీఆర్ మంత్రవర్గంలో భూగర్భజలాలు, లఘు పరిశ్రమలు, కార్మిక, రెవెన్యూ, న్యాయశాఖ  మంత్రిగా పనిచేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  2. Sakshi (2023). "వేములవాడ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Eenadu. "ఇద్దరికి అమాత్యయోగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.