వాటర్ ఫైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీటి యుద్ధమాట

వాటర్ ఫైట్ లేదా నీటి యుద్ధం అనగా నీటిని ప్రత్యర్థులపై నేరుగా లేదా పరికరాలతో చల్లి లేదా విరజిమ్మి వారిని తడిసేలా చేయడం. బకెట్లు, బుడగలు, నీటి తుపాకులు మరియు దోసిళ్లతో ఇలా దేనినైనా ఉపయోగించి నీటిని విరజిమ్మి ఈ నీటి యుద్ధమాట ఆడతారు. త్వరిత, సాధారణ, సుదీర్ఘ మరియు టోర్నమెంట్ తరహా ఆటల వలె మరియు నీటి ఆట కార్యక్రమాలలో ఈ నీటి యుద్ధమాటలు అనేక స్థాయిలలో ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

ఈ నీటి యుద్ధమాట మొదట స్నేహితులు ఒకరిపై ఒకరు నీరు చల్లుకోవడం ద్వారా ప్రారంభమయింది. నీటి ఆట ఇతర జంతువులలో కూడా కనబడుతుంటుంది, వేసవిలో కోతులు లేదా ఏనుగులు వంటివి ఒకదానిపై మరొకటి నీటిని చల్లుకుంటూ చల్లబరచుకుంటుంటాయి. ఇతరులపై నీటిని చల్లేందుకు మానవులు మొదట దోసిళ్లతో నీటిని తీసుకొని విసరటం ద్వారా చేసేవారు. తరువాత వివిధ సహజ వస్తువులను ఉపయోగించడం తెలుసుకున్నాడు, ఆ తరువాత నీటిని దూరంగా చిమ్మగల సామర్థ్యము గల వివిధ రకాల ఆకర్షణీయమైన పరికరాలను తయారు చేసి వాటిని ఉపయోగిస్తున్నాడు.

ఈత కొట్టేటప్పుడు[మార్చు]

స్నేహితులు ఈత కొట్టే సమయంలో ఒకరిపై మరొకరు చేతులతో అలల వలె నీటిని విరజిమ్ముకుంటారు. సాధారణంగా ఈత కొట్టేటప్పుడు తాకుడాట సమయంలో ప్రత్యర్థి తాకకుండా ఉండేందుకు ప్రత్యర్థిపై చేతులతో అలల వలె నీటిని చిమ్ముతారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

హోళీ - ఒకరిపై ఒకరు రంగు నీళ్ళను చల్లుకునే ఒక పండుగ