Jump to content

వసంతోత్సవాలు

వికీపీడియా నుండి
సంతోషాల వసంతోత్సవాలు

వసంతోత్సవం ఋతు సంబంధమైన పండుగలలో ఒకటి. వసంత కాలంలో మన్మథుని గురించి వుత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవం గురించి వాత్సాయనుని కామ సూత్రాల్లోనూ, శ్రీ హర్షుని రత్నావళి నాటకంలోనూ, కాళీ దాసుని మాళవికాగ్ని మిత్ర నాటకంలోనూ ప్రస్తావించబడింది. ముఖ్యంగా రత్నావళి నాటకం ఈ వసంతోత్సవంతోనే ప్రారంభ మౌతుంది.

ఆంధ్ర దేశంలో ఈ మదన మహోత్సవానికి, వసంత మహోత్సవమనీ, కాముని పండగనీ పాల్గుణ శుద్ధ పూర్ణిమకు కాముని పూర్ణిమ అనీ పేరు. 14 వ శతాబ్దానికి పూర్వం ఈ వసంత్గోత్సవాలు ఏ విధంగా జరిగేవో తగిన ఆధారాలు లేవు. కానీ కొండ వీటి రెడ్డి రాజుల కాలంలోనూ, ఆ తరువాతి కాలంలోనూ ఈ వసంతోత్సవాలు ఎలా జరుప బడుతూ వుండేవో తెలుసు కోవడానికి, శ్రీ నాథుని భీమేశ్వర పురాణం లోనూ, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక లోనూ వసంతోత్సవాల గురించి విపులంగా వర్ణించబడింది.

వసంత శోభలు

ఆ కాలంలో వసంతోత్సవాలకు రాజ నగరునూ, నగరుకు వెలౌపలనున్న వుద్యాన వనాన్నీ మనోహరంగా అలంక రించి, వుద్యాన వనంలో ఒక పూజా మడపాన్ని వివిధ దేవతలకు పూజా వేధికలను నిర్మించి, తోరణాలతోనూ: పుష్పాలతోనూ, సుగంధ ద్రవ్యాలతోనూ వైభవంగా పూజా మండపాన్ని అలంకరించి; రతీ మన్మథులను, లక్ష్మీ, విష్ణువులను, శివ పార్వతులను, దేవేంద్రుడు, శచీ దేవి, వసంతుడు, విఘ్నేశ్వరుడు మొదలైన విగ్రహాలను వేదికలమీద వుంచి, మహారాజు అస్వరూఢుడై మంత్రుల, సామంతులు, దండ నాయకులు, పురోహితులు, విధూషకులు, పుర జనులు వెంట రాగా బ్రంహ్మాండ మైన మంగళ వాయిద్యాలతో ఉద్యాన వనానికి బయలు దేరే వాడు.

కప్పాలూ, కానుకలు

ఈ విధంగా ప్రారంభమైన వసంతోత్సవంతో వారి వారి విద్యల్ని ప్రదర్శించి పారి తోషికాలు పొందటానికి నటీనటులు, శిల్పులు, చిత్రకారులు, సంగీత విద్వాంసులు మొదలైన అనేక మంది కళాకారులు హాజరయ్యేవారు. రాజ్యం నలుమూలల నుంచీ ఈ వసంతోస్తవాలను తిల కించ డానికి ఆబాల గోపాలం కదలి వచ్చేది. ఆ నాటి వసంతోత్సవాలు రాజుకు, ప్రజలకు పండుగగా మారింది.

ఉత్సవం ఈ విధంగా సాగుతూ వుండగా రాజుకు, సామంత రాజులూ, మండలేశ్వరులూ మొదలైన వారు కానుకలనూ, కప్పాలనూ ఈ సందార్భంలో చెల్లించే వారు. విదూషకులు వినోద గోష్ఠి జరిపేవారు. రాజు వెంట వచ్చిన సుందరీ మణులు వనంలో ఉయ్యాల లూగుతూ, ఏల పాటలతోనూ, జాజర పాటల తోనూ కాలక్షేపం చేసేవారు. రాజు రాజులతో కలిసి; మన్మథునీ, తదితర వేవాతలనూ పూజించి త్రాహ్మణ దంపతులకు కర్పూర తాంబూలాలను సమర్పించేవారు.

రంగుల వసంతం

తరువాత రాజు చందనాది సుగంద ద్రవ్వాలనూ, కర్పొఊర నీరాజనాలనూ వినోద ప్రారంభానికి చిహ్నంగా జన సమూహంపై చల్లే వాడు. ఆ తరువాత జనసమూహం ఒకరిపై మరొకరు పరిమళ ద్రవాలను రఆంగులతో కలిసి వసంతాన్ని చల్లుకొని వావి వరుసలు లేకుండా తటాకంలో దిగి జలక్రీడలతో విహరించేవారు.

కళాకారులకు, ఘన సత్కారం

ఆ తరువాత మహారాజు....... నిండి కొలువులో హాయకులకు, శిల్పులకు, నట్టువ రాండ్రకు, నటీ నటులకు బహుమానాలను సమర్పించి, పండితులను వేద పఠనాల మధ్య సన్మానించి, ఆనాటి రాత్రంతా........... జాగారం చేసేవాడు. నాటక ప్రదర్శనాలతోనూ సంగీత నృత్యాలతోనూ చెల్లారేది.

