Jump to content

వసంతరావు వేంకటరావు

వికీపీడియా నుండి
వసంతరావు వెంకటరావు
వసంతరావు వెంకటరావు
జననంవసంతరావు వెంకటరావు
1909, ఫిబ్రవరి 21
మరణం1992 ఏప్రిల్ 25(1992-04-25) (వయసు 83)
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తివిజయనగరం మహారాజ కాలేజీ లో భౌతిక శాస్త్ర ఆచార్యులు
ప్రిన్సిపాల్
ప్రసిద్ధిసైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి.
మతంహిందూ మతము
తండ్రితాతారావు

వసంతరావు వెంకటరావు ఒక సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన 1909, ఫిబ్రవరి 21 వ తేదీన జన్మించాడు. తండ్రి పేరు తాతారావు. విజయనగరం మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య (ఎం.యస్సీ) చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం వద్ద భౌతిక శాస్త్ర ప్రయోగ శాలలో కొంతకాలం శిక్షణ పొందాడు. మహారాజా కళాశాల, విజయనగరంలో 1935లో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా (1956-69) పదవీవిరమణ చేశాడు.

రచయితగా

[మార్చు]

భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు, రచనలు ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేశాడు. తెలుగులో భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా సమితి తరపున రూపొందించాడు. దాదాపు సహస్ర విజ్ఞాన వ్యాసాలు రాసాడు. వీటిలో అనేకం వ్యాస సంపుటాలుగా వెలువడినాయి. ఈయన రాసిన సైన్స్ గ్రంథాలు 32 లో కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ఎంపిక అయ్యాయి. ఆధునిక విజ్ఞానం[1] పేరుతో ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధి చెందింది. ఈయన సంకలనం చేసిన సూక్తిముక్తావళి అనే గ్రంథం కూడా ప్రసిద్ధి చెందింది.

మానవ మానవ, పడకటింట్లో విజ్ఞానచర్చ, పారిజాతం మొదలగు అనేక పుస్తక రచనలు జన సామాన్యానికి కూడా విజ్ఞానాన్ని చేకూర్చాయి. తెలుగు అకాడమీ లో, 18 పుస్తకాలు డిగ్రీ విద్యార్థులకు వెలువరించాడు. విద్యార్థి లోకానికి సంబంధించిన భౌతిక శాస్త్ర సంబందమైన అనేక ప్రయోగాలు నిర్వహించాడు. సామాన్య శాస్త్రం మీద, మాతృభాష మీద ఈయనకు గల అపార గౌరవాభిమానాలు, జిజ్ఞాసలు తెలుగువారికి వరప్రదాతలయ్యాయి. సైన్స్ ను అతి సరళ మైన తెలుగు భాషలో విస్తృత ప్రచారం చేసిన ఈయన 1992, ఏప్రిల్ 25 న మృతి చెందాడు.

సూచికలు

[మార్చు]
  1. వేంకటరావు, వసంతరావు (1949). ఆధునిక విజ్ఞానం.

యితర లింకులు

[మార్చు]