వస్త్రాపూర్ సరస్సు
వస్త్రాపూర్ సరస్సు భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలో గల అహ్మదాబాద్ కు పశ్చిమాన ఉంది. దీనికి అధికారికంగా గుజరాత్ కవి నర్సింగ్ మెహతా జ్ఞాపకార్థం భక్త కవి నర్సింగ్ మెహతా సరోవర్ అని పేరు పెట్టారు.
ఉద్యానవనం
[మార్చు]ప్రతి వారాంతంలో చాలా మంది ఈ సరస్సును సందర్శిస్తారు. ఇది ప్రస్తుతం ఒక ప్రదర్శనశాలను, పిల్లల ఉద్యానవనాన్ని కలిగి ఉంది. సరస్సు చుట్టూ ఉన్న మార్గం గుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో చాలా మంది జాగింగ్ చేస్తూ ఉంటారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
[మార్చు]ఈ సరస్సు చుట్టూ ఉన్న పచ్చని పచ్చిక బయళ్ళలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నర్మదా నది నుండి వచ్చే నీరు ఈ సరస్సులోకి అప్పుడప్పుడు వస్తుంది.[1]
నర్సింగ్ మెహతా
[మార్చు]2013 లో, నర్సింగ్ మెహతా జ్ఞాపకార్థం వస్త్రాపూర్ సరస్సును భక్త కవి నర్సింగ్ మెహతా సరోవర్ గా మార్చారు. సరస్సు తోటలో నర్సింగ్ మెహతా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.[2]
కరువు
[మార్చు]2016 లో, సరస్సు దాదాపు ఎండిపోయింది. ప్రజలు చనిపోయిన చేపలను తొలగించి, మిగిలి ఉన్న చేపలను వేరే చోటికి తరలించారు.[3]
అభివృద్ధి
[మార్చు]సెప్టెంబర్ 2019 లో, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ సరస్సును నర్మదా నది నీటితో నింపాలని ప్రణాళికలు వేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "Vastrapur Lake to become Narsinh Mehta Sarovar". 2013-02-25. Retrieved 2016-03-12.
- ↑ Prashant Dayal (2009-10-22). "Vastrapur Lake infused life in new Amdavad". The Times of India. Retrieved 2016-03-12.
- ↑ AFP (2016-04-30). "El Niño dries up Asia as La Niña looms". Cebu Daily News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-05-02.