రెడ్డి రాజుల్లో ఆన వేమారెడ్డి, ప్రప్రథమంగా ఈ వసంతోత్సవాలను ప్రవేశ పెట్టాడు. ఆనాటి నుండి రెడ్డి సామ్రాజ్యంలో వసంతోత్సవాలౌ వైభవోపేతంగా జరుగుతూ వుండేవి. ఆ మహోత్సవ సమయాలలో కర్పూరాది పరిమళ ద్రవ్వాలను వెదజల్లడం వలన అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి రాజులకు, వసంత రాయ, కర్పూర వసంత రాయ బిరుదులు కలిగాయి; రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలు, జాతీయ వుత్సవలుగా జరిగేవి. విజయ నగర రాజుల కాలంలో కూడా ఈ వసంతోత్సవాలు, ముమ్మరంగా జరుగూ వుండేవి.

ఘటనృత్యం

ఆంధ్రదేశపు జానపద నృత్యాలలో ఈ ఘట నృత్యం ఒకటి. ఇతర నృత్యాలవలె ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించే నృత్యం కాదిది. ఈ పర్వదినాల్లోనూ ఈ నృత్యాలు జరగవు. ఒక్క జాతర్ల సందర్భాలలో తప్పా మారెప్పుడూ ఈ ఘట నృత్యాలు జరగవు.

గరగల సంప్రదాయానికీ, ఘటానికీ దగ్గర సంబంధమున్నా రెంటికీ కొంత వరకు వ్యత్యాసం ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాలలో ఒకప్పుడు వివిరిగా వాడుకలో వుండేవి. జాతర్లూ, జంతు బలులూ తగ్గిన తరువాత ఈ ఘట నృత్యాలు కూడా తగ్గి పోయాయి. ఆంధ్ర దేశంలో ఆనాది నుంచీ ప్రదర్శింప బడే ఈ నృత్యం జాతర్ల సందర్భంలో ప్రదర్శిస్తారు. పల్లెల్లో పశువులకు జాడ్యాలు వచ్చినప్పుడు, కలరా, మశుచికం వ్యాపించి నప్పుడు దేవతలకు ముడుపులు కట్టి మ్రొక్కుతారు. ఇలా మ్రొక్కిన కొన్ని దినాలకు గ్రామంలో ఇంటింటికి చందాలు వసూలు చేసి గ్రామ మధ్యలో దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ఒక నెల రోజులు పంబల కథలతో సాధులతో రాత్రిళ్ళు ప్రదర్శనలిస్తూ సన్నాయి వాయిద్య గాళ్ళ వీరంగ వాయిద్యం తోనూ, కనక తప్పెట్ల తోనూ మహోధృతంగా జాతర చేస్తారు. ఇలా జరిగే జాతరకు ముందు నెల రోజుల పైన వివరించిన ఘటం కుండ ఊరంతా ఇంటింటికీ తిరిగి, అన్నం, మజ్జిగలను కుండతో సేకరిస్తారు. ఇలా ప్రతి ఇంటి వద్దనూ సేకరించిన, అన్నం మజ్జిగను వాయిద్య కాలులూ రజకులూ పంచు కుంటారు.

రజకుల ప్రాతినిధ్యం.

ఇలా ఘటాన్ని నెత్తిన పెట్టుకుని వూరేగేవారు. చాకళ్ళు (రజలులు) ఘటం ఎత్తుకున్న వ్వక్తి ఎంతో ఉదృకంగా నృత్యం చేస్తాడు. ఇలా చేసే నృత్యానికి ఏ విధమైన శాస్త్రీయతా వుందని చెప్పలేము. కాని ఇది ఆవేశనృత్యం, ఘట నృత్యం చూసేటందుకు చాల ఉత్తేజంగా వుంటుంది. ఘటం ఇంటింటికీ తిరిగి అన్నం మజ్జిగ సేకరించడంలో వుద్దేశం కేవలం దేవతల సంతృప్తి కోసం అందుకు ప్రతి ఇంటివారు ప్రసాదం వేస్తారు.

ఘటం కుండను, పశుపుతోనూ, కుంకంతోనూ అలంగరిస్తారు. ఘటం యొక్క అంచుకు చుట్టూ వేపాకు తోరణం కడతారు. ఘటాన్ని చూస్తూనే అది ఒక దేవతా మూర్తిగా కనబడు తుంది. ఇక ఘటం ఎత్తుకున్న వ్వక్తి పూజ్య భావంతో ఎవరితోనూ మాట్లాడక, తప్పెట్ల వాయిద్యానికి అనుగుణంగా వీర నృత్యం చేస్తాడు. అలా చేసే నృత్యం ఎంతో భక్తి భావంతోనూ, నిండు నమ్మకం తోనూ జరుగుతుంది.

ఇలా జరిగే ఘట నృత్యానికి ఏ విధమైన సాహిత్యం గానీ వుండదు. కేవలం మూగ తాండవం ఎంతో ఆవేశపూరితంగా జరుగుతుంది...... ఇలా ఆవేశంగా జరిగే నృత్య సమయాల్లో కొంత మందికి పూనకం వస్తుంది........... ఇలా గణం పూనిన వ్వక్తులు చిందులు, శివాలు త్రొక్కుతారు. ఇలా త్రొక్కడం ప్రళయ తాండవ నృత్యంలా వుంటుంది. ఈ నృత్యాలు ఏ గ్రామాలో జాతర జారిగితే ఆ గ్రామంలో మాత్రమే ఈ ఘట నృత్యాలు జరిగుతూ వుంటాయి. కానీ ఈ నాడు జాతర్ల ప్రభావం తగ్గుతున్న కొద్దీ, ఈ నృత్య ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంది.