వాంగీబాత్
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
వాంగీబాత్ అన్నము, వంకాయలతో చేసే ఫలహారము. దీనిని ఎర్రగడ్డ(ఉల్లిపాయలు) పెరుగు పచ్చడి చేర్చి లేక అలాగే ఆహారముగా తీసుకోవచ్చు. ఇది అన్నముతో చేసే ఆహారము కనుక దీనిని దక్షిణ భారతీయులు ముఖ్యముగా కన్నడిగులు ఎక్కువగా చేస్తారు. దీనిని అల్పాహారముగా తినవచ్చు.
కావలసిన పదార్ధాలు
[మార్చు]- బియ్యము-250 గ్రా
- వంకాయలు-250 గ్రా
- ఎర్రగడ్డలు-100 గ్రా
- పెద్ద నిమ్మకాయ-1
- నూనె-50 గ్రా
- నెయ్యి-25 గ్రా
- చెక్క-2 అంగుళాల ముక్క
- లవంగాలు-8
- యాలుకల-4
- జీడిపప్పు-50 గ్రా
- ఉప్పు-తగినంత
- కరివేపాకు
- తరిగిన కొత్తిమీరి-2
- అల్లము-1 అంగుళము ముక్క
- వెల్లుల్లి-1 గడ్డ
- కారపు పొడి-1 చెంచా
- వాంగీబాత్ పొడి-మూడు చెంచాలు
- గరమ్ మసాలా-1 చెంచా
తయారీ
[మార్చు]- బియ్యాన్ని కొలిచి ఒక గ్లాసుకు 4 గ్లాసుల నీరు పోసి అన్నము వండి పెట్టుకోవాలి.
- వంకాయలు ఒక్కొక్కటి 10 చీలికలు చేసి నీటిలోవేసి పెట్టుకోవాలి.
- ఎర్రగడ్డలు నులువు ముక్కలు లావుగా తరిగి పెట్టుకోవాలి.
- యాలుకలు పొడిచేసి పెట్టుకోవాలి.
- అన్నము వెడల్పాటి పళ్ళెములో ఆరపెట్టు కోవాలి.
- అన్నము మెత్తగా మెదిపి పెట్టు కోవాలి.
- సామాను అంతా పొయ్యి దగ్గర పెట్టుకొని, పొయ్యి మీద బాణలి పెట్టి నూనె, నెయ్యి వేసి కాగిన తరువాత చెక్క, లవంగాలు, జీడిపప్పు వేసి యాలుకల పొడి వేసిన
తరువాత కరివేపాకు, ఎర్రగడ్డలను చేర్చాలి. ఎర్రగడ్డలు వన్నె మారిన తరువాత నీళ్ళను బాగావడకట్టి, ముక్కలు వేసి బాగా వేగనిచ్చి, తరువాత నూరిన అల్లము, వెల్లుల్లి ముద్దను చేర్చిపచ్చి వాసన పోయేవరకు వేగనిచ్చి, వాంగీ బాత్ పొడర్, కొంచము కారపు పొడి, గరమ్ మసాలాపొడి అర చెంచా ఉప్పు చేర్చి చక్కగా కలిపి ఆరపెట్టిన అన్నములో వేసి, దానిపై 10 నిమ్మకాయను పిండి, 10 చెంచా ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీరి వేసి చక్కగా కలగలిపితే వాగీబాత్ తినడానికి సిద్ధం.
ఎర్రగడ్డ పెరుగు పచ్చడి
[మార్చు]- కావలసిన పదార్థాలు
- పెరుగు-2ర్త్రెండు గ్లాసులు
- ఎర్రగడ్డలు-2రెండు
- ఉప్పు -తగినంత
- కొత్తిమీరి-తరిగినది ఒక 5స్పూన్
- ఒక గిన్నెలోసన్నగా తరిగిన ఎర్రగడ్డలు ఉప్పు, కొత్తిమీరి వేసి పెరుగును చేర్చి చక్కగా కలిపితే ఎర్రగడ్డ పెరుగు పచ్చడి సిద్ధము.