Jump to content

వసుచరిత్రము

వికీపీడియా నుండి

ఇది భారతములోని ఉపరిచర వసువు కథ. ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.[1]

ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడు. అధిష్ఠానపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలాహలునికి, శుక్తిమతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం.

వసుచరిత్రలో శుక్తిమతీ కోలాహల వృత్తాంతం అత్యంత రమణీయమైన ఘట్టం. ఈ సందర్భంలో కవి నదీ పర్వతాలకు దైవీరూపాన్ని ఆపాదించి రచించాడు.ఇలా రచించడం చమత్కారానికి మాత్రమే కాదు లౌకికానుభవానికి సంబంధించిన రాగబంధు రీతులను తెలియపరచాడానికి అని అనవచ్చును. ఇంకా భౌగోళిక సంబంధాన్ని మానవ దృష్టితో పరిశీలించి విమర్శించడం కోసం అని కూడా అనుకోవచ్చును. శుక్తిమతి యొక్క నిత్యనిర్మలాకార కాంతిధార కు కోలాహలుడు వశుడవడం విచిత్రమైన మనోవిలాసం. శుక్తిమతి తనని ఆదరిస్తుందని కోలాహలుని నమ్మకం. ఆమె అభిమతం తెలుసుకోకుండా ఆమెను పొందడానికి నిశ్చితాత్ముడు అవుతాడు కోలాహలుడు. కావ్యదృష్టితో పరికించేవారు శుక్తిమతీ కోలాహల వృత్తాంతాన్ని రసాభాసమన్నారు.ఏకత్రైనురాగం కారణంగా ఈ సన్నివేశంలో పోషింపబడినది రసాభాసమనడం సమ్మతమే. ఇందుకు ఇంకొక కారణం కూడా ఉన్నది: నదులకు, పర్వతాలకు ప్రణయం పొసగదని శుక్తిమతి ఇందులో వాచ్యం చేస్తుంది.పర్వతాలకు, నదులకు సఖ్యమా? వినటానికే యుక్తంగా లేదు పర్వతాల నుండి నదులు పల్లానికి ప్రవహిస్తాయి.ఆ నదీ జలం పర్వతానికెక్కడం ప్రకృతి విరుద్ధం. జన్య జనక సంబంధంలో పుత్రికా వాత్సల్యం ఉండాలి కాని అనుచతిమైన ప్రణయానురాగం ఉండకూడదని శుక్తిమతి ఉగ్గడిస్తుంది.వావి వరసలు తెలిసి వర్తించాలని బోధిస్తుంది. మదనవికారంలో గౌరవాన్ని మరచిపోకూడదు అంటుంది. పుణ్యదేశాలు తిరిగి భర్తృవియోగ తపనంచేత శరీరం కృశించగా, భర్తను (సముద్రుని) వెదకికొనిపోయె అభిసారికనని వాచ్యం చేస్తుంది. నదులు కొండలలో పుట్టి పుణ్యప్రదేశాలలో ప్రవహించి సముద్రాన్ని చెందుట లక్షణం. ఇటువంటి తనపై ఉద్దతి పనికిరాదని అతడు తరుణులైన రంభాదులను ఆశ్రయించడం యుక్తమని శుక్తిమతి చెబుతుంది. దీనికి కోలాహలుడు తనది పూర్వజన్మజన్మలప్రేమ అని అతడు చివరికి బలముతో పొందుతాడు.అందుకే వసురాజు దీనిని ఖలగోత్ర ధ్వంసనం అంటాడు. ఇది ఇలా ఉండగా రామరాజభూషణుడి వర్ణన, కవిత్వ పటిమ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది మూడు రోజుల్లో జరిగే కథ.

ప్రథమాశ్వాసము: కృతిభర్త వంశచరిత్ర, కోలాహలం శుక్తిమతి నదికి అడ్డంపడటం. ద్వితీయాశ్వాసము: కోలాహలం శుక్తిమతుల ప్రేమ. తృతీయాశ్వాసము: గిరిక, వసుపదుల పుట్టుక చతుర్థాశ్వాసము: పంచమాశ్వాసము: షష్ఠమాశ్వాసము:

  1. R.P.Sharma. "వసుచరిత్రము (సవ్యాఖ్యానం) Vasucharitramu (Savyakhya)" (in Indonesia). Retrieved 2024-04-17.{{cite web}}: CS1 maint: unrecognized language (link)