శ్మశానం
Appearance
(వల్లకాడు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్మశానాన్ని శ్మశాన వాటిక, కాడు, వల్లకాడు, కాష్టం అని కూడా అంటారు. చనిపోయిన మనిషికి ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి. ప్రతి ఊరికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ శ్మశానాలు ఉంటాయి. చనిపోయిన వారికి గుర్తుగా కొందరు సమాధిని నిర్మిస్తారు. చనిపోయిన వారిని కాల్చేందుకు కట్టెలతో ఏర్పాటు చేసిన దానిని చితి అంటారు. చనిపోయిన వారిని పూడ్చేందుకు త్రోవ్విన గుంతను గోయి అంటారు. చనిపోయిన మనిషి యొక్క శరీరాన్ని శవం అంటారు. శవాన్ని శ్మశానాన్ని తీసుకు వెళ్ళేందుకు కర్రలతో ఏర్పాటు చేసిన చట్టాన్ని పాడె అంటారు.
శ్మశానంపై వ్యాఖ్యలు
[మార్చు]- తగలేయటం, పూడ్చటం వల్లకాటిలో పద్ధతులు. మనుషులు తిరిగే ఊళ్ళోనే కాదు చివరకు పీనుగుల్ని పడేసే వల్లకాటిలో కూడా ఒక పద్ధతి లేదు.
- వల్లకాడంటే కాటికాపరి తిరిగే చోటు కాదు, నయవంచక స్వార్థపరులు సంచరించే నవ నాగరిక సమాజమే నిజమైన వల్లకాడు.
శ్మశానంపై కవితలు
[మార్చు]కంపదాకా తొండ పరుగు
గాలిబోతే కట్టెవొరుగు
అన్ని పాటులు భంగపాటుకే
ఎల్ల బాటలు వల్లకాటికే
----అజ్ఞాత కవి
శ్మశానంపై సామెతలు
[మార్చు]- ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.
- శ్మశాన వైరాగ్యము
ఇవి కూడా చూడండి
[మార్చు]- శ్మశాన అథిపతి
- సమాధి
- వాదీ అల్ సలాం - ప్రపంచంలో అతిపెద్ద శ్మశానం
- శ్మశానవాటిక-జాషువా-విశ్లేషణ